కాలిపోయిన విద్యానవనం | Pakistan mourns after Taliban Peshawar school massacre | Sakshi
Sakshi News home page

కాలిపోయిన విద్యానవనం

Published Thu, Dec 18 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

కాలిపోయిన విద్యానవనం

కాలిపోయిన విద్యానవనం

అంత కర్కశంగా.. మరింత రక్కసంగా  మూర్ఖుల్లా.. ముష్కరుల్లా
 అతి కిరాతకంగా ప్రవర్తించారే..
 వారికి మనసు లేదా
 చిన్నారులన్న కనికరం లేదా..
 ఎందుకింతగా బరితెగించారు
 ఎందరు తల్లుల ఉసురు పోసుకున్నారు..
 పాషాణం సైతం కరుగుతుందంటారే
 బండబారిన గుండెలేమో వారివి!
 విచక్షణ మరిచి.. సిగ్గు విడిచి
 పిల్లల్ని పిట్టల్లా కాల్చిపడేశారే
 ఎంత ఘోరం.. ఎంత దారుణం!
 విద్యానవనంలో నిండుగా విరబూసి
 గుబాళించాల్సిన పసిమొగ్గలు
 నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి..
 హే భగవాన్.. ఎటుపోతోందీ విశ్వం!
- శర్మ సీహెచ్  విజయవాడ
 (పెషావర్‌లో తాలిబన్ దమనకాండ చూశాక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement