- జిల్లాలో ఆరువేల సీట్లు ఖాళీ
- విద్యార్థుల అన్వేషణలో అధికారులు
పెద్దతిప్పసముద్రం: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా కాపు రం ఉండని వార్డన్లు, ఇన్‌చార్జి వార్డన్లు సైతం సిబ్బం దికే అన్ని బాధ్యతలు అప్పజెప్పడం, అరకొర వసతు లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది.
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఈ ఏడాది ఆరువేల వ రకు సీట్లు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు హాస్టల్‌లో సీటు కావాలంటే విద్యార్థులు అధికారుల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం విద్యార్థుల కోసం సంక్షేమశాఖ అధికారులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం 50 మంది విద్యార్థులు కూడా లేని హాస్టల్‌ను పక్కనున్న హాస్టల్‌లో కలిపేందుకు జిల్లా అ ధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 124 ఎస్సీ, 16 ఎస్టీ, 68 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి.
ఎస్సీ హా స్టళ్లలోనే 4 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లల్లో వి ద్యార్థుల బాగోగులు, కనీస సౌకర్యాలు కల్పించటం పై సంక్షేమ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించట మే ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వసతులు లేని సంక్షే మ హాస్టళ్లలో చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్యను పెంచకుంటే వే రే హాస్టల్‌లో కలిపేస్తామని జిల్లా సంక్షేమ అధికారులు వార్డన్లకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సంక్షేమ హా స్టళ్లలో పని చేసే సిబ్బంది విద్యార్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు. విద్యార్థులను చేర్పించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు హాస్టళ్లలో అరకొర విద్యార్థులు, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు బెడ్‌షీట్లు, నోటుపుస్తకాలు, ట్రంకుపెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు వంటివి హాస్టళ్లకు చేరకపోవడంతో పాత వస్తువులతోనే విద్యార్థులు కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది.
సీట్ల భర్తీకి చర్యలు
సంక్షేమ హాస్టళ్లల్లో ఖాళీగా వున్న సీట్లను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాము. ప్రతి హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య 50కి తగ్గితే పక్క హాస్టల్‌లో కలిపేస్తామని ఆయా పరిధిలోని వార్డన్లకు సూచించాం. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులతో చర్చిస్తున్నాము. జిల్లాలో 22 ఎస్సీ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పీటీఎం మండలంలోని కందుకూరు, పెద్దపంజాణి మండలంలోని నిడిగుంట గ్రామాల్లో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రెండు హాస్టళ్లలో విద్యార్థులకు అయ్యే నెలవారి ఖర్చుకన్నా భవనం అద్దె, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలే అధికంగా ఉన్నాయి. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్య పెరగకపోతే హాస్టళ్లను మూసివేసి పిల్లలను సమీపంలోని వేరే హాస్టల్‌లో చేర్పిస్తాం.
- కెఎస్.ధనంజయ్‌రావ్. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి