
పొట్లకా.....య!
హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ రామాలయం వీధిలో నివసించే రిటైర్డ్ టీచర్ సీహెచ్.ఆంజనేయులు తన ఇంటి మేడపైన ఫిబ్రవరి నెలలో పొట్లకాయల పాదు పెట్టాడు. దానికి ఒక్కోటి 7 అడుగుల పొడవు గల 6 కాయలు కాశాయి. ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ విత్తనాలను హార్టికల్చర్ కార్యాలయం నుంచి తెచ్చినట్లు ఆయన తెలిపారు.