ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు | Five of the best teachers | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు

Published Mon, Sep 5 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

Five of the best teachers

  • జిల్లా టీచర్లకు రాష్ట్ర స్థాయి గౌరవం
  • 8న సీఎం చేతుల మీదుగా సత్కారం
  • విద్యారణ్యపురి : మాతృ  దేవో¿¶ వ, పితృ  దేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో నిలుస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఈ మేరకు ఏటా సెప్టెంబర్‌ 5న రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏటా కొందరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మాసిస్తుంది. ఈ మేరకు ఈసారి రాష్ట్రంలో 31మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా ఇందులో జిల్లా నుంచి ఐదుగురికి స్థానం దక్కింది. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయగా.. ఈనెల 8న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.10వేల నగదు అందజేయడంతో పాటు సన్మానించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు, విద్యార్థులను తీర్చిదిద్దడం, పాఠశాలలను అభివృద్ధి చేయడంతో వారి పాత్రపై ప్రత్యేక కథనం.
     
     
    గురునాథరావు.. సైన్స్‌ కార్యక్రమాలపై ప్రోత్సాహం
    మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో భౌతిక రసాయశాస్త్ర ఉపాధ్యాయుడు గురునాథరావుకు నేషనల్‌ ఫౌండేషన్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబాబాద్‌కు చెందిన గురునాథరావు డోర్నకల్‌ మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియామకమై 2002లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. విద్యార్థులను సైన్స్‌ ప్రయోగాల దిశగా ప్రోత్సహించే ఆయన జాతీయ బాలల సైన్స్‌కాంగ్రెస్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రిసోర్స్‌ పర్సన్‌గా, అకడమిక్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2007లో కురవి మండలం నేరడ పాఠశాలలో విద్యార్థులతో ఆయన జిల్లా సైన్స్‌ ప్రదర్శనకు 14 ప్రాజెక్టులు తయారుచేయించారు. ఇప్పటివరకు 60 జాతీయ అంతార్జాతీయ సదస్సుల్లో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. గురునాథరావు రాసిన పలు పరిశోధనాపత్రాలనుపలు విద్యాSసంస్థల గ్రంథాలయాల్లో రెఫరెన్స్‌గా వినియోగించుకుంటున్నారు. కలకత్తాలో జరిగిన 100వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొని దివంగత రాష్ట్ర పతి అబ్బుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు స్వీకిరంచిన ఆయన ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్‌లో జీవిత కాలసభ్యుడిగా ఉన్నారు. ది ఇండియన్‌ సైన్స్‌కాంగ్రెస్‌అసోసియేషన్‌లో జీవిత కాలసభ్యుడిగాఉన్నారు.గురునాధరావు తన ఉపాధ్యాయుడుగా తన విధులను నిర్వర్తిస్తూనే ఆరేళ్ల క్రితం దిశ సామాజిక సేవాసంస్థలను స్థాపించారు. 2008లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు, ఎల్‌ఐసీ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు, 2007 –2008లో నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ఉత్తమ మాస్టర్‌ ట్రైనర్‌ అవార్డులను గురునాథరావు అందుకున్నారు.
     
    అన్వర్‌.. హిందీ ప్రత్యేక బోధన
    హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం.డీ.అన్వర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1993లో వరంగల్‌లోని శివనగర్‌ ప్రభుత్వ హైస్కూల్‌లో ఆయన నియామకమయ్యారు. విద్యార్థులకు విద్యాబోధనతోపాటు పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నోట్‌బుక్స్‌ను కూడా అందజేస్తున్నారు. జిల్లా రిసోర్స్‌పర్సన్‌గా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పదో తరగతి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే క్యాంపుల్లో హిందీ సబ్జెక్టు బోధిస్తున్నారు. సబ్జెక్టు నిపుణులుగా కూడా వ్యవహరిస్తున్న అన్వర్‌..  హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కాలేజీలో కూడాడిప్యూటేషన్‌పై సైకాలజీ అధ్యాపకుడిగా బోధించారు. రిసోర్స్‌ పర్సన్‌గా జవహార్‌ నవోదయ విద్యాయానికి వ్యవహరించిన ఆయన బోధన సామగ్రి రూపొందించారు. పలు వర్క్‌షాపుల్లో వివిధ తరగతుల హిందీ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు కూడా తయారుచేయటంలో కీలకంగా పనిచేసిన ఆయన  విద్యాపరంగా అత్యుత్తమ సేవలందించినందుకు 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2015లో సంవత్సరంలో రోటరీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సన్మానం అందుకున్నారు.
     
     
    చలపతి.. బడిని బతికించారు
    స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవరగలోని చిన్నపెండ్యాల ఎస్సీ, బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా సీహెచ్‌.చలపతి విధులు నిర్వర్తిస్తున్నారు. రేగొండ మండ లం తిరుమలగిరికి చెందిన చలపతి 1983లో ఉపాధ్యాయుడిగా ఆయన నియామకమయ్యారు. చిన్నపెండ్యాల పాఠశాలలో తొలుత 36మంది విద్యార్థులు ఉండగా చలపతి బాధ్యతలు స్వీకరించాక ఆయన కృషితో ఇప్పుడు ఆ సంఖ్య 350కి చేరింది. అంతేకాకుండా పాఠశాలను వంద శాతం పరిశుభ్రం, పచ్చదనంగా మార్చగా పర్యావరణ మిత్రలో రాష్ట్రస్థాయి అవార్డును 2014లో అందుకున్నారు. దాతల సహకారంతో పాఠశాలలో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణంతో పాటు కాకతీయుల కళాతోరణం ఆర్చీ నిర్మించారు. కాగా, చలపతి 2012లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013–2014లో రాష్ట్ర స్థాయిలో రాజీవ్‌ విద్యామిషన్‌ అవార్డులు స్వీకరించారు.
     
     
    రమాకుమారి.. 
    ఉపాధ్యాయులకే శిక్షణ
    వర్ధన్నపేటమ మండలం ఉప్పరపెల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీజీ హెచ్‌ఎంగా పనిచేస్తున్న దేవరాజు రమాకుమారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. హన్మకొండకు చెందిన రమాకుమారి 1984లో ఉపాధ్యాయురాలిగా నియామకమైన ఆమె తన 32ఏళ్ల సర్వీస్‌లో ఎక్కడ పనిచేసినా విద్యార్థుల డ్రాపౌట్స్‌ లేకుండా కృషి చేశారు. ఇంకా జాతీయ స్థాయిలో విద్యార్థులను వాలీబాల్, హాకీపోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటుచేసి పాఠశాలల అభివృద్ధికి పాటుపడుతున్నారు. స్వఛ్చభారత్‌ కార్యక్రమాలు అమలుచేయటం, పాఠశాలలకు దాతల చేయూతతో ఆటవస్తువులు, వాటర్‌ ఫ్యూరిఫయర్లు ఏర్పాటుచేయించారు. రాష్ట్రస్థాయిలో ఎస్‌ఈఆర్‌టీ, ఆర్‌వీఎం, ఆర్‌ఎంఎస్‌ఏ, మన టీవి టెలీ న్యూస్‌ ప్రోగ్రామ్స్‌ల్లో పాల్గొని ఎస్సెస్సీ స్టడీమెటీరియల్‌ను రూపొందించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. 2012లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పలు సంస్థల నుంచి ఇప్పటివరకు రమాకుమారి అవార్డులు స్వీకరించారు.
     
     
    నరేందర్‌.. ఉపాధ్యాయుడు, కవి
     
    జఫర్‌గఢ్‌ మండలం తీగారం యూపీఎస్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న రాచమల్ల నరేందర్‌కు నేషనల్‌ ఫౌండేషన్‌ టీచర్స్‌ వెల్ఫేర్‌ విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఏ తరగతి గదిలో అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యాలు అదే తరగతిలో విద్యార్థులకు వచ్చేలా బోధిస్తున్నారు. ఇంకా సహా పాఠ్య కార్యక్రమాల కూడా సమర్దవంతంగా నిర్వర్తిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి దోహదపడుతున్నారు. 1997సంవత్సరంలో జఫర్‌గఢ్‌ మండలం సూరారం పాఠశాలలో ఎస్‌జీటీగా నియమితులైన నరేందర్‌ అదే మండలంలో పదిహేడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యలో భాగంగా తరచూ ప్రాజెక్టుమేళా, కృత్యమేళా నిర్వహించే ఆయన సైన్స్‌ఫేర్లు, ఇన్‌స్ఫైర ్లలొ పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థులను చేర్పించేందుకు విశేష కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వర్తించే నరేందర్‌.. కవిగా కూడా తన ప్రతిభ చాటుతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణ  శతజయంతి ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ఉత్తమ కవిగా సన్మానం అందుకున్న నరేందర్‌.. హైదరాబాద్‌లోని చెలిమి సాంస్కృతిక సమితి నుంచి గురజాడ అప్పారావు పురస్కారం అందుకోగా, 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement