కాలిపోయిన విద్యానవనం
అంత కర్కశంగా.. మరింత రక్కసంగా మూర్ఖుల్లా.. ముష్కరుల్లా
అతి కిరాతకంగా ప్రవర్తించారే..
వారికి మనసు లేదా
చిన్నారులన్న కనికరం లేదా..
ఎందుకింతగా బరితెగించారు
ఎందరు తల్లుల ఉసురు పోసుకున్నారు..
పాషాణం సైతం కరుగుతుందంటారే
బండబారిన గుండెలేమో వారివి!
విచక్షణ మరిచి.. సిగ్గు విడిచి
పిల్లల్ని పిట్టల్లా కాల్చిపడేశారే
ఎంత ఘోరం.. ఎంత దారుణం!
విద్యానవనంలో నిండుగా విరబూసి
గుబాళించాల్సిన పసిమొగ్గలు
నిర్దాక్షిణ్యంగా కాలిపోయాయి..
హే భగవాన్.. ఎటుపోతోందీ విశ్వం!
- శర్మ సీహెచ్ విజయవాడ
(పెషావర్లో తాలిబన్ దమనకాండ చూశాక)