ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 2026–2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.385 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ చెప్పారు. ఆ తర్వాత 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందన్నారు. యూఎన్‌డీపీ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో నాగేశ్వరన్ మాట్లాడారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు.
ఈ దృష్యా వృద్ధి అవకాశాలు ఎంతో ఆశావహంగా, ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కనుక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు. డాలర్ మారకంలో జీడీపీ 10 శాతం వృద్ధి సాధించినా 2033–34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు’’అని నాగేశ్వరన్ వివరించారు. వాస్తవానికి 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలన్నది మోదీ సర్కారు లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment