ఆరనీకుమా.. కార్తీకదీపం
ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
కిటకిటలాడిన ప్రముఖ శివలయాలు
ఆలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
శివాలయాల్లో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
దిల్‌సుఖ్‌నగర్: శివశివ శంకర భక్తవ శంకర శంబోహరహర మహదేవా...ఆరనీకుమా ఈదీపం.. కార్తీకదీపం.. చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం..అంటూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని యువతులు, మహిళలు, భక్తులు బుధవారం మల క్‌పేట్/మహేశ్వరంజోన్ పరిధిలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాక్షరీ మ ంత్రంతో ఆలయప్రాంతాలు మార్మోగాయి. ఈసందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసి కార్తీకమాస దీపారాధనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నాలుగు గం టల నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు,పిల్లలు,పెద్దలు ఆలయాల వద్దకు చేరి కార్తీక దీపారాధనలు చేసి , అక్కడ ఏర్పాటు చేసిన ఉసిరిచెట్టుకు ప్రదక్షణలు, తులసీ పూజలు నిర్వహించి అనంతరం ఇంటి నుంచి తీసు కువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దైవ దర్శనం కోసం ఆలయాల ముందు భక్తులు భారులు తీరారు.
జోన్ పరిధిలోని ఆర్‌కేపురంలో ఉన్న శ్రీఅష్టలక్ష్మీ దేవాలయం,సరూర్‌నగర్‌లోని శివాలయం,ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, అక్బర్‌బాగ్‌లోని హరిహరక్షేత్రం దిల్‌సుఖ్‌నగర్ లోని శివాలయం, శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవాలయం, చైతన్యపురి, కొత్తపేట కర్మన్‌ఘాట్‌లోని శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరక్షేత్రం, మల క్‌పేట్, మాదన్నపేట్, సైదాబాద్, ఐఎస్‌సదన్, చంపాపేట్, సంతోష్‌నగర్, జిల్లెలగూడ, మీర్‌పేట్, బడంగ్‌పేట్, బాలాపూర్, నాదర్‌గూల్, జల్‌పల్లి, మామిడిపల్లి ఆలయాలతో పాటు పలు శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో కార్తీకపౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో కార్తీక వనబోజనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరాక్షేత్రం, మన్సూరాబాద్ శ్రీఅయ్యప్పస్వామి దేవాలయం , సైదాబాద్ విజయదుర్గా ఆలయం, దిల్‌సుఖ్‌నగర్ శివాలయాలతోపాటు పలు ఆలయాల్లో భక్తులు అయ్యప్ప మాల ధా రణ చేశారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాలు, పార్కుల్ల్లో కార్తీక వనభోజన నిర్వహించుకోవడంతో కాలనీలలో పండుగవాతావరణం నెలకొంది. ఆలయాలన్నీ కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి నిర్వాహకులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు.