గుప్త నిధుల తవ్వకం అనుమానంతో అరెస్ట్‌ | Gupta was arrested on suspicion of funding excavation | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల తవ్వకం అనుమానంతో అరెస్ట్‌

Published Fri, Nov 18 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

Gupta was arrested on suspicion of funding excavation

సంబేపల్లె: గుప్త నిధులను  తవ్వకం చేస్తున్నారనే  అనుమానంతో ఐదుగురు వ్యక్తులతో పాటు కారును సంబేపల్లె ఎస్‌ఐ సయ్యద్‌ హాసం  బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. ఆయన కథనం మేరకు.. మండల పరిధిలోని దుద్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు గస్తీ వెళుతుండగా  రోడ్డుపక్కన  నిలిపి ఉన్న  కారులోని వ్యక్తులు పోలీసులను చూసి  పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొన్నారు. కర్నాటకకు చెందిన  మునిరాజు,  చంద్రశేఖర్, విశ్వనాథ్‌, కరీముల్లా, నాగరాజులను  పట్టుకొని విచారించగా  గుప్తనిధులకోసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు  హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement