అక్రమంగా నడుపుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: అనుమతి లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున‍్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రైవేటు బస్సులను సోమవారం ఉదయం సీజ్ చేశారు, మరో పది బస్సులపై కేసులు నమోదుచేశారు. హయాత్‌నగర్ వద‍్ద విజయవాడ జాతీయ రహదారిపై అక్రమంగా తిరుగుతున‍్న ప్రైవేట్ ట్రావెల్‌స బస్సులపై ఉప‍్పల్ ఆర్టీఏ అధికారులు దాడులు నిర‍్వహించారు.