జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ బాధ్యతల స్వీకరణ | Zilla Parishad chairperson Sheikh janimun | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ బాధ్యతల స్వీకరణ

Published Tue, Jul 8 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్

- జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
పాతగుంటూరు: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ సోమవారం తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పిటీసీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం జానీమూన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాపరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ లక్ష్యసాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేయూలని అన్నారు. పాలన వ్యవహారాలను తెరవెనుక నుంచి ఎవరైనా చూస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా తాను ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశానని, అన్ని అంశాలను సొంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుని పని చేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement