- జాతీయ ప్రణాళిక: షరీఫ్
పెషావర్: పెషావర్ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వారంలోగా జాతీయ ప్రణాళికను రూపొందిస్తామని, కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. అన్ని పార్టీల నేతలు షరీఫ్ అధ్యక్షతన బుధవారమిక్కడ సమావేశమై ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తామంతా నిర్ణయించినట్లు షరీఫ్ చెప్పారు. విలేకరుల భేటీలో షరీఫ్‌కు ఇరువైపులా.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్, పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా ఉన్నారు.
ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మరణశిక్ష విధించడాన్ని అడ్డుకునే మారటోరియంను పాక్ ప్రభుత్వం ఎత్తేసింది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అఫ్ఘానిస్తాన్ వెళ్లారు. ఈ దాడికి కారణమని ప్రకటించుకున్న తెహ్రీక్ ఇ తాలిబాన్ పాక్ నేత ఫజ్లుల్లాను పాకిస్తాన్‌కు అప్పగించాలనే డిమాండ్‌తో ఆయన అక్కడి అధికారులతో సమావేశమయ్యారు.