Kartik Purnima
-
సముద్ర స్నానాలు ఆచరించి..భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
రాజమండ్రి పుష్కరఘాట్‌లో కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలు
-
కార్తీక పౌర్ణమి : వైఎస్ఆర్ విగ్రహానికి పూజలు
-
దక్షిణాది బద్రి... లింబాద్రి
పుణ్య తీర్థం నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రి గుట్ట తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం. పచ్చని కొండల నడుమ ప్రకృతి రమణీయత మధ్యన అలరారే ఈ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని సందర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే రథోత్సవానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడాభక్తులు వస్తారు. భీమ్‌గల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. రెండంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తుపైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడ వీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి. రెండవ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్టు ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడు లింగాలు ఉంటాయి. గుహమార్గం ద్వారా వంగుని 250 మీటర్లు వెళితే రాతి గుహలతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి మూల విరాట్టు, పక్కనే నరనారాయణుల (కృష్ణార్జునుల) విగ్రహాలు కనువిందు చేస్తాయి. శాంత నరసింహుడు సాధారణంగా ఏ నరసింహ క్షేత్రంలో చూసినా స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తొడపైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత రూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూ నరసింహ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ క్షేత్రాలలో ఇదొకటి. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పార్వతి పాదాలను చూడడంతో కోపోద్రిక్తుడైన ముక్కంటి తన గోటితో బ్రహ్మ ఐదవ తలను తొలగించాడని పురాణం చెబుతుంది. దీంతో బ్రహ్మ ఇక్కడే తపమాచరించి శ్రీహరిని నరసింహుడిగా సాక్షాత్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో లక్ష్మీసమేతుడుగా స్వామి వారు ఇక్కడే వెలియడం అరుదైన విషయమని చెబుతారు. దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధి పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే∙ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్‌గా విశిష్టత వచ్చింది. జోడులింగాలు పరమశివుడు తనకు సంప్రాప్తించిన బ్రహ్మహత్యా దోష నివారణకై తపమాచరించి దోష విముక్తుడై శ్రీవారి ఆజ్ఞచే ఈ క్షేత్రంలోనే జోడు లింగాల రూపాన వెలిసాడట. ఇందుకు ప్రతీకగా గర్భాలయ మార్గ ప్రవేశ ద్వారం వద్ద భక్తులకు జోడు లింగాలు దర్శనమిస్తాయి. యముడు ఈ క్షేత్రంలో బిల్వవృక్ష రూపంలో తపమాచరించి శాంతి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడు ఈ క్షేత్రంలో స్వామిని కమలాలతో పూజించి శాప విముక్తుడైనాడట. అయోధ్య హనుమాన్ శ్రీరాముని ఆజ్ఞతో కవి పుంగవుడైన హనుమంతుడు ఇక్కడకు వచ్చి తపమాచరించి నరసింహుని రూపంలో ఉన్న శ్రీరాముని దర్శించాడట. అందుకే కొండ దిగువ ప్రాంతంలో క్షేత్ర పాలకుడైన అయోధ్య హనుమాన్ ఆలయం కనిపిస్తుంది. కమలా పుష్కరిణి ఇక్కడి పుష్కరిణికి కమలా పుష్కరిణిగా పేరు. సతీ విక్రయ దోషనివారణకై సత్య హరిశ్చంద్రుడు నరసింహుని సేవించి తరించాడట. నరనారాయణులు సన్నిధానంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారట. ధర్మరాజు ఈ క్షేత్రాన్ని దర్శించి కృతార్థుడైనట్లు, ప్రహ్లాదుడు తపమాచరించినట్లు పురాణకథనం. నామధేయులు ఈ ప్రాంతంతో పాటు జిల్లా, పక్క జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో అడుగడుగునా లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య, నర్సయ్య, నర్సింగ్ తదితర పేర్లు గల వ్యక్తులు తారసపడతారు. మండలంలో అడుగుడుగునా ఈ పేర్లు గల వాళ్లు కనబడతారు. ఎలా వెళ్లాలి హైదారాబాద్ నుండి నేరుగా ఆర్మూర్ వరకు బస్సులో రావచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి ఆర్మూర్ వరకు 25 కి.మీ. అక్కడి నుండి భీమ్‌గల్ మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు. భీమ్‌గల్ నుండి 5 కిలో మీటర్ల దూరంలోని లింబాద్రి గుట్టకు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే దేవాలయం బస సౌకర్యం కల్పిస్తుంది. – కైర రవి గౌడ్, సాక్షి, భీమ్‌గల్, నిజామాబాద్ జిల్లా -
కళ తప్పిన కార్తీకం
మార్కెట్లు వెలవెల సామాన్యులకు ‘చిల్లర’ సమస్యలు గిరాకీ లేక వ్యాపారులూ సతమతం ఏటీఎంలలో నో క్యాష్..దిక్కుతోచని జనం సిటీబ్యూరో: కార్తీక పౌర్ణమి..అదీ సోమవారం రావడంతో వ్యాపారాలు బాగా జరుగుతాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. పెద్దనోట్ల రద్దు..చిల్లర సమస్యతో ‘కార్తీక మార్కెట్’ కళతప్పింది. సోమవారం నగరంలోని గుడిమల్కాపూర్, సుల్తాన్‌బజార్, బడిచౌడీ మార్కెట్, అబిడ్స, బేగంబజార్, సిద్దంబర్‌బజార్, మోండా మార్కెట్, జుమ్మెరాత్బజార్లలో పూలు, పూజా సామాగ్రి అమ్మకాలు సగం పడిపోయాయని తెలుస్తోంది. మరోవైపు చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు కూడా చేసేదేమీ లేక ధరలను అమాంతం పెంచేశారు. ఓ పక్క నోట్ల రద్దు, మరో పక్క పూల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పూలను రూ. 400 కిలో చొప్పున వ్యాపారులు విక్రరుుంచారు. పలువురు వినియోగదారులు రూ.వెరుు్య(పాతవి),రూ. 2000 కొత్త నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేక వ్యాపారస్తులు తిప్పి పంపారు. మరికొందరు చిల్లర కోసం రూ.వెరుు్యకి రూ.100 కమీషన్‌గా వసూలు చేశారు. కూరగాయల మార్కెట్లకు వచ్చేవారు రూ. 500 నోట్లు తెస్తుండడం.. వారు కొనుగోలు చేసేది రూ.20, రూ.50 మాత్రమే కావడంతో మిగతా మొత్తానికి చిల్లర ఇవ్వలేక సతమతమౌతున్నట్లు పలువురు వ్యాపారులు వాపోయారు. గత నాలుగు రోజుల నుండి వ్యాపారం సగం పడిపోరుుందని పలువురు చిల్లర వ్యాపారులు వెల్లడించారు. నోట్ల యాతన! పెద్ద నోట్ల రద్దు మహానగరంలో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చివేసింది. బ్యాంకులకు సోమవారం సెలవుకావడం, ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం నరకయాతన అనుభవించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూలు, పండ్లు ఇతర నిత్యావసరాలకు మార్కెట్లకు పోటెత్తిన జనానికి చిల్లర కష్టాలు చుక్కలు చూపారుు. ప్రతి ఒక్కరూ రూ.500, రూ.వెరుు్య నోట్లతో తరలిరావడంతో వ్యాపారులు సైతం చేసేదిలేక చేతులెత్తేశారు. చిల్లర కష్టాలతో పలు మార్కెట్లలో కొనుగోళ్లు అమాంతం పడిపోయారుు. మరికొన్ని చోట్ల ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచేసి వినియోగదారులను నిలువుదోపిడీ చేశారు. మరికొందరు రూ.వెరుు్య నోటు మార్చితే రూ.900 మాత్రమే ముట్టజెప్పారు. రూ.100 కమీషన్‌గా నొక్కేయడంతో వినియోగదారులు చేసేది లేక వారు అడిగినంతా చెల్లించారు. గ్రేటర్‌పరిధిలో ఏడు వేల ఏటీఎం కేంద్రాలుండగా..సోమవారం రెండువేలు కూడా పనిచేయకపోవడం గమనార్హం. వాటిల్లోనూ నగదు నిల్వచేసిన గంట లోపే నిండుకోవడంతో భారీ క్యూలైన్లలో నిల్చున్న వారు సొమ్మసిల్లారు. మహిళలు, వృద్ధులు, చంటిపిల్లలతో ఏటీఎం కేంద్రాలకు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. పలు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చారుు. పలు ఏటీఎంలలో మధ్యాహ్నం వేళకే నగదు అరుుపోరుుంది. దీంతో చాలా మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండానే వెనుదిరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏటీఎంల నుంచి తీసుకునే డబ్బు పరిమితి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ‘కొత్త’ చిక్కులు... గత నాలుగురోజులుగా బ్యాంకుల నుంచి రూ.2 వేల నోట్లు పొందిన వినియోగదారులకు..ఆ సంబురం సోమవారం ఆవిరైంది. ఈ నోట్లతో కూరగాయలు, పాలు, పండ్లు, పూలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బహిరంగ మార్కెట్లో అడుగుపెట్టిన వారికి తిప్పలు తప్పలేదు. రూ.500కే చిల్లర ఇవ్వలేమని..అదీ రూ.2 వేల నోట్లకు ఎలా చిల్లర ఇవ్వగలమంటూ పలువురు వ్యాపారులు చేతులెత్తేయడంతో ఈ నోట్లుకూడా అలంకార ప్రాయంగా మారాయని పలువురు వినియోగదారులు వాపోయారు. రైతుబజార్లు, మార్కెట్లలో ప్రత్యేకంగా చిల్లరకు కౌంటర్లు ఎర్పాటు చేయాలని వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
భక్తి సాగరం
సూర్యలంక తీరంలో కార్తీక కాంతులు సాగర హారతి వీక్షించేందుకు పోటెత్తిన పర్యాటకులు లక్షల సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు కిక్కిరిసిన శైవాలయాలు.. దీపాలతో ప్రత్యేక పూజలు కోటప్పకొండపై వైభవోపేతంగా జ్వాలాతోరణం బాపట్లటౌన్/నరసరావుపేట రూరల్ కార్తీకపౌర్ణమిను పురస్కరించుకొని సూర్యలంక, నిజాంపట్నం సముద్రతీరాలకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో కూడిన పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుక తిన్నెలపై పిండి ముగ్గులేసి, మధ్యలో గొబ్బెమ్మలుంచారు. ఇసుకతో తయారుచేసిన గౌరీదేవి ప్రతిమలకు ప్రత్యేకపూజలు నిర్వహించి, గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లు సముద్రంలోకి వదిలారు. సూర్యలంక తీరానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజామున 3.30 గంటల నుంచే తీరానికి వచ్చారు. భక్తులు, అయ్యప్ప, భవానీ, శివ మాలలు ధరించిన దీక్షాపరులు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలోను, తీరం వెంబడి నూతనంగా ఏర్పాటుచేసిన శివలింగం, నందీశ్వరుని ప్రతిమలకు పూజలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన యువకులు, వివిధ కళాశాలల విద్యార్థులు ఆహ్లాదకర తీరంలో కేరింతలు కొట్టారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో సూర్యలంక తీరానికి పర్యాటకులు వస్తారని ముందుగానే అంచనావేసిన పోలీసుశాఖ తీరంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 15 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటుచేశారు. బాపట్ల డిఎస్పీ పి.మహేష్ ఆధ్వర్యంలో 750 మంది పోలీసులు తీరంలో విధులు నిర్వర్తించారు. మత్స్యశాఖాధికారి ఉషాకారిణ్ ఆధ్వర్యంలో తీరంలో 5 ప్రత్యేకబోట్లు, 50 మంది గజఈతగాళ్ళను అందుబాటులో ఉంచారు. మండలంలోని అప్పికట్ల, వెదుళ్ళపల్లి, నరసాయపాలెం పీహెచ్‌సీల పరిధిలోని ఆరోగ్యసిబ్బంది వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రెడ్‌క్రాస్ తరపున 120 మంది ఎన్సీసీ, 120 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సాయంత్రం వరకు తీరంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. త్రికోటేశ్వరుని సన్నిధిలో జ్వాలాతోరణం.. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండపం ఎదుట జ్వాలాతోరణం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించగా.. భక్తులు ఆ తోరణం గుండా ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలయ ట్రస్టీ రామకృష్ట కొండలరావు, ఈవో శ్రీనివాసరావు, సుధాకరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రెంటచింతల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 108 కోట్ల వత్తులతో దీపారాధన నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని శ్రీ కాశీవిశ్వనాథుని ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. రేపల్లె పట్టణం ఇసుకపల్లిలోని అయ్యప్ప ఆలయంలో లక్ష వత్తులతో శివలింగాకృతిలో దీపాలు వెలిగించారు. నిజాంపట్నం సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తొలిసారి సాగర హారతి.. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం వద్ద సాగరు హారతి ఇచ్చి సముద్రస్నానాలను ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఉదయం 4.30గంటలకు వేదపండితుల సమక్షంలో హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర హారతి ఇవ్వటం ఇదే తొలిసారి కావటంతో భక్తులు భారీగా కార్యక్రమానికి పాల్గొన్నారు. వల్లూరు భావన్నారాయణ, నెమ్మలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ నరసింహులు, త హశీల్దార్ టి.వల్లయ్య, మున్సిపల్‌చైర్మన్ తోట నారాయణ, ఎంపీపీ మానం విజేత, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఆరనీకుమా.. కార్తీకదీపం
ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు కిటకిటలాడిన ప్రముఖ శివలయాలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు శివాలయాల్లో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు దిల్సుఖ్నగర్: శివశివ శంకర భక్తవ శంకర శంబోహరహర మహదేవా...ఆరనీకుమా ఈదీపం.. కార్తీకదీపం.. చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం..అంటూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని యువతులు, మహిళలు, భక్తులు బుధవారం మల క్పేట్/మహేశ్వరంజోన్ పరిధిలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాక్షరీ మ ంత్రంతో ఆలయప్రాంతాలు మార్మోగాయి. ఈసందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసి కార్తీకమాస దీపారాధనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నాలుగు గం టల నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు,పిల్లలు,పెద్దలు ఆలయాల వద్దకు చేరి కార్తీక దీపారాధనలు చేసి , అక్కడ ఏర్పాటు చేసిన ఉసిరిచెట్టుకు ప్రదక్షణలు, తులసీ పూజలు నిర్వహించి అనంతరం ఇంటి నుంచి తీసు కువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దైవ దర్శనం కోసం ఆలయాల ముందు భక్తులు భారులు తీరారు. జోన్ పరిధిలోని ఆర్కేపురంలో ఉన్న శ్రీఅష్టలక్ష్మీ దేవాలయం,సరూర్‌నగర్‌లోని శివాలయం,ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, అక్బర్‌బాగ్‌లోని హరిహరక్షేత్రం దిల్సుఖ్నగర్ లోని శివాలయం, శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవాలయం, చైతన్యపురి, కొత్తపేట కర్మన్‌ఘాట్‌లోని శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరక్షేత్రం, మల క్పేట్, మాదన్నపేట్, సైదాబాద్, ఐఎస్‌సదన్, చంపాపేట్, సంతోష్‌నగర్, జిల్లెలగూడ, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, నాదర్‌గూల్, జల్పల్లి, మామిడిపల్లి ఆలయాలతో పాటు పలు శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో కార్తీకపౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో కార్తీక వనబోజనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరాక్షేత్రం, మన్సూరాబాద్ శ్రీఅయ్యప్పస్వామి దేవాలయం , సైదాబాద్ విజయదుర్గా ఆలయం, దిల్సుఖ్నగర్ శివాలయాలతోపాటు పలు ఆలయాల్లో భక్తులు అయ్యప్ప మాల ధా రణ చేశారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాలు, పార్కుల్ల్లో కార్తీక వనభోజన నిర్వహించుకోవడంతో కాలనీలలో పండుగవాతావరణం నెలకొంది. ఆలయాలన్నీ కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి నిర్వాహకులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. -
ద్వాదశ దర్శనం
కార్తికం కార్తికమాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. శివభక్తులు ఈ నెల్లాళ్లూ అత్యంత భక్తిశ్రద్ధలతో సదాశివుడిని కొలుస్తారు. శూలపాణి అయిన శివుడు కార్తిక పౌర్ణమి రోజున దేవతలను ముప్పుతిప్పలు పెట్టిన త్రిపురాసురుడిని సంహరించి, ముల్లోకాలను కాపాడాడని ప్రతీతి. సోమవారం శివుడికి ప్రీతిపాత్రం కావడంతో కార్తీక సోమవారాల్లో ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు. వేకువనే శివాలయాలకు వెళ్లి పూజార్చనలలో పాల్గొంటారు. మన దేశంలో శివాలయాలు లేని ఊళ్లు దాదాపు ఉండవు. అయితే, ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రం శివభక్తులకు తప్పనిసరి సందర్శనీయ క్షేత్రాలు. సాధారణ దినాలలో కంటే, కార్తికమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శివభక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా వరుస క్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి ఒక విహంగ వీక్షణం... 1. సోమనాథుడు గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే వారు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఈ క్షేత్రంపై పదహారుసార్లు దాడులు జరిగాయి. అన్నిసార్లూ పునర్నిర్మాణమూ జరిగింది. ఇది శైవులకు మాత్రమే కాదు, వైష్ణవులకూ సందర్శనీయ క్షేత్రమే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. 2. మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉంది. తమలో ఎవరు అధికులనే దానిపై బ్రహ్మకు, విష్ణువుకు ఎడతెగని వాదులాట జరిగినప్పుడు శివుడు ఇక్కడ ముల్లోకాలనూ ఆక్రమిస్తూ అద్యంత రహిత జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాంబశివుడు ఇక్కడ మల్లికార్జున స్వామిగా వెలశాడు. శ్రీశైలం శైవక్షేత్రం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. సతీదేవి పెపైదవి ఇక్కడ పడినందున ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. 3. మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్‌లో ఉంది. మహాశివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొక్కటే స్వయంభూలింగం. ఇక్కడ మహాకాళేశ్వరుడిగా పరమశివుడు పూజలందుకుంటున్నాడు. మహాకాళేశ్వరుడినే దక్షిణామూర్తిగానూ ఆరాధిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఉజ్జయిని కూడా ఒకటి. ఇక్కడ మహాకాళిగా ఆదిశక్తి ఆరాధనలు అందుకుంటోంది. శివశక్తులు ఒకేచోట ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడి కాలభైరవుడి ఆలయం కూడా సుప్రసిద్ధ సందర్శనీయ క్షేత్రం. 4. ఓంకారేశ్వరుడు ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. మాంధాత తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు. నర్మదా నదీ తీరంలో శివుడు ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. నారద మహాముని ఒకసారి వింధ్య పర్వతానికి వచ్చి, మేరుపర్వతం గొప్పదనం గురించి చెప్పాడు. మేరువును మించిపోవాలనే తపనతో వింధ్య పార్థివ లింగాన్ని స్థాపించి తపస్సు చేయగా, మెచ్చిన శివుడు ఇక్కడ ఓంకారేశ్వరుడిగా వెలసినట్లు ప్రతీతి. అమరులకు ఈశ్వరుడైనందున అమరేశ్వరుడిగా కూడా ఓంకారేశ్వరుడిని కొలుస్తారు. 5. బైద్యనాథేశ్వరుడు నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్‌లో బైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం రావణాసురుడు తన పదితలలనూ తెగనరుక్కోవడంతో ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి, ఆ తలలన్నింటినీ అతికించడం వల్ల ఈయనకు వైద్యనాథేశ్వరుడని పేరు వచ్చింది. అయితే వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి భిన్న కథనాలు వినవస్తాయి. మహారాష్ట్రలోని పర్లి (పరల్యాం వైద్యనాథం చ)లో హిమాచల ప్రదేశ్‌లోని ైబె థ్యనాథ్లోనూ ఉన్న లింగాలకు కూడా వైద్యనాథుడనే పేరు.. 6. కేదారనాథుడు ఉత్తరాఖండ్‌లో హిమాలయాల వద్ద మందాకినీ తీరాన ఉంది. ఏటా అక్షయ తృతీయ మొదలుకొని కార్తిక పూర్ణిమ వరకు మాత్రమే కేదార్‌నాథ్‌లోని ఆలయం భక్తుల కోసం తెరుచుకుని ఉంటుంది. ఆ తర్వాత శీతాకాలంలో ఆరునెలల పాటు ఇక్కడి విగ్రహాలను ఉఖిమఠానికి తరలించి, అక్కడ పూజపునస్కారాలను కొనసాగిస్తారు. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారు. 7. భీమశంకరుడు మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమశంకరేశ్వర ఆలయం ఉంది. భీమశంకర్ నుంచే భీమా నది మొదలవుతుంది. రాయచూర్ వద్ద ఇది కృష్ణా నదిలో కలుస్తుంది. సహ్యాద్రిపర్వతాలలో గల ఈ లింగం భీమశంకరుడిగా ప్రసిద్ధిపొందింది. ఈ ప్రదేశానికి పురాణాలలో ఢాకిని అనే పేరుంది. భీముడు ఈ లింగాన్ని పూజించడం వల్ల భీమశంకరుడని పేరు వచ్చింది. 8. రామేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ రామేశ్వరంలో కొలువై ఉన్న లింగమే అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి పొందింది. రాముడు ప్రతిష్టించి సేవించినందు వల్ల ఈ లింగానికి రామేశ్వర లింగమని పేరు. 9. నాగేశ్వరుడు గుజరాత్‌లోని ద్వారకలో కొలువై ఉన్న ఈ నాగేశ్వర జ్యోతిర్లింగమే ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాచీనమైనదిగా విశ్వసిస్తారు. నాటి దారుకావన మే నేటి ద్వారక. శివపురాణంలో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించిన వారి సర్వకష్టాలనూ నివారిస్తానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా మారిపోయాడంటారు. 10. విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీవిశ్వనాథుడికి ఉన్న ప్రాశస్త్యం మరేలింగానికీ లేదంటే అతిశయోక్తి కాదు. శివుడికి కాశీనగరమంటే ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే, తనకు భిక్ష దొరకలేదని అలిగిన వ్యాసుడు ఆ నగరాన్ని శపించడానికి సిద్ధపడేసరికి అమితంగా ఆగ్రహించి, వ్యాసుడినే నగరం నుంచి వెళ్లగొట్టాడట. అత్యంత పురాతన నగరమైన కాశీకి మహాశ్మశానమని పేరు. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కాశీవిశ్వనాథుడిని సందర్శించిన వారికి ముక్తి లభిస్తుందని, కాశీలో మరణించిన వారికి అంత్యసమయంలో శివుడే స్వయంగా తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. 11. త్య్రంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ వద్దగల త్రయంబకేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. తమకు జ్ఞానబోధ చేసిన ఈశ్వరుడిలో బ్రహ్మ, విష్ణువులు ఐక్యం అయిపోవడం వల్ల ముగ్గురూ కలిసి త్య్రయంబకేశ్వర లింగంగా ఆవిర్భవించారు. పరమ పావనమైన గోదావరి నది ఇక్కడే పుట్టింది. ఈ గోదావరికి గౌతమి అని పేరు. త్య్రంబకేశ్వరుని సేవించిన వారికి సకల విద్యలు అబ్బుతాయట. మోక్షం లభిస్తుందట. 12. ఘృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో ఉన్న ఈ ఆలయం శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో చెప్పిన చిట్టచివరి ద్వాదశ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటారు. ఘృష్ణేశ్వర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో గల వెరుల్లో ఉంది ఈ ఆలయం. ఘృశ్నే అనే భక్తురాలి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా అవతరించినందువల్ల ఈయనకు ఘృష్ణేశ్వరుడని పేరు వచ్చింది. ఘృష్ణేశ్వరుని సేవించిన వారికి సంతాన నష్టం, అకాల మృత్యువు ఉండవని విశ్వాసం. శైవక్షేత్రాలు... ఎన్నెన్నో..! ఒక్కోలింగానికి ఒక్కో విశిష్ఠత. ఇంకా... పంచభూతలింగాలున్నాయి. ఇవిగాక పంచారామాలున్నాయి. ఇంతేనా... కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయాలు ఈ పృథ్విపై ఉన్నాయి. శైవక్షేత్రాలను సందర్శించినా, విన్నా, పఠించినా పుణ్యప్రదమే. - పన్యాల జగన్నాథదాసు, డి.వి.ఆర్. భాస్కర్ -
తిరుమలలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు
తిరుమల: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, అధికారులు కుండలలో నేతి దీపాలను ఊరేగింపుగా తీసుకవెళ్లారు. నిండు పున్నమి వేళ దీపాల వెలుగులో స్వామివారిని వీక్షించి భక్తులు ఆనందపరవసులయ్యారు. -
పది నిమిషాలైతే...గమ్యస్థానానికి చేరేవారు...
అంతలోనే మృత్యువు తరుముకొస్తున్నట్లుగా...వరికోత యంత్రం రాంగ్రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టింది...గుండెల్లో గునపాలు దిగినట్టుగా... హార్వెస్టర్ ఇనుపరాడ్లు...ఇద్దరి గుండెల్లో గుచ్చుకున్నాయి...తండ్రి ఎగిరిపడగా...కూతురు ఆ రాడ్లకు చిక్కుకుపోయింది...ఈ దృశ్యం...అందరినీ కంటతడి పెట్టించింది....తండ్రి, అక్క విగతజీవులయ్యారు..అమ్మ గాయాలతో ఆస్పత్రిలో చేరింది...ఏం జరిగిందో తెలియక...ఆ చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు...సొంతూరికి వెళుతున్నామన్న ‘సంతోషమే’ లేదు... అయ్యప్ప పూజకు బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబానికి అనుకోని ఆపదఎదురైంది.. మరో పదినిమిషాలు గడిస్తే గమ్యస్థానానికి చేరుకునే వారు.. విధి వక్రీకరించింది.. మృత్యురూపంలో వచ్చిన వరికోత యత్రం.. ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. రాంగ్రూట్లో వచ్చిన యంత్రం బైక్‌ను ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వేములపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన గుడిపల్లి వెంకట్‌రెడ్డి (34) హుజూర్‌నగర్‌లో బ్యాటరీల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్ల పాటు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు బ్యాటరీల కంపెనీలో పనిచేశాడు. ఆరేళ్ల క్రితం జ్యోతిని పెళ్లి చేసుకుని హుజూర్‌నగర్‌లో దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి శ్రీజ(4), సంతోష్‌రెడ్డి జన్మించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వగ్రామంలో గురువారం తన కుటుం బం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి పూజల్లో పాల్గొనేందుకు భార్య, పిల్లలతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. మరో అర కిలోమీటరు వెళితే రహదారి ని క్రాస్ చేసి తన గ్రామం వెళ్లే రోడ్డు వైపు చేరుకునేవాడు. ఇంతలోనే మృత్యువు రూపంలో రాంగ్ రూట్లో వచ్చిన వరికోత యంత్రం మాడ్గులపల్లి సమీపంలో బైకును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ముందు కూర్చొని ఉన్న కూతు రు శ్రీజ (4), వెంకట్‌రెడ్డి ఎగిరి యంత్రంపై పడడంతో రాడ్లు గుచ్చుకుని అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. బైక్‌పై వెనక కూర్చున్న వెంకట్‌రెడ్డి భార్య, రెండేళ్ల కుమారుడు సంతోష్‌రెడ్డి పక్కకుపడడంతో జ్యోతికి గాయాలయ్యా యి. సంతోష్‌రెడ్డికి ఏలాంటి గాయాలు కాలేదు. స్థానికు లు గాయపడిన జ్యోతిని, ఆమె కుమారుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లిదండ్రి కనిపించకపోవడంతో బేలాగా రోదిస్తున్న సంతోష్‌రెడ్డిని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. కలచివేసిన ప్రమాద దృశ్యాలు మాడ్గులపల్లి వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మరికొంత మంది అయితే కళ్లు తిరిగి పడిపోయారు. గ్రామస్తులు, బంధువులు వరికోత యంత్రానికి ముందు రాడ్లు పెట్టుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే అర్ధగంట సేపు రాస్తారోకో చేశారు. పోలీసులు సర్థిచెప్పి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్రప్పగూడెంలో విషాదఛాయలు గుర్రప్పగూడెం(వేములపల్లి) : అందరితో కలుపుగోలుగా ఉండే వెంకట్‌రెడ్డి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. తన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప పూజలో పాల్గొనేందుకు వస్తూ కూతురితో సహా వెంకట్‌రెడ్డి మృతిచెందడంతో గుర్రప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజతో సందడిగా ఉండాల్సిన భిక్షంరెడ్డి ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భిక్షంరెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ఆరనీకుమా ఈ దీపం...కార్తీక దీపం..!
శ్రీకాకుళం కల్చరల్/ఎచ్చెర్ల రూరల్:కార్తీక పౌర్ణమి పూజలు, వ్రతాలను జిల్లా వాసులు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు నదులు, చెరువులు, కాలువల్లో పుణ్యస్నానాలాచరించి అరటి దొప్పలపై కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. దీప కాంతుల వలే జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేయాలని ప్రార్థించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయ ఈవో సన్యాసిరాజు, అర్చకు డు శ్రీరామ్మూర్తిలు ముందుగా ఉమారుద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం నాగావళి న దికి హారతులిచ్చారు. కార్తీక పూజలకు హాజరైన భక్తులతో నాగావళి నదీతీరం సంద డిగా మారింది. అలాగే, కుంచాలకూర్మయ్యపేట వద్దనున్న దేవీ ఆశ్రమంలోని 1001 శ్రీ చక్రాలకు ఆలయ నిర్వాహకుడు బాలభాస్కరశర్మ ఆధ్వర్యం లో భక్తులు కుంకుమార్చనలు జరి పారు. లలిత పారాయణం చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం శ్రీచక్రాల వద్ద దీపాలంకరణ చేశారు. పౌర్ణమి వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
గౌతమికి హారతి
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పుణ్యనదీ హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం గోదావరి నదీ తీరంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి స్వామి వారి పాదుకలతో ముందు నడువగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి వెళ్లారు. వేద విద్యార్థుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాలతో స్వామి వారి పాదుకలను ప్రత్యేక పల్లకిలో తీసుకెళ్లారు. ముందుగా స్నానఘట్టాల రేవులో ఉన్న గోదావరి మాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపైకి స్వామి వారి పాదుకలను తీసుకెళ్లారు. వేద స్వస్తి చెప్పిన తరువాత ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదుకలకు పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి స్నాన, వస్త్ర, ఉత్తరీయాలను సమర్పించిన పిదప అభిషేకం గావించారు. గోదావరి నది విశిష్టతను, కార్తీక దీపాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి భక్తులకు వివరించారు. నది వృద్ధిని కోరుతూ హారతి ఇస్తారని, దీనికి ఎంతో విశిష్టత ఉందని చెప్పారు. భక్తజనంతోనే నదీ పూజ... వేడుకలో భాగంగా గోదావరి నదికి అత్యంత వైభవంగా అర్చకులు, వేదపండితులు పూజగావించారు. ముందుగా సకల జనులంతా బాగుండాలని కోరుతూ సంకల్పం చెప్పారు. దీనిని భక్తులందరిచేత కూడా చెప్పించి, వారిని కూడా నదీ పూజలో భాగస్వాములను చేశారు. పుష్పాలు, కుంకుమ, సుగంధ ద్ర వ్యాలు గోదావరి నదిలో వేస్తూ, దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత ‘భద్రాద్రి వరద గోవిందా’ అనే శ్లోకాన్ని భక్తులతో చెప్పించారు. గోదావరి నదీ అష్టోత్తర శతనామాచార్చన గావించారు. గోదావరి నదికి నివేదన జరుగుతున్నంత సేపూ నదీ వైభవాన్ని స్థలశాయి భక్తులకు వివరించారు. అమ్మవారికి తాంబాలాలను సమర్పించిన తర్వాత ముందుగా ఈవో కూరాకుల జ్యోతి దంపతులు గోదావరి నదికి హారతులు ఇచ్చారు. అనంతరం అర్చకులు ఐదు రకాల హారతులు ఇచ్చారు. ప్రణవ శంఖ నాదముల నడుమ మహాహారతి నేత్రపర్వంగా సాగింది. గోదారి తీరంలో దీపోత్సవ సందడి... నదీ హారతులు ఇచ్చిన సమయంలో భక్తులు కూడా గోదావరిలో కార్తీక దీపాలను వదిలేందుకు ఎంతో ఆసక్తి చూపించారు. దేవస్థానం వారు భక్తులకు ముందుగానే అరిటి దొప్పలతో కూడిన ప్రమిదలను ఇవ్వటంతో వాటిని వెలిగించి గోదావరిలో విడిచారు. వేడుక జరుగుతున్నంత సేపూ గోదావరి తీరంలో బాణా సంచా వెలుగులు విరజిమ్మాయి. భద్రాచలానికి చెందిన చిన్నారులు అమరవాది శ్రీజ, కె.తన్మయి లయబద్ధంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఎస్సై మురళి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖాధికారి సురేష్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్ గోదావరి ఘాట్‌లో పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబు, డీఈ రవీందర్, శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
గోదారమ్మకు ఘన నీరాజనం
నిష్ణాతులకు గోదావరి పురస్కారాలు సాక్షి, రాజమండ్రి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ గోదావరి నదికి అపురూప హారతులిచ్చారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాజమండ్రిలోని పుష్కరాల రేవులో పున్నమి హారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే వివిధ రంగాలకు చెందిన ఐదుగురు ప్రముఖులకు గోదావరి పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్(ఈడీ) కె. రామచంద్రమూర్తి వ్యవహరించారు. ఈ సంద ర్భంగా ప్రసిద్ధ దర్శకుడు ఎల్వీ ప్రసాద్ మనుమడు, నిర్మాత అయిన రవిశంకర్ ప్రసాద్ స్మారక అవార్డును జర్నలిజం, సామాజిక సేవారంగాల విభాగంలో ప్రముఖ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్యలకు అవార్డులు అందజేశారు. -
కార్తీక పౌర్ణమి పుణ్య స్నానమెలా?
* మంగినపూడిలో అరకొర ఏర్పాట్లే * భక్తులకు సౌకర్యాల లేమి * లక్షమందికి పైగా రాక మచిలీపట్నం : కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి మంగినపూడిబీచ్‌కు గురువారం లక్ష మందికిపైగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.గతంలో పంచాయతీ, మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసేవారు. అయితే ఈసారి పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తుంది. తాళ్లపాలెం పంచాయతీ నుంచి లక్ష రూపాయలు... పర్యాటకశాఖ ద్వారా కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో మంగినపూడిబీచ్ ఉండడంతో బుధవారం ఈ పంచాయతీ నుంచి కార్తీక పౌర్ణమి ఏర్పాట్ల నిమిత్తం లక్ష రూపాయలు నగదు తీసుకున్నారని తాళ్లపాలెం పంచాయతీ సర్పంచి వాలిశెట్టి రవిశంకర్ తెలిపారు. పర్యాటక శాఖ సహాయాధికారి జి.రామలక్ష్మణ, బందరు ఆర్డీవో పి.సాయిబాబు నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం బీచ్‌ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర పుణ్యస్నానాలకు వచ్చే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు.. మంగినపూడిబీచ్‌లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు సత్రంపాలెం మీదుగా లైట్‌హౌస్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఖాళీప్రాంతంలో వాహనాలను పార్కింగ్ చేయాలని పర్యాటకశాఖ అధికారి తెలిపారు. స్నానాలు ముగించుకుని వెళ్లే వారు బీచ్ రోడ్డు వెంబడి వెళ్లాల్సి ఉందన్నారు. 60 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి స్నానాలకు ముందు, స్నానాల అనంతరం బీచ్‌ను శుభ్రపరుస్తామని ఆయన చెప్పారు. దత్తాశ్రమం వద్ద, బీచ్‌లో రెండు మెడికల్ క్యాంపులతో పాటు 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నామని ఆయన వివరించారు. ప్రయాణీకుల కోసం 80 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, సముద్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేందుకు పది బోట్లు, 30 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని పర్యాటకశాఖాధికారి వివరించారు. పోలీసు బందోబస్తు కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా బీచ్ ఏరియాలో 523 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం నియమించారు. వీరిలో ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్ఐలు, 500 మంది కానిస్టేబుళ్లు, ఒక స్పెషల్ పార్టీ టీమ్‌తో పాటు ఫైర్ సిబ్బంది, మెరైన్ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. -
ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
కార్తీక పౌర్ణమి వేళ నింగిలోని చంద్రుడు నేలపైకి దిగివచ్చినట్టు..లక్షదీపోత్సవాలతో ఆలయాల్లో వేలపున్నముల వెలుగులు విరబూశాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం జిల్లావ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో మార్మోగాయి. పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్న భక్తులు ధ్వజస్తంభాలు, ఉసిరిచెట్ల వద్ద దీపారాధనలు చేసి తరించారు. -
ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారు జాము నుంచి వివిధ ఆలయాల్లో దీపాలు వెలిగించి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక అభయాంజనేయస్వామి ఆలయంలో ఉదయం 9.30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. విద్యానగర్‌లోని కొల్లాపుర మహాలక్ష్మి, గంగామాత, వెంకటేశ్వర, ఎస్ఎన్.పేట్, పటేల్‌నగర్ లక్ష్మివెంకటేశ్వర స్వామి, బాలాంజనేయస్వామి, మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మ, ఏళుమక్కళ తాయమ్మ, కన్యకా పరమేశ్వరి, నగరేశ్వరి, నీలకంఠేశ్వరి, షిరిడీసాయి బాబా, నగర ఆరాధ్య దైవం శ్రీ కనకదుర్గమ్మ ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బళ్లారి సమీపంలోని హగరి నదిలో మరికొంత మంది భక్తులు కార్తీక దీపాలను నీటిలో వదిలి పూజలు జరుపుకున్నారు. కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో లక్ష దీపోత్సవం బళ్లారి టౌన్: నగరంలోని విమానాశ్రయం రోడ్డులోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం ధర్మకర్త గట్టు రాములు అర్చకుల వేదమంత్రాల మధ్య గరుడ స్తంభ దీపానికి పూజలు నిర్వహించి అనంతరం లక్షవత్తులు గల దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయంలో టైలర్ నారాయణప్ప బృందం సంగీత కార్యక్రమాన్ని, రవిశంకర్ గురూజీ శిష్యబృందం పూర్ణచంద్ర యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా గౌరీదేవికి హారతులు బళ్లారి అర్బన్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక పటేల్‌నగర్‌లో శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గౌరిదేవికి మహిళలు, చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు పట్టారు. ఉదయం గౌరిదేవిని కొలువు దీర్చి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆచారి తెలిపారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ఆలయంలో గౌరిదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నోములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం మహిళా భక్తులు విశేషంగా పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఓ పక్క కార్తీక దీపాలు వెలిగిస్తూ మరో వైపు గౌరిదేవికి నోములు నోచి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం సాయంత్రం ఊరేగింపుగా అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు. -
పత్రికి వెళ్లి ప్రమాదానికి బలి
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ :కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో జరుగుతున్న పూజకు పత్రిని తీసుకు వచ్చేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.ఈ సంఘటనతో దోసకాయలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ఉరుము రామారావు(48) ఆదివారం పత్రి తెచ్చేందుకు బూరుగుపూడి గేట్ సమీపంలోని మర్రి చెట్ల వద్దకు వచ్చాడు. మర్రి, ఇతర చెట్ల ఆకులు కోసుకుని వాటిని పోగు చేస్తూ ఉండగా క్వారీ క్రషర్ నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉంది. కూలిపనే జీవనాధారంగా అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. రామారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ పూట ఆ ఇంట దారుణమైన దుఃఖం నెలకొనడం బాధాకరమని పలువురు వాపోయారు. కోరుకొండ ఎస్సై బి.వేంకటేశ్వరరావు సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లారీని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ పరారీలో వున్నాడు. సర్పంచ్ సూర్యకుమారి తదిరతరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రాజమండ్రి తరలించారు. రాజమండ్రి-కోరుకొండ-రాజానగరం రోడ్లలో క్వారీ రాళ్లను రవాణా చేసే లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నాగంపల్లి నుంచి రాజమండ్రి రోడ్లలో రాత్రి పగలు తేడా లేకుండా క్వారీలారీలు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.