వరుస బాంబు పేలుళ్లు: పోలీస్ మృతి | 2 bombs kill policeman, injure 19 in Peshawar | Sakshi
Sakshi News home page

వరుస బాంబు పేలుళ్లు: పోలీస్ మృతి

May 18 2016 3:31 PM | Updated on Aug 21 2018 8:06 PM

పాకిస్థాన్లోని పెషావర్లో బుధవారం రెండు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఓ పోలీస్ దుర్మరణం పాలైయ్యాడు.

పెషావర్ : పాకిస్థాన్లోని పెషావర్లో బుధవారం రెండు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఓ పోలీస్ దుర్మరణం పాలైయ్యాడు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని మాత్ర ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న పోలీస్ వాహనమే లక్ష్యంగా బాంబు పేలుడు సంభవించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఘటన స్థలికి చేరుకున్నారు. ఆ క్రమంలో మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ పేలుళ్లలో పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని లేడి రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు బాధ్యులం తామేనంటూ ఏ సంస్థ ప్రకటించ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement