Eastern Naval Chief
-
తూర్పు నౌకాదళాధిపతికి పరమ విశిష్ట సేవా పతకం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌కు ప్రతిష్టాత్మక గ్యాలెంట్రీ అవార్డు వరించింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి అందించే శౌర్య పురస్కారాల జాబితా శనివారం వెల్లడైంది. ఇందులో ప్రతిష్టాత్మక పరమ విశిష్ట సేవా పతకాన్ని నలుగురు అధికారులకు ప్రకటించగా, అందులో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ పెంధార్కర్ ఒకరు. 2023 ఆగస్ట్ 1 నుంచి తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన రాజేష్.. యాంటీ సబ్‌మెరైన్ వార్ ఫేర్ స్పెషలిస్ట్‌గా తక్కువ కాలంలోనే పేరు గడించారు.పలు యుద్ధ నౌకల కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి, మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్‌స్ట్రక్టర్‌గానూ వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్‌గా, నెట్ సెంట్రిక్ ఆపరేషన్స్‌లో ప్రిన్సిపల్ కమాండర్‌గా, నేవల్ డైరెక్టరేట్ (పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌గా, ఫ్లాగ్ ఆఫీసర్‌గా, ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా, నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్‌వో)గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం విశాఖకు బదిలీ అయ్యారు. పెంధార్కర్‌కు పరమ విశిష్ట సేవా పతకం లభించడం పట్ల విశాఖ నౌకాదళ వర్గాలు అభినందనలు తెలిపాయి. -
సీఎం జగన్‌ను కలిసిన ఈస్టర్న్ నేవీ కమాండ్ చీఫ్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా. తూర్పు సముద్ర తీరంలో భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. డిసెంబర్ 4 ఇండియన్ నేవీ డే సందర్భంగా విశాఖలో జరిగే వేడుకలకు జగన్‌ను ఆహ్వానించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మోడల్‌ను సీఎంకు బహుకరించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్.. దాస్‌గుప్తాని సన్మానించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ అభిషేక్ కుమార్, లెఫ్టినెంట్ పీఎస్. చౌహాన్ కూడా జగన్‌కు కలిశారు. చదవండి: జలవనరుల శాఖ, పోలవరం పనులపై సీఎం జగన్ సమీక్ష -
తూర్పు నావికాదళ చీఫ్‌గా సతీష్ సోనీ
విశాఖపట్నం: తూర్పు నావికాదళ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం ఇక్కడి నావల్‌బేస్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 1976 జూలై ఒకటో తేదీన భారత నావికా దళంలో చేరిన ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ డెరైక్షన్, నావిగేషన్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్, నావల్ వార్ఫేర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. ప్రతిష్టాత్మక నౌసేన మెడల్, అతి విశిష్టసేవా మెడల్, పరమ విశిష్టసేవా మెడల్స్‌ను అందుకున్నారు. తూర్పు నావికాదళ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చీఫ్‌గా సతీష్ సోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా పదోన్నతిపై పశ్చిమ నావికాదళం చీఫ్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సతీష్ సోనీ నియమితులయ్యారు.