గురుభ్యోనమః | teacher is god | Sakshi
Sakshi News home page

గురుభ్యోనమః

Published Sun, Sep 4 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

teacher is god

  • 8న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
  •  ముగ్గురికి రాష్ట్ర స్థాయి
  • 27 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
  • నేడు ఉపాధ్యాయ దినోత్సవం
  • ఆదిలాబాద్‌:  గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. అనాది నుంచి గురువులకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. తల్లిదండ్రుల తర్వాత పూజించబడేది గురువులే. గురువులు పరబ్రహ్మ స్వరూపంగా సంభోదించే సంప్రదాయం మనది. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు భవిష్యత్తుకు బాట చూపుతారు. అక్షర ఓనమాలు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. గురువులను గౌరవించని వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పవచ్చు.
     
    దేశ ప్రథమ పౌరుడైనా.. ఎంతటి స్థాయిలో ఉన్నా... గురువు లేనిదే ఆ వ్యక్తి గమ్యానికి చేరుకోలేరు. క్రమశిక్షణ, సమయ పాలన, విధి నిర్వహణలో నిబద్ధతకు నిదర్శనం ఉపాధ్యాయ వత్తి. విద్యార్థులకు అలాంటి ఉత్తమ విద్యనందించిన వారే ఉత్తములు అవుతారు. సర్వేపల్లి రాధాకష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది  వినాయక చవితి రావడంతో జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈనెల 8న జరుపుకుంటున్నారు. రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానం చేయనున్నారు. కాగా జిల్లా స్థాయిలో 27 మందికి, రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని సన్మానించనున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారి మనోగతం..
     
    సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు..
    ఆదిలాబాద్‌ మండలంలోని అంకోలి ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన 1987 ఫిబ్రవరిలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. అంకోలి పాఠశాలలో పనిచేసే కంటేముందు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సర్కార్‌ బడికి వచ్చేలా చేసి, పాఠశాల అభివద్ధికి ఎంతగానో కషి చేస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన జరుగుతుంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సంతోష్‌. 2014 సంవత్సరంలో జిల్లా ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు.
     
    నిబద్దతకు నిదర్శనం..
    కట్టరాజమౌళి వత్తిలో నిబద్ధతకు నిదర్శనం. రాజమౌళి ఎన్‌సీసీ శిక్షణ అధికారి పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు దారి చూపారు. రాజమౌళి వద్ద శిక్షణ పొందిన 30 మంది వరకు విద్యార్థులు ప్రస్తుతం పోలీసు కానిస్టేబుళ్లుగా, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ నిర్వహించిన వివిధ పోటీల్లో, సాంస్కతిక కార్యక్రమాల్లో  200 వరకు బంగారు పథకాలు సాధించేలా కృషి చేశారు.
     
    1995 సంవత్సరం జూన్‌ మాసంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు. 2001 సంవత్సరంలో స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి పొందారు. ప్రస్తుతం జన్నారం జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2012, 2014 సంవత్సరాలలో ఉత్తమ ఎన్‌సీసీ అధికారిగా అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు.
     
    పర్యావరణ ప్రేమికుడు
    పర్యావరణ పరిరక్షించడంలో ఈ ఉపాధ్యాయుడు తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు పర్యావరణం పరిరక్షణపై శిక్షణ కల్పిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌గా, మాస్టర్‌ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌమర విద్య, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ఎన్నో శిక్షణ, అవగాహన  కార్యక్రమాలు నిర్వహించారు. 2010లో మారిన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయలకు శిక్షణలు ఇవ్వడంతో పాటు జీవశాస్త్రం సబెక్టు ట్రైనర్‌గా, రాష్ట్ర రిసోర్స్‌పర్సన్‌గా పనిచేశారు.
     
    ఎన్‌జీసీ ద్వారా జిల్లాకు చెందిన 40 మంది విద్యార్థులను  తిరుపతి తీసుకెళ్లి పర్యావరణంపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్‌ పొదుపు, కాలుష్యం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఉపాధ్యాయుడు 1998 సంవత్సరంలో ఉపాధ్యాయ వత్తిలో చేరారు.1998 సంవత్సరంలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. 2012 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2010 సంవత్సరంలో ఉత్తమ ఎన్‌జీసీ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement