పాకిస్తాన్: విభిన్నమైన ఫేస్ మాస్కులు ధరించి కొంతమంది పలు వేడుకల్లో సందడి చేస్తారు. అయితే కొన్ని మాస్కులు వినూత్నంగా ప్రముఖుల ముఖాలు, జంతువులను పోలి ఉంటాయి. అటువంటి వాటిని ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాస్కులు మాత్రం ఎదుటివారికి భయం కలిగించేలా దెయ్యాలు, వికృతమైన ముఖాలతో తయారు చేయారుబడతాయి. ఆ మాస్కులు ధరించిన వారికి చిక్కులు కూడా తప్పవు కొన్ని సార్లు. అయితే అటువంటి ఓ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ వ్యక్తి భయంకరమైన ముఖాన్ని పోలిన ఓ మాస్కును ధరించి రోడ్డు మీద వెళ్లే వారిని ఆట పట్టించాలనుకున్నాడు.
ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను నైలా ఇనాయత్ అనే జర్నలిస్ట్ ట్విటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో రాబోయే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ మాస్క్‌ను ధరించి అందరిని భయపెట్టించాలని చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఇలా భయంకమైన మాస్కులు ధరించి అల్లరి చేసేవారిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
This guy arrested in Peshawar, had plans to celebrate independence day by scaring people. Apparently, the police wasn't much impressed, he was caught in his scary mask. pic.twitter.com/eYEe5YIaQE
— Naila Inayat (@nailainayat) August 10, 2021
Comments
Please login to add a commentAdd a comment