సాక్షి, హయత్‌నగర్ : పదిరోజులు క్రితం కనిపించకుండా పోయిన తమ కూతురు ఆచూకీ ఇంత వరకు తెలియలేదని.. ఆమె ఎక్కడ ఉందో? ఎలా ఉందో? కనీస సమాచారం లేదంటూ ఆందోళన చెందుతున్నారు ఓ యువతి తల్లిదండ్రులు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంట్లూర్‌లో నివాసముండే ఓ యువతి(18) గత నెల 18న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. యువతిని స్థానికంగా ఉండే ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌చేసి తీసుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు అదే రోజున హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమ కూతురి జాడ వెతకాలని అప్పటి నుంచి వారు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారు. పది రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి తన ఇష్టపూర్వకంగా వెళ్తున్నట్లు లెటర్ రాసిపోయిందని పోలీసులు పేర్కొంటున్నారు. యువతి ఆచూకీని వెతికేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment