పెళ్లికి వెళ్లి వస్తూ {పమాదానికి గురయ్యారు ముగ్గురి దుర్మరణం
పది నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో కబళించిన మృత్యువు
పీలేరు: వారంతా రాత్రి బంధువుల వివాహానికి వెళ్లి అందరితో ఆప్యాయంగా గడిపారు. మరో పది నిమిషాల్లో ఇల్లు చేరుకునే లోపే రోడ్డు ప్రమాదంలో అందనంత దూరం వెళ్లిపోయారు. మరో పది నిమిషాలు దాటి ఉంటే వారంతా క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. పీలేరు మండలంలో వేపులబైలు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దర్మరణం పాలైన సంఘటన తెలిసిందే.
పీలేరు పట్టణం ఆర్టీసీ బస్టేషన్ సమీపంలో కాపురముంటున్న ఆనంద్(47) మండలంలోని తలపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పీలేరు ఎస్‌వీ డీలక్స్ మార్గంలో శ్రీసాయి ఇండియన్ ఇండస్ట్రీస్ అధినేత కోలా శ్రీనివాసులు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో కాపురముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆనంద్, అతని భార్య సరళాదేవి, కూతుర్లు మనోగ్న, షణ్మిత, కోలా శ్రీనివాసులు, అతని భార్య ఉమ శ్రీనివాసులు కారులో మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో కొంతసేపు బంధువులతో ఆనందంగా గడిపారు. అందరితో కలసి భోజనం చేశారు. రాత్రి మదనపల్లె పీలేరుకు తిరుగుప్రయాణమయ్యారు.
పీలేరు పట్టణానికి మరో పది నిమిషాల్లో చేరుకునే సమయంలో మార్గంమద్యలోని వేపులబైలు పంచాయతీ పరిధిలోని అంకాలమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆనంద్(47), అతని చిన్న కుమార్తె షణ్మిత(4) కారు నడుపుతున్న కోలా శ్రీనివాసులు(50) అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. ఆనంద్ భార్య సరళాదేవి, రెండవ కుమార్తె మనోగ్న, కోలా శ్రీనివాసులు భార్య ఉమ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి ప్రమాద విషయం తెలుసుకున్న పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎస్‌ఐ సిద్దతేజమూర్తి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన సరళాదేవి, ఉమ, మనోగ్నలను అతి కష్టంపై వాహనం నుంచి వెలుపలికి తీసి చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలియడంతో మృతుల బంధువులు, స్నేహితులు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పది నిమిషాలు ఆగి ఉంటే ఇంటికి వచ్చేసే వారు గదా.. అంటూ వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు పీలేరు సీఐ తెలిపారు.
ఆప్యాయంగా గడిపారు.. అందరినీ విడిచి వెళ్లారు!
Published Fri, Feb 27 2015 1:41 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement