పాకిస్థాన్లో మరోసారి భారీ హింస చెలరేగింది. ఆదివారం ఓ ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో పిల్లలు, మహిళలతో సహా 56 మంది మరణించారు. మరో 80 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ వాయవ్య రాష్ట్రమైన ఖైబర్ పఖ్టుంఖ్వాలోని పెషావర్ ఈ ఘటన జరిగింది. ఓ పురాతన మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.
మందిరం నుంచి జనం బయటికి వస్తున్న సమయంలో ఓ ఉగ్రవాది బాంబుతో తనను తాను పేల్చుకున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో ఓ మతానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో నివస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రార్థన చేసుకునేందుకు చాలా మంది వచ్చారు. ఈ సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రాంతం ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటుంది. మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సులు ఉండటంతో మహిళలు ఎక్కువగా వస్తుంటారు.
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి: 56 మంది మృతి
Published Sun, Sep 22 2013 1:34 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement