రాష్ట్రంలో నో క్యాష్
► కొనసాగుతున్న నగదు సంక్షోభం.. ఆదివారం భారీగా పెళ్లిళ్లు
► డబ్బుల్లేక పెళ్లివారికి కటకట.. మొండిచేయి చూపుతున్న బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: నగదు కొరతతో రాష్ట్రం అల్లాడుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అందరి నోటా డబ్బు మాటే. పట్టుమని పది రూపాయలు కూడా లేని దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నా రు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం, అందులో పదో వంతు కూడా కొత్త నోట్లను ముద్రించకపోవడంతో సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. దాంతో... జీతాలందుకునే ఒకటో తేదీ నాటికై నా బ్యాంకుల నుంచి ఆశించిన మేర నగదు అందుకోవచ్చని భావించిన ప్రజానీకం నిరాశలో మునిగిపోరుుంది. నగ దు కొరత సమస్య తగ్గుతుందని, సజావుగా బేరాలు నడుస్తాయని ఆశపడ్డ లక్షలాది మంది చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది.
పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 23 రోజులు గడిచినా తమ కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆది వారం రాష్ట్రంలో భారీగా వివాహ శుభకార్యా లున్నాయి . ఖర్చుల నిమిత్తం డబ్బుల కోసం వెళ్లిన వారికి బ్యాంకులు అక్షరాలా చుక్కలు చూపిస్తున్నాయి . రోజంతా కూర్చోపెట్టి, చివరికి ఏ సాయంత్రానికో రూ.50 వేలు ఇచ్చి పంపుతున్నాయి . పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరుపుకునే వారికి రూ.2.5 లక్షలు ఇస్తామన్న కేంద్రం హామీ నీటిమూటే అయి ంది.
గురువారం జీతాలు ఖాతాల్లో పడ్డా, తెలంగాణలో 80 శాతం బ్యాంకుల్లో డబ్బుల్లేవన్న బోర్డులే దర్శనమిచ్చాయి . ప్రభుత్వోద్యోగులకు రూ.10 వేల నగదు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్న బ్యాంకులు ఎక్కడా అలా ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్ మాత్రం తన కొన్ని శాఖల్లో తొలి గంటపాటు మాత్రం ఉద్యోగులకు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టింది. పలు బ్యాంకుల్లో తమ వేతన ఖాతాదారులకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రయత్నించినా, తమ సంగతేమిటంటూ ఇతర ఖాతా దారులు గొడవకు దిగడంతో గందరగోళం నెలకొంది.
వేసింది రూ.40 వేల కోట్లు.. ఇచ్చింది రూ.1200 కోట్లే
పెద్ద నోట్లు రద్దు తరువాత బ్యాంకుల్లో రూ.40 వేల కోట్ల డిపాజిట్లు జరిగాయి . కానీ రిజర్వుబ్యాంక్ నుంచి వచ్చిన నగదు మాత్రం కేవలం రూ.1,200 కోట్లు. దాంతో నగదుకు తీవ్ర కటకట ఏర్పడింది. తెలంగాణలో రోజుకు వేల కోట్ల రూపాయల మేర వ్యాపారాలు నిలిచిపోయాయి . గ్రామీణ ప్రాంతాల్లోనైతే బ్యాంకుల్లో నవంబర్ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లు జమయి తే, బ్యాంకులు జారీ చేసింది కేవలం రూ.500 కోట్లు! ఇది కూడా పెద్ద నోట్లు రద్దయిన తొలి మూడు రోజుల్లో ఇచ్చిన మొత్తమే. నవంబర్ 15 నుంచి గ్రామీణ ప్రాంత బ్యాంకులకు చాలాచోట్ల పైసా నగదు కూడా అందలేదు. దాంతో వచ్చిన మొత్తాలను డిపాజిట్ చేసుకోవడం మినహా ఆ బ్యాంకుల సిబ్బందికి పని కూడా లేకుండా పోయింది. నగదు కోసం వస్తున్న వారికి సమాధానం చెప్పలేక వారు సతమతమవుతున్నారు.