1,159 విద్యాసంస్థలకు ‘ఉగ్ర’ ముప్పు | 1,159 schools have threat from terrorist | Sakshi
Sakshi News home page

1,159 విద్యాసంస్థలకు ‘ఉగ్ర’ ముప్పు

Published Wed, Dec 24 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

1,159 schools have threat from terrorist

ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని పోలీసులు చెప్పారు. వీటిలో పలు కళాశాలలు, 22 యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. నగరంలోని 77 మార్కెట్లు, 14 ఆస్పత్రులకు కూడా ఉగ్రవాద ముప్పు ఉందని తెలిపారు.  కాగా, ఈ నెల 16న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ పాఠశాల విద్యార్థులపై ఉగ్రవాదుల దాడి కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిద్ధం చేశారు. 11 మంది ఉగ్రవాదులు ఈ నెల 16న లాండికోటల్ పట్టణం నుంచి పెషావర్‌లోకి అడుగుపెట్టగా అందులో ఏడుగురు దాడిలో పాల్గొన్నట్లు, మిగిలిన నలుగురు తిరిగి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement