తూర్పు నావికాదళ చీఫ్‌గా సతీష్ సోనీ | Chief of the Eastern Naval Satish Sony | Sakshi
Sakshi News home page

తూర్పు నావికాదళ చీఫ్‌గా సతీష్ సోనీ

Published Mon, Jun 16 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

తూర్పు నావికాదళ చీఫ్‌గా సతీష్ సోనీ

తూర్పు నావికాదళ చీఫ్‌గా సతీష్ సోనీ

విశాఖపట్నం: తూర్పు నావికాదళ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం ఇక్కడి నావల్‌బేస్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 1976 జూలై ఒకటో తేదీన భారత నావికా దళంలో చేరిన ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ డెరైక్షన్, నావిగేషన్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు.

డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్, నావల్ వార్‌ఫేర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. ప్రతిష్టాత్మక నౌసేన మెడల్, అతి విశిష్టసేవా మెడల్, పరమ విశిష్టసేవా మెడల్స్‌ను అందుకున్నారు. తూర్పు నావికాదళ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చీఫ్‌గా సతీష్ సోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా పదోన్నతిపై పశ్చిమ నావికాదళం చీఫ్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సతీష్ సోనీ నియమితులయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement