తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. | Dead Body Found Three Days After Deceased in Hubli Karnataka | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..

Published Fri, Mar 4 2022 2:15 PM | Last Updated on Fri, Mar 4 2022 4:24 PM

Dead Body Found Three Days After Deceased in Hubli Karnataka - Sakshi

హుబ్లీ (కర్ణాటక): వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం మూడు రోజుల తర్వాత స్థానికుల చొరవతో వెలుగు చూసింది. ఈ  ఘటన హుబ్లీ నవనగర ఎల్‌ఐజీ వద్ద చోటు చేసుకుంది. ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె(30) తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎల్‌ఐజీ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.  

గురువారం ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. ఇతను మూడు రోజుల క్రితమే మృతి చెందాడని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నా మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

చదవండి: (ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement