
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా. తూర్పు సముద్ర తీరంలో భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్ళను అధిగమించేందుకు భారత నావికాదళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. డిసెంబర్ 4 ఇండియన్ నేవీ డే సందర్భంగా విశాఖలో జరిగే వేడుకలకు జగన్‌ను ఆహ్వానించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మోడల్‌ను సీఎంకు బహుకరించారు.
ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్.. దాస్‌గుప్తాని సన్మానించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్‌సీ రావు (సివిల్ మిలటరీ లైజన్ (అడ్వైజరీ), కెప్టెన్ అభిషేక్ కుమార్, లెఫ్టినెంట్ పీఎస్. చౌహాన్ కూడా జగన్‌కు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment