వేధిస్తున్న 'ఫేస్బుక్ ఫ్రెండ్' పై ఫిర్యాదు | Father compaint against daughter's facebook friend | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న 'ఫేస్బుక్ ఫ్రెండ్' పై ఫిర్యాదు

Published Tue, Jan 7 2014 8:31 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

వేధిస్తున్న 'ఫేస్బుక్ ఫ్రెండ్' పై ఫిర్యాదు - Sakshi

వేధిస్తున్న 'ఫేస్బుక్ ఫ్రెండ్' పై ఫిర్యాదు

హైదరాబాద్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమై  స్నేహితుడుగా మారి మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం అరుణోదయ కాలనీలో నివసించే యాదగిరి విద్యుత్ శాఖలో డీఈగా పని చేస్తున్నాడు.

అతని కుమార్తె (16) కొత్తపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బాలిక పదో తరగతి చదివే సమయం నుంచే ఫేస్బుక్ ద్వారా అర్జున్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం క్రితమే అమ్మాయికి ఫోన్ కొనిచ్చి తరచుగా కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దాంతో తల్లిదండ్రులు బాలికను కళాశాల మాన్పించారు. అయినా వేధింపులు ఆగకపోవటంతో యువకుడిపై చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement