పాక్‌ ఎన్నికల్లో భారత సూపర్‌స్టార్‌ బంధువు! | Shah Rukh Khan cousin to contest from Peshawar | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 8:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Shah Rukh Khan cousin to contest from Peshawar - Sakshi

షారుఖ్‌తో కజిన్‌ సోదరి నూర్‌జెహాన్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బంధువు ఒకరు పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. షారుఖ్‌కు కజిన్‌ అయిన నూర్ జెహాన్ పాక్‌లోని పెషావర్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆమె గురువారం ఎన్నికల సంఘం నుంచి  నామినేషన్ పత్రాలను తీసుకున్నారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పత్రిక తెలిపింది.

షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్‌ నాయకత్వం వహిస్తున్నారు. తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యముందని, బచ్చా ఖాన్‌గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్‌ ఉద్యమంలో తమ కుటుంబం చురుగ్గా పాల్గొన్నదని మన్సూర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement