power bills
-
భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహనం
సాక్షి, అమరావతి /కృష్ణలంక(విజయవాడతూర్పు)/ఒంగోలు టౌన్/చిత్తూరు కార్పొరేషన్/ ఆమదాలవలస: చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దుబాటు చార్జీల పేరుతో రెండు విడతల్లో రూ.16వేల కోట్ల భారం మోపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంగళంపాడారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. -
భోగి మంటలతో .. కూటమి సర్కార్‌పై వినూత్న నిరసన
విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్‌కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?. .. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
కూటమి ప్రభుత్వంలో 4 నెలలకే విద్యుత్ బిల్లుల మోత
-
‘కూటమి పాలనలో ఏపీ ప్రజల నెత్తిన మరో పిడుగు’
సాక్షి, నెల్లూరు: మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చాలా సులభంగా మాట మార్చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఛార్జీలు పెంచను.. ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు బాదుడుకు బాబు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. కూటమి నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచనని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. నాణ్యమైన కరెంట్ అందిస్తామని ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా హామీల వర్షం కురిపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో మాట తప్పి ప్రజల నడ్డి విరుస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బాదుడే బాదుడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కానీ, వారు మాత్రం విద్యుత్ చార్జీలు భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చాలా సులభంగా మాట మార్చేశారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై చెప్పుకోవడానికి ఏమీ లేదు.దేవుడిని అడ్డుపెట్టుకుని లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు హయాంలో వదిలేసి వెళ్లిపోయిన బకాయిలను మేము కట్టాం. వైట్ పేపర్ పేరుతో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రంలో అన్ని రంగాలు కుప్పకూలిపోయే విధంగా చంద్రబాబు సర్వనాశనం చేశారు. చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైపోయింది. విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. లడ్డూ వ్యవహారంపై కాకాణి కామెంట్స్..లడ్డూను చంద్రబాబు వివాదం చేసి.. ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. వైఎస్సార్సీపీ చెప్పిన సమాధానాలనే సుప్రీంకోర్టు ఏకీభవించినట్టు ఉంది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. సనాతన ధర్మంలో విడాకులు తీసుకోకూడదని ఉంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదు అంటూ కామెంట్స్ చేశారు.ఇంకా కాకాణి ఏమన్నారంటే.. హామీలన్నీ గాలికి..ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్ ఛార్జీలు కూడా ఎత్తేస్తామని నాడు బీరాలు పోయిన బాబు.. తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్బంగా.. చంద్రబాబు ఎన్నికల ప్రచార హామీ.. ఇప్పటి ప్రకటన వీడియోలను కాకాణి మీడియా ముందు ప్రదర్శించారు.చంద్రబాబు తరహాలో మరే నేత ఇంతలా మాట మార్చి ప్రజలను మోసం చేయలేరని కాకాణి అభిప్రాయపడ్డారు. కూరగాయలతో పాటు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే, మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదని ఆయన స్పష్టం చేశారు.100 రోజుల పాలన కానుక ఇదేనా?గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలపై అదేపనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేసిన మాజీ మంత్రి, హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని తేల్చి చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైన చంద్రబాబు, ప్రజలకు వంద రోజుల పాలన కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆక్షేపించారు.ఏకంగా రూ.8100 కోట్ల భారం? ‘ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్’ (ఎఫ్‌పీపీసీఏ) ఛార్జీలు ఒక్కో పంపిణీ సంస్థ (డిస్కమ్)లో ఒక్కో విధంగా ఉండడంతో పాటు, ప్రసార పంపిణీ (టీ అండ్ డీ. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్) నష్టాలు రెండూ కలిపి.. 7.99 శాతం నుంచి 10.99 శాతం వరకు ఉన్నాయని కాకాణి తెలిపారు. దాని ప్రకారం లెక్కిస్తే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి వివిధ డిస్కమ్‌లలో ఒక్కో యూనిట్‌పై రూ.4.14 నుంచి రూ.6.69 వరకు భారం పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా మొత్తం రూ.8,100 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ ఛార్జీలపై విరుచుకుపడిన చంద్రబాబు, ఇప్పుడు అవే ఛార్జీల పేరుతో రూ.8,100 కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు.డిస్కమ్‌లకూ నాడు బకాయిలు2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటికి డిస్కమ్‌లు రూ.4,315 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2019 నాటికి అవి ఏకంగా రూ.20 వేల కోట్లకు చేరాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. అంతే కాకుండా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.43,744 కోట్లు బకాయి పెట్టారని, వాటిని జగన్‌గారి ప్రభుత్వం చెల్లించిందని ఆయన వివరించారు.ఇది కూడా చదవండి: రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి -
బాదుడుపై బాబు ఫోకస్.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి.. చంద్రబాబు బాదుడు మొదలుపెట్టాడు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. హామీలను తుంగలో తొక్కి.. బాదుడు మొదలెట్టిన చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.8,100 కోట్లని సామాన్యుల నుంచి వసూళ్ల చేసేందుకు ఎత్తుగడ. పథకాల రూపంలో ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు ఇచ్చింది శూన్యం.. కానీ విరాళాలు, టాక్సుల రూపంలో కోట్లల్లో వసూళ్లు చేశారు. సంపద సృష్టించడమంటే ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించింది.హామీలను తుంగలో తొక్కి.. బాదుడు మొదలెట్టిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.8,100 కోట్లని సామాన్యుల నుంచి వసూళ్ల చేసేందుకు ఎత్తుగడ పథకాల రూపంలో ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు ఇచ్చింది శూన్యం.. కానీ విరాళాలు, టాక్సుల రూపంలో… pic.twitter.com/akAzJA7VeZ— YSR Congress Party (@YSRCParty) October 1, 2024 అధికారంలోకి వచ్చాక బుద్ధి చూపిస్తున్న చంద్రబాబు. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం. ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు గాలి కబుర్లు చెప్పిన చంద్రబాబు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చాక బుద్ధి చూపిస్తున్న చంద్రబాబువిద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధంఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని… pic.twitter.com/3p9gZoENB2— YSR Congress Party (@YSRCParty) October 1, 2024 ఇది కూడా చదవండి: రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి -
బిల్లుపై బాదుడు
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్‌కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్‌కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇదీ సంగతి...!ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్‌లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్‌ల వెబ్సైట్, వాటి మొబైల్ యాప్‌లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్‌ల యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది. డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.నిర్లక్ష్యంగా డిస్కమ్‌లు...తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్‌లు తమ వెబ్సైట్, యాప్‌లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అంటే షాకులే..76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. -
TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
పాకిస్తాన్‌పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్‌పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. -
ఎఫ్ఎస్ఏ వసూలుకు రంగం సిద్ధం.. తెలంగాణలో పెరగనున్న విద్యుత్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ)ను వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కసరత్తు ప్రారంభించాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఎఫ్ఎస్ఏ చార్జీలు అమల్లోకి రానుండగా వినియోగదారులపై మాత్రం జూలైలో అందుకొనే బిల్లుల్లో ఈ చార్జీల ప్రభావం కనిపించనుంది. ఒక నిర్దిష్ట నెలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఆ తర్వాతి మూడో నెలలో వసూలు చేయాల్సి ఉండటమే దీనికి కారణం. ఎఫ్ఎస్ఏ చార్జీలకు అనుమతిస్తూ గత నెల 18న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రకటించిన ‘మూడో సవరణ నిబంధన, 2023’ను నోటిఫై చేస్తూ అదే నెల 20న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 12న రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు మార్గం సుగమనమైంది. దీంతో ప్రజలపై విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. ఇంధన/విద్యుత్ కొనుగోలు వ్యయంలో హెచ్చుతగ్గుల భారాన్ని ఎఫ్ఎస్ఏ చార్జీల రూపంలో ఆటోమెటిక్‌గా విద్యుత్ బిల్లుల్లో బదిలీ చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 22న ఎలక్ట్రిసిటీ (టైమ్లీ రికవరీ ఆఫ్ కాస్ట్ డ్యూ టు ఛేంజ్ ఇన్ లా) రూల్స్ 2021ను ప్రకటించింది. బొగ్గు, ఇతర ఇంధనాల ధరల పెరుగుదలతో పెరిగిపోతున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. దీని ఆదారంగానే ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతిచి్చంది. ఈఆర్సీ ప్రకటించిన ప్రత్యేక ఫార్ములా ఆధారంగా ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించి వసూలు చేయనున్నారు. యూనిట్‌పై 30 పైసల దాకా వడ్డన యూనిట్ విద్యుత్‌కి గరిష్టంగా 30 పైసల వరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ అనుమతి లేకుండా డిస్కంలు విధించవచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలు యూనిట్‌కి 30 పైసలకు మించితే అనుమతి లేకుండా ఆపైన ఉండే అదనపు చార్జీలు విధించడానికి వీల్లేదు. 30 పైసల సీలింగ్‌కి మించిన ఎఫ్ఎస్ఏ చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఈఆర్సీ నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించాక రుణాత్మకంగా తేలితే ఆ మేరకు ఎఫ్ఎస్ఏ చార్జీలను వినియోగదాలకు రిఫండ్ చేయాలి. ఎల్టీ–5 కేటగిరీలోని వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల వినియోగదారులపై ఈ చార్జీలు విధించనున్నారు. వ్యవసాయ వినియోగదారుల ఇంధన సర్దుబాటు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండనుంది. ఎఫ్ఎస్ఏ చార్జీలను లెక్కించే సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రకటన.. నిరీ్ణత కాల వ్యవధిలోపు ఎఫ్ఎస్ఏ చార్జీలను విధించడంలో డిస్కంలు విఫలమైతే తర్వాతి కాలంలో వసూలు చేసేందుకు అనుమతి ఉండదు. నెలవారీ ఇంధన సర్దుబాటు చార్జీలను నిబంధనల ప్రకారం డిస్కంలు లెక్కించి సంబంధిత నెల ముగిసిన 45 రోజుల్లోగా పత్రికల్లో ప్రచురించాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లుల్లో ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేకంగా చూపించడంతోపాటు వసూలైన ఎఫ్ఎస్ఏ చార్జీలను ప్రత్యేక ఖాతా కింద నమోదు చేస్తారు. ప్రతి త్రైమాసికం ముగిశాక 60 రోజుల్లోగా ఆ త్రైమాసికంలోని నెలలకు సంబంధించిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలను ఈఆర్సీకి సమరి్పంచాలి. డిస్కంలు విధించిన ఎఫ్ఎస్ఏ చార్జీలను ఈఆర్సీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించనుంది. ఇక ట్రూఅప్ ప్రతిపాదనలు కీలకం.. ఏటా నవంబర్ ముగిసేలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీల వివరాలు, ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. ముందే వసూలు చేసిన ఎఫ్ఎస్ఏ చార్జీలను పరిగణనలోకి తీసుకొని ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులకు పంచాల్సిన లాభనష్టాలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ట్రూఅప్ ప్రతిపాదనలు సమరి్పంచే వరకు ఎఫ్ఎస్ఏ చార్జీల వసూళ్లకు ఈఆర్సీ అనుమతించదు. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
ఇదేంది సారు.. ఒకే రాష్ట్రం.. వేర్వేరు కరెంట్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం 30 రోజుల ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాతే విద్యుత్ వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించింది. అప్పటి వరకు ఏసీడీ చార్జీల వసూళ్లను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఏసీడీ చార్జీల లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తాజాగా ఈఆర్సీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) భారీ మొత్తంలో ఏసీడీ చార్జీలు వసూలు చేస్తోందని వ్యతిరేకత రావడంతో ఈఆర్సీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వినియోగదారుడి వార్షిక విద్యుత్ వినియోగం ఎంత? అందులో రెండు నెలల సగటు వినియోగం ఎంత? ఈ మేరకు వినియోగానికి చెల్లించాల్సిన డిపాజిట్ ఎంత? ఇప్పటికే డిస్కం వద్ద ఉన్న ఆ వినియోగదారుడి డిపాజిట్ మొత్తాన్ని సర్దుబాటు చేశాక చెల్లించాల్సిన అదనపు వినియోగ డిపాజిట్ ఎంత? .. వంటి లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని కోరింది. ఇప్పటి వరకు నోటీసులు లేకుండానే ఏసీడీ చార్జీలు వసూలు చేసిన నేపథ్యంలో ఆ వినియోగదారులకు సైతం నోటీసులు జారీ చేయాలని కోరింది. విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిలాల్లో గత రెండు నెలలుగా ఏసీడీ చార్జీలను టీఎస్ఎన్పీడీసీఎల్ విధిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకమని విమర్శలు.. ఏపీఈఆర్సీ జారీ చేసిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం డిస్కంలు వినియోగదారుల నుంచి అదనపు సెక్యూరిటీ డిపాజిట్ (ఏఎస్డీ) వసూలు చేసుకోవచ్చు. గృహ వినియోగదారులకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏఎస్డీ కింద కిలోవాట్‌కు రూ.80 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏడాదిపాటు వినియోగదారుడి సగటు విద్యుత్తు వినియోగాన్ని లెక్కగట్టి రెండు నెలల సగటు మొత్తాన్ని ఏఎస్డీ చార్జీల రూపంలో మరోసారి వసూలు చేసుకోవచ్చు. ఆపై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని, అంతకు ముందు ఏడాది సగటుతో పోల్చి చూసి, అదనంగా జరిగిన సగటు వినియోగానికి మాత్రమే ఏఎస్డీ చార్జీలు వసూలు చేస్తారు. ఈ చార్జీలు డిపాజిట్ రూపంలో వినియోగదారుల పేరుమీదనే విద్యుత్ సంస్థల వద్ద ఉంటాయి. ఈ రెగ్యులేషన్ జారీ చేసిన 19 ఏళ్ల తర్వాత ఏఎస్డీకి బదులు ఏసీడీ చార్జీల పేరుతో టీఎస్ఎన్పీడీసీఎల్ వసూళ్లను ప్రారంభించింది. విద్యుత్ చట్టం, ఈఆర్సీ రెగ్యులేషన్లలో ఎక్కడా ఏసీడీ చార్జీల ప్రస్తావన లేనందున, వీటిని వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒకే రాష్ట్రం.. వేర్వేరు చార్జీలు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు రెండు వేర్వేరు డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తున్నా ఏకరూప చార్జీలు అమల్లో ఉన్నాయి. కొత్తగా ఉత్తర తెలంగాణ జిల్లాల గృహ వినియోగదారులపై ఏసీడీ చార్జీలను విధిస్తుండటంతో ఒకే రాష్ట్రంలో వేర్వేరు విధానాలను అమలుచేస్తున్న విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఏఎస్డీ చార్జీలను కమర్షియల్, పరిశ్రమల వర్గాల నుంచి మాత్రమే వసూలు చేసేవారు. -
ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించండి
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్‌తో క్షణాల్లో నెలవారీ విద్యుత్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లో ఆ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ‘‘ఏపీసీపీడీసీఎల్ కన్జ్యూమర్ మొబైల్ యాప్, పేటీయం, టీఏ వాలెట్, ఏపీ ఆన్లైన్’’ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది. కాగా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా విద్యుత్ బిల్లులను కట్టించుకుని డిస్కంకు అందజేసే ‘బిల్ డెస్క్’ కంపెనీ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ (బీజీ) గడువు తీరిపోవడంతో మరలా కొత్త బీజీ ఇవ్వాల్సిందిగా సెంట్రల్ డిస్కం కోరింది. బిల్ డెస్క్ నుంచి బీజీ అందడంలో జాప్యం కారణంగా బిల్లులు వసూలు చేసేందుకు ఆ కంపెనీకి డిస్కం అనుమతినివ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పలు యూపీఐ యాప్‌ల ద్వారా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై డిస్కం సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డిని వివరణ కోరగా..బిల్లుల చెల్లింపుల్లో సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని, దీనివల్ల ఈ నెల తమకు రావాల్సిన ఆదాయంలో 60% ఆగిపోయిందని చెప్పారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
భావి అవసరాలకనుగుణంగా విద్యుదుత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉజ్వల్ భారత్–ఉజ్వల్ భవిష్యత్తు– విద్యుత్ 2047 గ్రాండ్ ఫినాలే సదస్సులో వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున విశాఖపట్నంలో ఈ మహోత్సవ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వినియోగదారులకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా మరో 1,600 మెగావాట్లు 2023 జనవరి నాటికి రానుందన్నారు. అదేవిధంగా.. 2024–2026 వరకూ వివిధ దశల్లో పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి 10,067 లేఅవుట్లను విద్యుదీకరించేందుకు రూ.3,483 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలకళ పథకంలో భాగంగా రూ.180 కోట్లతో 6,669 బోర్లుకు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ థర్మల్ అండ్ కోల్ కోఆర్డినేషన్ జాయింట్ సెక్రటరీ పీయూష్ సింగ్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు: ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ వెలుగులు అందించడమే లక్ష్యంగా.. పాతికేళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పథకాల్ని ప్రవేశపెట్టామన్నారు. విద్యుదీకరణ ప్రజల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నా.. డిస్కంలు సబ్సిడీలు కొనసాగిస్తుండటం భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేసేందుకు సూచికలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలకు 2021–22 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. దీని ద్వారా ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై – ఏవరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ అంతరాన్ని 2024–25 కల్లా సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. డిస్కంలు, విద్యుత్ విభాగాల నిర్వహణ సామర్థ్యాల్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్æ స్కీమ్‌ని ప్రధాని ప్రారంభించారు. అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి చెందిన రూ.5,200 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్ని జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌తోపాటు దేశంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. చింతపల్లి గిరిజనుడితో ప్రధాని ముఖాముఖి.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన గిరిజన లబ్ధిదారుడు కాగే క్రాంతికుమార్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. ప్రధాని: క్రాంతికుమార్ ఎలా ఉన్నావ్? క్రాంతికుమార్: చాలా బాగున్నాను సార్ ప్రధాని: మీ గురించి చెప్పండి క్రాంతికుమార్: మాది సుదూర గిరిజన గ్రామం.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీ ప్రధాని: మీ ఊరికి కరెంట్ రాకముందు, వచ్చిన తర్వాత ఏం తేడా గమనించావు? క్రాంతికుమార్: గతంలో సూర్యుడి వెలుగు ఉన్నంతవరకే ఏ పనైనా చేసుకునేవాళ్లం. రాత్రిపూట కిరోసిన్ దీపాలతో ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. చదువు కోసం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద మా ఊరికి కరెంట్ వచ్చింది. మా జీవితాలు చాలా బాగుపడ్డాయి. ప్రధాని: చాలా సంతోషంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గర్వపడుతున్నాం. మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. క్రాంతికుమార్: థాంక్యూ సార్. -
గ్రామాలకు ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గ్రామాలను ఎల్ఈడీల వెలుగులతో నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గ్రామ ఉజాల’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 4.36 లక్షల ఎల్ఈడీ బల్బులను కూడా పంపిణీ చేయగా, ఇకపై భారీగా పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. గ్రామ ఉజాల పథకానికి దేశంలో కేవలం ఐదు రాష్ట్రాలనే కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తెలంగాణతో పాటు మన రాష్ట్రం కూడా ఉంది. ఈ పథకం ద్వారా ఏపీతో కలిపి ఐదు రాష్ట్రాల్లో కోటి ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థ కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) నిర్ణయించింది. సహకరించాలని కోరిన సీఈఎస్ఎల్ దశలవారీగా గ్రామీణ గృహాలకు నాణ్యమైన లైటింగ్‌ను అందించడం గ్రామ ఉజాల పథకం లక్ష్యం. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఎల్ఈడీ బల్బుల పంపిణీ వల్ల విద్యుత్ బిల్లులు కొంతమేర తగ్గుతాయి. విద్యుత్ సంస్థలకు గరిష్ట డిమాండ్‌ను గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఉజాల పథకం అమలుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను సీఈఎస్ఎల్ ఇటీవల కోరింది. ఈమేరకు ఎండీ మహువా ఆచార్య ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌కు లేఖ రాశారు. గ్రామీణ ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో అందించాలనే తమ ప్రయత్నానికి తోడవుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఈఎస్‌ఎల్‌కు ఇంధన శాఖ కార్యదర్శి తిరిగి లేఖ పంపారు. మన్నిక ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో గతేడాది డిసెంబర్ 14న 10 లక్షల ఎల్ఈడీ బల్బులను సీఈఎస్ఎల్ అందించింది. మన రాష్ట్రంలోని అప్పటి వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో లక్షకు పైగా ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసింది. వీటితో కలిపి మొత్తం 4.36 లక్షల ఎల్ఈడీ బల్బులు రాష్ట్రానికి చేరాయి.వినియోగదారుడు బల్బుకు రూ.10 చెల్లిస్తే చాలు.ఎల్ఈడీ బల్బుల పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును సీఈఎస్ఎల్ భరిస్తుంది. విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. ఎల్ఈడీ బల్బుల సామర్థ్యం ఎక్కువ. నాణ్యతతో దీర్ఘకాలం మన్నుతాయి. సాధారణ బల్బులతో పోల్చినప్పుడు 88 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. 25 రెట్ల కాంతి ఎక్కువ ఉంటుంది. సీఎఫ్ఎల్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీలు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. -
త్వరగా కడితే తక్కువే!
సాక్షి, అమరావతి: ప్రతి నెలా విద్యుత్ బిల్లు చేతికందగానే చాలామంది చేసే తప్పు.. దాన్ని సకాలంలో చెల్లించకపోవడం. ‘కడదాంలే’ అని బిల్లును పక్కనపెట్టి మర్చిపోతుంటారు. ఇలా బిల్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంతో వారికి అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇలా కాకుండా కరెంట్ బిల్లుని నిర్దేశిత సమయంలోగా కడితే సర్‌చార్జ్, ఇంధన చార్జ్, జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ లోగా కట్టేస్తే సరి.. రాష్ట్రంలో తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.91 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరంతా రోజుకి 229 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అయితే నెలవారీ బిల్లులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రతి నెల 1 నుంచే స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఇళ్లకు వచ్చి విద్యుత్ మీటర్ నుంచి రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లు అందిస్తున్నారు. ఆ బిల్లు తీసిన రోజు నుంచి 14 రోజుల్లోపు బిల్లు కట్టేస్తే ఏ సమస్య ఉండదు. పైగా రూ.35 నుంచి రూ.85 వరకు ఆదా కూడా చేయొచ్చు. సకాలంలో కట్టకపోతే ఏం జరుగుతుందంటే ఒక విద్యుత్ సర్వీస్‌కి రూ.100 బిల్లు వస్తే.. ఆ బిల్లును ప్రతి నెల 1న తీస్తే 14లోగా, 5న తీస్తే 19లోపు చెల్లిస్తే వినియోగదారుడిపై తర్వాత నెలలో రూ.25 సర్ చార్జ్, రూ.10 ఇంధన చార్జ్ పడదు. అదే బిల్లును ఒక వారం తర్వాత చెల్లిస్తే ఆ తర్వాత నెలలో రూ.100 బిల్లుకు సర్‌చార్జ్, ఇంధన చార్జ్ కలిపి రూ.135 బిల్లు వస్తుంది. ఒకవేళ ఆ వారానికి కూడా అనివార్య కారణాలతో బిల్లు కట్టలేకపోతే రూ.135కు ఇంకొక రూ.50 ఆలస్య రుసుం కలిపి మొత్తం రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే అనర్థమే.. గతంలో విద్యుత్ సిబ్బంది గ్రామాలకే వచ్చి విద్యుత్ బిల్లులు కట్టించుకునేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో ఆన్లైన్లోనే విద్యుత్ బిల్లు కట్టే అవకాశం ఉంది. అయినా చాలామంది ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల బిల్లు ఎక్కువ రావడంతో డబ్బులు వృథా కావడమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి బిల్లు అందిన 14 రోజుల్లోపు చెల్లించేస్తే మంచిదని అధికారులు చెబుతున్నారు. -
ఇక ‘అదనంగా మీటర్లు’ తిరగవ్!
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ లాడ్జి యజమాని కస్టమర్లు రాకపోవడంతో ఓ కొత్త పథకం వేశాడు. లాడ్జిలోని గదులన్నిటికీ ఒక్కో విద్యుత్ మీటర్ బిగించాడు. లాడ్జిని అద్దె ఇల్లుగా మార్చేశాడు. ఒక భవనానికి ఒక మీటరే ఉండాలి. కానీ ఇక్కడ గదికో మీటర్ ఉంది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్‌కు ఒక మీటర్ చొప్పున ఉంటుంది. అయితే కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో హాస్టల్ పెడుతున్నారు. అంటే ఒకే యాజమాన్యం కిందకు మొత్తం బిల్డింగ్ వచి్చంది. కానీ మీటర్లు మాత్రం ఫ్లాట్‌కు ఒకటి చొప్పున ఉన్నాయి. ఏలూరుకు చెందిన ఒక వినియోగదారుడి మొబైల్ నంబర్‌కు నాలుగు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. వీటిలో ఒక సరీ్వసును మాత్రమే ఆయన వాడుతున్నాడు. మిగతా మూడు ఎవరివో, తనకెందుకు బిల్లు వస్తుందో ఆయనకు తెలియడం లేదు. అంటే.. ఆయన సెల్ నంబర్‌తో అనుసంధానమైన ఇతర సరీ్వసులను వేరెవరో అక్రమంగా వినియోగిస్తుండాలి. సాక్షి, అమరావతి: ఇవి ఇటీవల విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి వచ్చిన కొన్ని ఉదంతాలు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అనేక విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో చాలావరకు అక్రమ సర్వీసులే. కాగా కొన్ని విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాల వల్ల వినియోగదారులకు మంజూరయ్యాయి. ఇలాంటివాటిపై ఇప్పుడు విద్యుత్ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వాడుతున్న మీటర్లను తొలగించడంతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనుంది. బాధ్యుల్లో విద్యుత్ శాఖ సిబ్బంది ఉంటే వారిపైనా శాఖాపరమైన చర్యలు చేపట్టనుంది. ‘డీపీఈ’ ఎప్పట్నుంచో చేస్తున్నదే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో డిటెన్షన్ ఆఫ్ ఫిలపరేషన్ ఎనర్జీ (డీపీఈ) విభాగం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అక్రమ విద్యుత్ సర్వీసులను కనిపెట్టడం దీని విధి. ఇప్పుడు తాజాగా విద్యుత్ సర్వీసుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియను ఇది జోడించింది. ఇలా చేయడం వల్ల ఒక ఆధార్‌పై ఎన్ని విద్యుత్ సర్వీసులు మంజూరయ్యాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తద్వారా అక్రమ కనెక్షన్లను ఏరిపారేయవచ్చనేది విద్యుత్ శాఖ అధికారుల వ్యూహం. అంతేకాకుండా ఒక భవనానికి ఒకే యజమాని ఒకటి కంటే ఎక్కువ మీటర్లు వాడటాన్ని అడ్డుకోవచ్చు. అవి అసత్య ప్రచారాలంటున్న అధికారులు డిస్కమ్‌లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) చేస్తున్న ఈ పనిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక భవనంలో వేర్వేరు పోర్షన్లలో వేర్వేరు కుటుంబాలు ఉన్నప్పటికీ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసి, అన్ని సర్వీసులకు కలిపి ఒకే బిల్లును జారీ చేస్తారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దీంతో స్లాబులు మారిపోయి విద్యుత్ బిల్లు పెరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలకు దూరమవుతారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ఈ అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె. పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వంట గది ఉన్న ఇంటికి ఒకే సర్వీసును మంజూరు చేస్తామని చెబుతున్నారు. వివిధ వర్గాలకు ప్రభుత్వం వర్తింపజేసే సంక్షేమ పథకాలకు తాము చేపట్టిన ప్రక్షాళన చర్యల వల్ల ఎటువంటి భంగం వాటిల్లదని ‘సాక్షి’కి వివరించారు. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
గ్రామాల నెత్తిన బాబు బండ
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన పాపం ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రజానీకానికి శాపంగా మారింది. పంచాయతీల్లో వీధి దీపాలు, మంచి నీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పంచాయతీలపై వేల కోట్లు బకాయిల బండ వేశారు. 2019 మేలో చంద్రబాబు అధికారం నుంచి దిగేనాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ. 3,481 కోట్లు ఉన్నాయి. బాబు సర్కారు ఉన్న ఐదేళ్లలో కేంద్రం నుంచి నిధులు విరివిగా వచ్చినప్పటికీ, వాటిని విద్యుత్ బిల్లులకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించలేదు. దీంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. చంద్రబాబు హయాంలో ఉన్న బకాయిలను కూడా వడ్డీతో సహా చెల్లిస్తోంది. దీంతో అప్పటి బకాయిలు రూ. 2,963 కోట్లకు తగ్గాయి. బకాయిల వివరాలను విద్యుత్ సంస్థలు ప్రతి నెలా పంచాయతీలకు పంపుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల వీటిని గ్రామ పంచాయతీల నిధుల నుంచి విద్యుత్ సంస్థలు జమ చేసుకుంటున్నాయి. దానిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం పంచాయతీల నిధులను మళ్లిస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ప్రభుత్వ హయాంలోనే బకాయిలు పెట్టి, వాటిని విద్యుత్ సంస్థలు జమ చేసుకుంటుంటే విమర్శలు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆ బకాయిలు కట్టకపోతే ప్రజలపైనే భారం ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల ప్రకారం.. బకాయిలు పేరుకుపోయి విద్యుత్ సంస్థలు అప్పుల పాలైతే, నష్టాన్ని పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచి సాధారణ ప్రజలపైనా ఆ భారం మోపుతాయి. వినియోగదారుడు సకాలంలో బిల్లు చెల్లించకపోతే, వందకు ఏడాదికి 18 శాతం చొప్పున అపరాధ రుసుం వసూలు చేస్తాయి. ఈ నిబంధనలే గ్రామ పంచాయతీలకు కూడా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. అయినా, 2014 – 2019 మధ్య కేంద్రం నుంచి పంచాయతీలకు విరివిగా నిధులు వచ్చినప్పటికీ, చంద్రబాబు సర్కారు వాటిని వేరే పనులకు మళ్లించి, పంచాయతీల నెత్తిన విద్యుత్ బిల్లుల భారాన్ని మోపింది. అవి అపరాధ రుసుముతో కలిపి తడిసిమోపెడయ్యాయి. ఈ రెండున్నర ఏళ్లు ఎప్పటి కరెంటు బిల్లులు అప్పుడే చెల్లింపు.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు చెందిన కరెంటు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించేస్తోంది. పైగా, తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టిన బకాయిలు, వాటిపై వడ్డీని కూడా కొంతమేరకు చెల్లించింది. ఈ విధంగా చంద్రబబు సర్కారు పెట్టిన బకాయిల్లో రూ. 518 కోట్లు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. 2020 ఏప్రిల్ నుంచి గ్రామాల అభివృద్దికి కేంద్రమిచ్చే అర్థిక సంఘం నిధుల్లో 70 శాతమే పంచాయతీలకు కేటాయించారు. మండల , జిల్లా పరిషత్‌లకు 30 శాతం కేటాయించారు. నిధులు తక్కువగా ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీల విద్యుత్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించడమే కాకుండా, పాత బకాయిలనూ చెల్లిస్తోంది. ఆ ఐదేళ్లలో రూ. 6,667 కోట్ల పంచాయతీల నిధులున్నా.. 2015కు ముందు, 2020 తర్వాత గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కలిపి కేటాయించింది. పంచాయతీలకు 70 శాతం, మండల , జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున కేటాయించింది. అయితే, చంద్రబాబు సీఎంగా ఉన్న ఆ ఐదేళ్లు కేంద్రం మొత్తం నిధులను గ్రామ పంచాయతీలకే ఇచ్చింది. ఈ విధంగా 2015 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,917.34 కోట్లు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 – 13 మధ్య పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అప్పట్లో నిలిపివేసిన 13వ ఆర్థిక సంఘం నిధులలో రూ. 1,750 కోట్లను కూడా 2014 జూన్ –2015 మార్చి మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో రూ. 6,667 కోట్లు పంచాయతీలకు సమకూరాయి. అయినా, బాబు సర్కారు పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీల కరెంటు బకాయిలు పేరుకుపోవడంపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగినా, అవి ‘ఉపాధి’ నిధులతో జరిగాయి. ఆర్థిక సంఘం నిధులు వెచ్చించింది లేదు. దీంతో ఆర్థిక సంఘం నిధులను అప్పటి ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించిందన్న ఆరోపణలున్నాయి. -
ఐదేళ్ల ‘ట్రూ అప్’పై విచారణ
సాక్షి, అమరావతి: ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల వసూలు సబబేనని కొందరు, ఆ భారం ప్రజలపై వేయరాదని మరికొందరు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సూచించారు. రాష్ట్ర ప్రజలపై సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల నుంచి మొదలుపెట్టిన ఐదేళ్ల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపీఈఆర్సీ సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించింది. 2014–15 నుంచి 2018–19 వరకు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలు, వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మండలిని కోరాయి. దీన్లో రూ.3,669 కోట్ల వసూలుకు అనుమతి ఇస్తూ ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఉత్తర్వులిచ్చింది. ట్రూ అప్ చార్జీలపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని, అవగాహన కల్పించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుమోటోగా తీసుకున్న ఏపీఈఆర్సీ ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసి, ట్రూఅప్ చార్జీలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి సేకరించాలని నిర్ణయించింది. గతనెల 19న నిర్వహించిన విచారణలో 86 మంది అభిప్రాయాలు వెల్లడించారు. సోమవారం ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి పారిశ్రామిక, వాణిజ్య, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 45 మంది విచారణకు హాజరుకాగా 15 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ట్రూ అప్ చార్జీలు విధించడాన్ని కొందరు సమర్థించారు. విచారణలో ఏపీఈఆర్సీ సభ్యులు రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామాసింగ్, కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెలగబెట్టేశారు!
ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి. – సాక్షి, అమరావతి ఏం చేస్తున్నావురా వెంకన్నా...? మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..! రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్ బాక్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.వందల కోట్లు ఆదా.. వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 15 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు. రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రూ.వెయ్యి బల్బుకు రూ.6,000 పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. -
సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు
సాక్షి, అమరావతి: సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రూ అప్ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ► ఇంధన – విద్యుత్ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు. ► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్ వినియోగం 12,000 మిలియన్ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు. ► విద్యుత్ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది. ► విద్యుత్ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు. ► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు రూ .0.69/యూనిట్, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్ గా ఉంది. -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్‌లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్‌ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్‌ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్ చేసినా అన్‌ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఆటోమేటిక్ చెల్లింపులకు ఏప్రిల్ గండం..!
ముంబై: మొబైల్ బిల్లుల నుంచి కరెంటు, నీరు తదితర బిల్లుల దాకా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం ఆటోమేటిక్ విధానాన్ని పాటిస్తున్న కస్టమర్లు రాబోయే ఏప్రిల్‌లో సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్దేశించిన ప్రీ–డెబిట్ నోటిఫికేషన్ నిబంధనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటం, బ్యాంకులు.. కార్డు సంస్థలు మాత్రం ఇంకా వీటిని పాటించేందుకు పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం ఇందుకు కారణం. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ సర్వీసులకు, భారతి ఎయిర్టెల్.. వొడాఫోన్ వంటి టెల్కోలకు, టాటా పవర్ వంటి విద్యుత్ సంస్థలకు ఆటోమేటిక్ విధానంలో బిల్లులు కడుతున్న కస్టమర్లు ఇబ్బందులు పడనున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చి 31 డెడ్‌లైన్.. సాధారణంగా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం పలువురు బ్యాంక్ కస్టమర్లు ఆటోమేటిక్ డెబిట్ విధానం ఎంచుకుంటూ ఉంటారు. దీని ప్రకారం నిర్దేశిత తేదీ నాడు బ్యాంకులు ఆయా బిల్లుకు కట్టాల్సిన మొత్తాలను వారి ఖాతాల నుంచి డెబిట్ చేస్తుంటాయి. సాధారణ ఖాతాదారులు, చిన్న..మధ్య తరహా సంస్థలు మొదలుకుని కార్పొరేట్ సంస్థల దాకా పలువురు కస్టమర్లు .. నెలవారీ బిల్లుల చెల్లింపులకు ఇలాంటి ఆటోమేటిక్ విధానాన్నే పాటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇలాంటి లావాదేవీల పరిమాణం సుమారు రూ. 2,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. ఇంత కీలకంగా ఉన్న ఆటోమేటిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం... ఇకపై ఇలా పేమెంట్ జరిపే తేదీకి అయిదు రోజులు ముందే కస్టమరుకు బ్యాంకులు డెబిట్ లావాదేవీ గురించి నోటిఫికేషన్ పంపాల్సి ఉంటుంది. కస్టమరు అనుమతించిన తర్వాతే డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రూ. 5,000 దాటిన రికరింగ్ చెల్లింపుల కోసం ఖాతాదారుకు వన్–టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా పంపాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి .. 2019 ఆగస్టులో ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1తో మొదలయ్యే వచ్చే ఏడాది (2021–22) నుంచి అమల్లోకి వస్తున్నాయి. బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు, ఆన్లైన్ విక్రేతలు తదితర వర్గాలు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, పలు దిగ్గజ బ్యాంకులు, సంస్థలు ఈ నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా పూర్తి చేసుకోలేదని చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ’స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్’ను అమలు చేయలేమంటూ కస్టమర్లకు బ్యాంకులు సమాచారం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులతో పాటు ఎమెక్స్ వంటి కార్డ్ సంస్థలూ ఆటోమేటిక్ లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో డెబిట్/క్రెడిట్ కార్డులు మొదలైన వాటి ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరుగుతున్న సర్వీసులకు పేమెంట్ నిల్చిపోయి, సేవలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సి రానుంది. వ్యక్తిగతంగా ఆయా సంస్థల వెబ్సైట్ల ద్వారా పేమెంట్స్ చేయాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. -
థియేటర్లు అప్పుడే తెరవలేం!
సాక్షి, విజయవాడ: గత ఏడు నెలలుగా సినిమా రిలీజ్లు లేక నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కోవిడ్ నియంత్రణ చర్యలకు లోబడి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఫిలిం చాంబర్స్‌లో బుధవారం ఉదయం ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అధ్యక్షుడు కే.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బకాయిలు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా రద్దు కాలేదు. అనేక సమస్యల కారణంగా ఈ నెల 15 న నుంచి థియేటర్లు చేయటం లేదు. మంత్రి పేర్ని నాని గారి తో చర్చలు జరుగుతున్నాయి. మా సమస్యలు పరిష్కరించనంత వరకు సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదు. రేపటి నుంచి సినిమా హాళ్లు తెరవకూడదని నిర్ణయించాము’అని కేఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ‘లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలి. మా సమస్యలను చిరంజీవి నాగార్జున గారి సహకారంతో ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాం’ అని ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సెక్రటరీ గోరంట్ల బాబు అన్నారు. (చదవండి: చిగురుటాకులా వణికిన తీరం ) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ మినిమమ్ చార్జీలు వేశారు. ఒక్కో థియేటర్‌కు ఈ 7 నెలల కాలం లో 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇపుడు ఉన్న పరిస్థితిలో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుంది. కరోనా కారణంగా 500 థియేటర్లు కరెంట్ బకాయిలు కట్టలేదు. నిర్వహణ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం. కరెంట్ ఫీజులు రద్దు చేయండి. డబ్బున్న వాళ్లు కోవిడ్ సమయంలో కరెంట్ చార్జీలు కట్టారు. కట్టలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆక్యుపెన్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మా సమస్య పరిష్కస్తుందని ఆశిస్తున్నా’అని అన్నారు. (చదవండి: ‘800’ చిత్రంపై నెటిజనుల ఆగ్రహం) -
కరెంటు బిల్లులు తగ్గేలా పేదల ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఎనర్జీ ఎఫిషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్ (ఈఈటీసీ) సాంకేతికతను జోడించే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇదే సందర్భంలో ప్రతి ఇంటికీ 3 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఇంధన పొదుపు సామర్థ్య ఫ్యాన్లను అమర్చాలని నిర్ణయించారు. దీనివల్ల పేదల కోసం నిర్మించే ఇళ్లకు కరెంటు బిల్లు కనీసం 20 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇంధన పొదుపు శాఖ సమీక్ష ► పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే 30 లక్షల ఇళ్లకు ఈఈటీసీ టెక్నాలజీని జోడిస్తే దేశంలోనే ఏపీ రోల్ మోడల్‌గా నిలుస్తుందని కేంద్ర ఇంధన పొదుపు సంస్థ చైర్మన్ రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. ఇందుకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ► ఈఈటీసీ టెక్నాలజీపై గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఇంధన పొదుపు సంస్థ వైస్ చైర్మన్ సౌరబ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులతో సమీక్ష జరిగింది. ► ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఇండో స్విస్ భాగస్వామ్యంతో.. ► నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఆధునిక గృహాలు నిర్మించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్, భారత్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఇండో–స్విస్ ‘బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈపీ)’ ఈ పథకంలో భాగమయ్యేందుకు ఇప్పటికే ముందుకొచ్చింది. ► తాజాగా ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ► ఈఈటీసీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపడితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 4 నుంచి 8 డిగ్రీలు తగ్గటం, 20% విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. ► ఇదే సందర్భంలో ప్రతీ ఇంటికి 3 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్‌లైట్లు, 2 ఇంధన సామర్థ్య ఫ్యాన్లను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేలా.. పేదల జీవన ప్రమాణాలను పెంచే దిశగా అన్ని చర్యలూ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని అజయ్‌జైన్ తెలిపారు. ఇందుకు అనుగుణంగానే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. -
‘విద్యుత్ బిల్లింగ్‌లో పారదర్శకత చూపించాలి’
ముంబై: విద్యుత్ బిల్లింగ్ విధానాల్లో మరింత పారదర్శకత చూపించాలని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(ఎంఈఆర్సీ)ను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. అధిక విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా విద్యుత్ సంస్థలను ఆదేశించాలని ఎంఈఆర్‌సీకి సూచించారు. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు అధికంగా రావటంతో వినియోదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. (నవంబర్ వరకు ఉచిత రేషన్ : మోదీ) ఇక మార్చి, మే నెలల్లో విద్యుత్ బిల్లు సగటు కంటే రెట్టింపు వస్తే వినియోదారులు మూడు నెలవారీ వాయిదాల్లో ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఇస్తున్నట్లు ఎంఈఆర్సీ పేర్కొంది. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇళ్ల వద్దకు వెళ్లి విద్యుత్ మీటర్ల రీడింగ్‌ను నమోదు చేయటాన్ని విద్యుత్ సంస్థలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక సగటు కంటే రెండు, మూడు రెట్లు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లుల పట్ల వినియోగదారలు వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తూ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (ఉచిత విద్యుత్‌కు శాశ్వత భరోసా) -
కరెంటు బిల్లుల మాఫీపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల లాక్డౌన్ విధించిన కాలానికి కరెంటు బిల్లులు మాఫీ చేయాలంటూ రాష్ట్ర హైకోర్టులో సోమవారం పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాదులు నరేశ్, సమీర్ వేసిన పిటిషన్ పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ పీడీసీఎల్ ను ఆదేశించింది.(శిల్పారెడ్డికి కరోనా వైరస్) లాక్డౌన్ సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, శ్లాబులు తగ్గించి బిల్లుల భారం నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌నూ హైకోర్టు విచారించింది. కరెంటు బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా.. తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఫిర్యాదుల కమిటీకి 6,767 ఫిర్యాదులు రాగా, 6,678 ఫిర్యాదులను పరిష్కరించినట్లు అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. (ఆన్లైన్లో టెన్త్ ‘గ్రేడ్’ వివరాలు) -
విద్యుత్ బిల్లుల విధానాన్ని సరళతరం చేశాం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో విద్యుత్ బిల్లుల విధానాన్ని చాలా సరళతరం చేశామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) హైకోర్టుకు నివేదించింది. ఎంత వాడుకుంటే అంతే బిల్లు చెల్లించేలా కేటగిరీల వారీగా మార్పులు చేశామని తెలిపింది. గతంలో కొన్ని కేటగిరీల్లో తక్కువ విద్యుత్ వాడుకున్నప్పటికీ, ఏడాది మొత్తం వాడుకున్న యూనిట్ల ప్రకారం చెల్లింపులు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని మార్చామని వివరించింది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంది. లాక్డౌన్ వల్ల మార్చి విద్యుత్ రీడింగ్‌ను ఏప్రిల్‌లో తీసుకోవడం సాధ్యం కాలేదంది. కొందరు వినియోగదారులు 24 గంటల పాటు విద్యుత్‌ను వినియోగించడంతో మార్చిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని తెలిపింది. ఏప్రిల్ నుంచి మేలో రీడింగ్ నమోదు చేసేంత వరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేశామంది. అధిక మొత్తాలను వసూలు చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదంది. ఎటువంటి వడ్డీ, అపరాధ రుసుం లేకుండా బిల్లు చెల్లింపు గడువును జూన్ 30 వరకు ఇచ్చామని తెలిపింది. బిల్లుల విషయంలో సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఇచ్చామని వివరించింది. నెలకు 75 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఏ కేటగిరీ, 75 నుంచి 225 యూనిట్ల వరకు బీ కేటగిరీ, 225 యూనిట్లకు పైన సీ కేటగిరీగా నిర్ణయించామంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది. కొత్త విద్యుత్ టారిఫ్‌ను సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ హరనాథ్‌రావు పై వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. -
కరెంట్ బిల్లు.. పట్టుకుంటే షాక్
వనస్థలిపురానికి చెందిన ఓ వినియోగదారుడు 2019 మార్చిలో 175, ఏప్రిల్‌లో 175, మేలో 312 యూనిట్ల విద్యుత్‌ను ఖర్చుచేశాడు. ఆయన మార్చి, ఏప్రిల్ నెలల్లో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించాడు కాబట్టి రెండో కేటగిరి కింద ఆయనకు ఒక్కో నెలకు రూ.713 చొప్పున బిల్లు వచ్చింది. మేలో 312 యూనిట్ల వినియోగంతో మూడో కేటగిరి కింద రూ.1,921 బిల్లు వచ్చింది. గతేడాది ఆ మూడు నెలల్లో 662 యూనిట్లకు మొత్తం రూ.3,346 బిల్లు వచ్చింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 657 యూనిట్లే కాల్చాడు. గతంతో పోలిస్తే ఐదు యూనిట్లు తగ్గాయి. కానీ, ఈ ఏడాది 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, వచ్చిన మొత్తం యూనిట్లను 3 నెలల సగటుగా విభజించి బిల్లు వేయడంతో కేటగిరి సహా స్లాబ్‌రేట్ మారిపోయింది. ఫలితంగా రూ.3,630 బిల్లు వచ్చింది. గతంతో పోలిస్తే తాను తక్కువ విద్యుత్ వాడినా, బిల్లెందుకు పెరిగిందంటూ ఆధారాలతో సహా అధికారులను ప్రశ్నిస్తే.. స్పందన లేదు. ఈయనకే కాదు.. నెలకు 200 యూనిట్లలోపు వాడే 80 శాతం మంది వినియోగదారులకు ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలకు పొంతన ఉండట్లేదు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లుల తీరుపై జనం గగ్గోలు పెడుతున్నారు. వీటిపై కొంతమంది నేరుగా సమీపంలోని విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్ఓ) కేంద్రాలకు వెళ్లి, మరికొందరు ఆన్లైన్, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు వేలకుపైగా ఫిర్యాదులందాయి. వాటిలో కొన్నిటిని పరిష్కరిస్తుంటే, మరికొన్నింటిని గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు ఆఫీసుకు వెళ్లి ఆరా తీస్తుంటే.. సరైన సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు. 3 నెలల సగటు..మారిన స్లాబ్‌రేట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 సర్కిళ్లు, 21 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 53 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నా రు. వీరిలో 45 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు. మరో ఏడున్నర లక్షల మంది వాణిజ్య వినియోగదారులు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. వీటి ద్వారా డిస్కంకు నెలకు సుమారు రూ.1,250 కోట్ల ఆదాయం వస్తోంది. గృహ విద్యుత్ వినియోగదారుల్లో 200 యూనిట్లలోపు వాడే వారే 80 శాతం మంది ఉంటారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏ ప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. తీరా మూడు నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం, మొత్తం యూనిట్లను మూడు నెలలకు విభజించి లెక్కించడం వల్ల స్లాబ్‌రేట్ సహా కేటగిరీలు మారి బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. గతంలో నెలకు రూ.500 లోపు వచ్చే బిల్లు ఈ మూడు నెలలకు కలిపి రూ.3 వేలకుపైగా రావడంతో వినియోగదారులు బిత్తరపోతున్నారు. డిస్కం మాత్రం.. లాక్డౌన్ సమయంలో కుటుంబసభ్యులం తా రోజంతా ఇళ్లలోనే ఉండటం, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆన్‌లో ఉంచడం వల్లే కరెంట్ వాడకం పెరిగి రెట్టింపు విద్యుత్ బిల్లులు వచ్చాయని అంటోంది. ఓ హెల్ప్‌లైన్ సెంటర్లో తన విద్యుత్ బిల్లుపై సంప్రదిస్తున్న వినియోగదారుడు 40% మంది ముందే చెల్లించినా.. లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో డిస్కం విద్యుత్ బిల్లులు జారీ చేయలేదు. కానీ గతేడాది ఏ నెలలో ఎంత చెల్లించారో, అవే చెల్లింపుల ఆధారంగా ఈ ఏడాది బిల్లులు చెల్లించాలని కోరింది. ఎప్పుడైనా చెల్లించేదే కదా అని భావించి 40 శాతం మంది ఆన్లైన్లో ముందే బిల్లులు చెల్లించా రు. వీరికెలాంటి మినహాయింపులు ఇవ్వలే దు. ఏ నెల బిల్లు ఆ నెలే చెల్లించినా.. 3 నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల వారంతా నష్టపోవాల్సి వచ్చింది. భారీగా పెరిగిన ఈ బిల్లులు చెల్లించే పరిస్థితుల్లో లేమంటూ వేలాది మంది వినియోగదారులు ఆన్లైన్, ట్విట్టర్ వేదికగా డిస్కంకు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు స్వయంగా సమీపంలోని ఈఆర్ఓలకు చేరుకుని, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. వినియోగదారులకు సమాధానం చెప్పలేక, వారి ఆగ్రహాన్ని చల్లార్చలేక క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఆ మూడుచోట్లా తప్ప ఫిర్యాదులపై పట్టింపేది? బంజారాహిల్స్, గ్రీన్లాండ్స్, సనత్‌నగర్ ఈఆర్ఓల పరిధిలో ఇప్పటివరకు 401 ఫి ర్యాదులు అందినట్లు తెలిసింది. అధికారులు ఆయా డివిజన్ల పరిధిలో ప్రత్యేక హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పు డు రికార్డు చేస్తున్నారు. మొత్తం యూనిట్లు సహా మూడు నెలల సగటు, శ్లాబ్‌రేట్, వచ్చిన బిల్లులకు వివరణ ఇస్తున్నారు. రీడింగ్, బిల్లులో సాంకేతిక లోపాలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇతర సర్కిళ్లలో మాత్రం ఫిర్యాదులను అసలు పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. -
కొందరికి లాభం..కొందరికి నష్టం
సాక్షి, హైదరాబాద్: స్వల్ప తేడాతో శ్లాబులు మారిపోయి చాలామంది వినియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా జూన్ నెలలో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోయాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి ఈ అంశం పై వివరణ ఇచ్చారు. మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కాలేదని, దీంతో గత మూడు నెలల విద్యుత్ వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్‌ను ఈ నెలలో ఒకేసారి తీసి సగటున ఒక్కో నెల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేశామని తెలిపారు. సోమవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్వల్పంగా కొన్ని పాయింట్ల తేడాతో అనేకమంది వినియోగదారులకు సంబంధించిన శ్లాబులు మారిపోయింది వాస్తవమే అని అంగీకరించారు. దీంతో కొంత మంది వినియోగదారులు లాభపడ్డారని, కొందరు నష్టపోయారని అన్నారు. వేసవిలో విద్యుత్‌ను ఎక్కువగా వాడడం వల్లే చాలా మందికి బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎమ్మెల్యేలు సైతం తమకు బిల్లులు ఎక్కువ వచ్చాయంటూ ఫిర్యాదు చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఏవైనా సాంకేతిక లోపాల వల్ల ఎవరికైనా అధికంగా బిల్లులు వస్తే వాటిని సరిదిద్దుతామన్నారు. గత మూడు నెలలకు సంబంధించిన బిల్లుల బకాయిలను వచ్చే మూడు నెలలపాటు వాయిదాల్లో 1.5 శాతం వడ్డీతో చెల్లించేందుకు అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. -
లాక్డౌన్ వల్లే విద్యుత్ చార్జీలపై అపోహలు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలో విధించిన లాక్డౌన్ వల్లే విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప ప్రభుత్వం ధరలను పెంచలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాసులరెడ్డి, ఏఏఓ బాలసుబ్రహ్మణ్యంతో కలసి విద్యుత్‌చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ పలు మార్లు అధికారులతో చర్చించిన అనంతరం అనుమానాలను నివృతి చేసుకుని ఈ విషయాలను చెబుతున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో విద్యుత్‌సిబ్బంది బిల్లులు వసూలు చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు.దాదాపు 70 రోజుల పాటు బిల్లులు వసూలు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలతోపాటు జూన్ నెలకు సంబంధించి 15 రోజుల బిల్లును కూడా కలుపుతున్నారన్నారు. దీనికి సంబంధించి స్లాబ్‌లు మార్చలేదన్నారు. కేవలం రోజువారీ విద్యుత్ ఖర్చును లెక్కించి బిల్లు వేశారన్నారు. ప్రొద్దుటూరు నియోజకర్గంలో లక్షా 5వేల విద్యుత్ మీటర్లు ఉండగా కేవలం ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే ఈ సమస్య ఏర్పడిందన్నారు. మండలంతోపాటు రాజుపాళెం మండలంలో కరోనా ప్రభావం లేకపోవడంతో యధావిధిగా వసూలు చేశారన్నారు. అక్కడ బిల్లు పెరగలేదన్నారు. టీడీపీ నేతలు చేసిన విమర్శలపై తాను వివరణ ఇవ్వలేదని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి బిల్లులు పెంచి ఖజానా నింపుకోవాల్సిన అవసరం లేదన్నారు. 500 యూనిట్లుపైగా విద్యుత్ ఖర్చు చేసేవారికి మాత్రమే యూనిట్‌కు 90పైసలు చొప్పున చార్జీలు పెంచారన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ప్రజలు తమకు పథకాలు వర్తించబోమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు ఓ మారు పెంచి ఏడాదికంతటికీ అదే విధానాన్ని అమలు చేసేవారన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఖర్చు ఆధారంగా వచ్చే కేటగిరిని బట్టి ప్రతి నెలా వసూలు చేస్తారన్నారు. చంద్రబాబు తన హయాంలో రూ.2.5లక్షల కోట్లు అప్పు పెట్టగా సీఎం జగన్ ఆ బకాయిలను పూడ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టిబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని పరిశీలించారు. నూతన భవనం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయంపై ప్రతిపాదనలు తయారు చేసి పంపితే తాను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. -
విద్యుత్ బిల్లుపై పార్లమెంటులో పోరాడుతాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన ‘విద్యుత్ బిల్లు’పై తమతో వచ్చే రాష్ట్రాలతో కలసి పార్లమెంటులో పోరాడతామని శాసన మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి అనుకూలమో, వ్యతిరేకమో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ) లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధా ని మోదీ ఫ్యూడల్ విధానాలను వ్యతిరేకించి తీరుతామని, పేదలకు వ్యతిరేకంగా సంస్కరణలు ఉండకూడదన్నదే టీఆర్ఎస్ పార్టీ వైఖరి అని పేర్కొన్నారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఆకలైన వాడికి ఆరు నెలల తర్వాత బిర్యానీ పెడతామన్న రీతిలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవాలు మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 70 ఏళ్లుగా కేంద్రంలో మోదీ మినహా ఎవరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆయన వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు పథకం అమలుకు కేసీఆర్ పెట్టే షరతులను కేంద్రం షరతులతో పోల్చడం కిషన్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుత సంక్షోభంలో ప్రజల చేతికి డబ్బు అందేలా హెలికాప్టర్ మనీ అంశాన్ని కేసీఆర్ ప్రతిపాదించారని, ఆర్థిక వేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నా ప్రధాని మోదీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యులతో పాటు బీజేపీ నేతలకు కూడా అర్థం కావడం లేదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కేంద్రం వెచ్చించేది రూ.2.50 లక్షల కోట్లకు మించదన్నారు. -
ఈ నెలలోనూ పాతబిల్లే..!
సాక్షి, నల్లగొండ : విద్యుత్ శాఖకు ఈ నెల కూడా కరోనా దెబ్బ తప్పలేదు. ఈ నెలలోనూ పాత బిల్లులే చెల్లించాలని ఆ శాఖ అధికారులు వినియోగదారులను కోరుతున్నారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ రెండు నెలలుగా మీటర్ రీడింగ్ తీయడంలేదు. గత నెల మాదిరిగానే ఈ నెలలోనూ 2019 ఏప్రిల్‌లో వచ్చిన బిల్లులే చెల్లించాలని కోరుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 6 లక్షల14 వేల వివిధ కేటగిరీల కనెక్షన్లు ఉండగా.. వాటి ద్వారా ప్రతి నెలా సుమారు రూ.21 కోట్ల విద్యుత్ బిల్లులు రావాల్సి ఉండగా.. గత నెలలో కేవలం రూ.9 కోట్ల వరకు వినియోగదారులు చెల్లించారు. ఈ నెలలో రూ.3.36 కోట్లు మాత్రమే వసూలైంది. బిల్లుల చెల్లింపునకు విముఖత కరోనా కారణంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన విద్యుత్ శాఖ మీటర్ రీడింగ్ తీయలేదు. 2019 ఏప్రిల్ మాసంలో చెల్లించిన బిల్లులను చెల్లించాలని కోరింది. బిల్లులు చెల్లించకపోయినా విద్యుత్ కనెక్షన్ మాత్రం తొలగించమని స్పష్టం చేసింది. లాక్డౌన్ ముగిశాక మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన రీడింగ్‌లు తీసి ఏనెలకు ఆ నెల విద్యుత్ బిల్లును విభజించి ఇస్తామని చెప్పింది. తర్వాత వినియోగదారులకు ఆయా నెలల్లో వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి మాత్రమే బిల్లు వస్తుందని పేర్కొంది. అయినా వినియోగదారులు మాత్రం బిల్లుల చెల్లింపునకు సుముఖత చూపడంలేదు. రూ.21 కోట్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల 36 లక్షలు మాత్రమే వసూలైంది. ఈ నెల 22 వరకు మాత్రమే బిల్లుల చెల్లింపునకు గడువు ఉంది. కేవలం ఐదు రోజుల్లో మిగిలిన రూ.17 కోట్ల పైచిలుకు బిల్లులను చెల్లించడం సాధ్యం కాని పరిస్థితి. వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించండి విద్యుత్ వినియోగదారులు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి బిల్లులు చెల్లించాలి. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థ 24 గంటల విద్యుత్ అందించింది. బిల్లులు చెల్లించకపోతే సంస్థకు ఇబ్బందులు ఎదురవుతాయి. బిల్లుల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. సంస్థ ఒక్క రూపాయకూ డా ఎక్కువ తీసుకోదు. ఎక్కువ చెల్లించినా తరువాత నెల బిల్లులో సరిచేస్తాం. వినయోగదారులు అంతా బిల్లులు చెల్లించాలి. – కృష్ణయ్య, ట్రాన్స్‌కో ఎస్ఈ -
ప్రస్తుత విధానంలోనే పేదలకు ఊరట
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లింగ్ విషయంలో డైనమిక్ విధానం అనుసరించడం వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లు ఏడాది పొడవునా భారం కాకుండా ఉంటుంది. అయితే లాక్డౌన్ కారణంగా గృహ విద్యుత్ వినియోగం పెరగడం వల్ల ఈ మార్పు స్పష్టంగా కన్పించడం లేదు. అదే పాత పద్ధతి (స్టాటిక్)లో బిల్లింగ్ వల్ల ఒక నెలలో వినియోగం పెరిగితే దాని భారం ఏడాదంతా మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్చి నెల పూర్తవ్వడంతోనే గత సంవత్సర వినియోగం ఆధారంగా శ్లాబుల వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా అనేక మంది ఎక్కువ యూనిట్ ధర ఉండే శ్లాబులోకి వెళ్తారు. మరుసటి ఏడాది తక్కువ విద్యుత్ వినియోగించినా ఆ ఏడాదంతా అధిక ధర ఉన్న శ్లాబులోనే బిల్లులు కట్టాల్సి ఉంటుంది. డైనమిక్ విధానం ఈ ప్రమాదాన్ని తప్పించింది. మధ్యతరగతికీ ప్రయోజనమే నెలకు 225 (ఏడాదికి 2700) యూనిట్లు వాడే విద్యుత్ వినియోగదారులు రాష్ట్రంలో 62.43 లక్షల మంది ఉన్నారు. డైనమిక్ విధానంలో లెక్కకట్టడం వల్ల విద్యుత్ ఎక్కువగా వాడిన నెలకు మాత్రమే శ్లాబు మారుతుంది. వినియోగం తగ్గిన నెలలో తక్కువ శ్లాబులోకి వెళ్లడం వల్ల బిల్లు తగ్గుతుంది. ఉదాహరణకు 225 యూనిట్ల నెలవారీ టార్గెట్ దాటి ఏదైనా నెలలో 300 యూనిట్లు వాడి ఉంటే పాత పద్ధతిలోనైతే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆ వినియోగదారుడు ‘సి’ కేటగిరీలోకి వస్తాడు. దీంతో ఈ ఏడాది మొత్తం నెలకు రూ. 225 చొప్పున రూ. 2,700 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎలా అంటే.... 75 యూనిట్లు వాడేవారు 73.37 లక్షలు ► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో నెలకు 75 యూనిట్లు (ఏడాదికి 900 యూనిట్లు) వాడే వారు 73.37 లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా ‘ఎ’ కేటగిరీ కిందకే వస్తారు. వీళ్ల విద్యుత్ వినియోగం 2019–20లో 900 యూనిట్లు దాటితే ఈ ఏడాది మొత్తం ‘బి’ కేటగిరీలోనే కొనసాగుతారు. ► ఉదాహరణకు ఏదైనా ఒక నెలలో 75 యూనిట్లు దాటి, గత ఏడాదిలో 900 యూనిట్లకు పైగా వినియోగించినప్పుడు ఈ సంవత్సరం ’బి’ కేటగిరీలోకి రావడం వల్ల స్టాటిక్ విధానంలో మొదటి 75 యూనిట్లకు యూనిట్ రూ. 2.60 చొప్పున నెల బిల్లు రూ. 195 వస్తుంది. కానీ స్టాటిక్ విధానం తీసేసి, డైనమిక్ పద్ధతిలో బిల్లు చేయడం వల్ల మొదటి 50 యూనిట్లకు యూనిట్ రూ. 1.45 చొప్పున 72.50, మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 2.60 చొప్పున రూ. 65 కలిపి మొత్తం రూ. 137.50 బిల్లు వస్తుంది. స్టాటిక్ విధానంలో బిల్లింగ్ వల్ల నెలకు రూ. 57.50 చొప్పున ఏడాదికి రూ. 2147.25 అధికంగా చెల్లించాల్సి వచ్చేది. -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు. -
విద్యుత్ చార్జీలు పెంచలేదు: బాలినేని
సాక్షి, ప్రకాశం : .ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్కడ పెంచలేదని, గతంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్రస్తుతం అమలు పరుస్తున్నామని మంత్రి స్పస్టం చేశారు. శుక్రవారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్కవ రావడంతో ప్రస్తుతం ప్రజల్లో అపోహలు నెలకొన్నాయన్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడం వల్ల బిల్లులు పెరిగాయని, దీనిపై అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు (విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన) మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచారని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’) -
విద్యుత్ బిల్లులపై అపోహలొద్దు
కడప కార్పొరేషన్: విద్యుత్ బిల్లులపై అపోహలను నమ్మరాదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా వినియోగదారులను కోరారు. గురువారం ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాసులు, డీఈ జగన్మోహన్రెడ్డి, ఏడీఈలు నాగమునిస్వామి, చాంద్‌బాషాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం ఎలాంటి భారం మోపలేదన్నారు. ఫిబ్రవరి బిల్లులను మామూలుగానే చెల్లించారని, మార్చి బిల్లుకు ఫిబ్రవరి తరహాలోనే చెల్లించాలన్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలకు మే 8న రీడింగ్ తీశారన్నారు. మార్చికి సంబంధించిన 22 రోజులు బిల్లును విభజించారన్నారు. 60 రోజులకు గాను 22 రోజులకు ఒకటి, 38 రోజులకు ఒక బిల్లు వచ్చాయన్నారు. రెండు బిల్లులను కలపలేదని స్పష్టంచేశారు. లాక్డౌన్ వల్ల గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగిందన్నారు. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ అధికంగా వాడిన వారికి ఎక్కువగా బిల్లులు వచ్చి ఉంటాయన్నారు. జూన్ 30 వరకూ బిల్లు చెల్లించవచ్చన్నారు. దానిపై వడ్డీ పడకుండా సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ తప్పిదాలుంటే బిల్లులను సరిదిద్దుతామన్నారు. -
విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది. మరోవైపు అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ బిల్లులను సగటు (ర్యాండమ్)గా పరిశీలన చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలను ఇంధనశాఖ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. ► డిస్కమ్‌లు తమ వెబ్సైట్లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్ ఐ.డీ నంబరు ఫీడ్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి. ► 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుంది. శాస్త్రీయ పద్ధతిలోనే బిల్లులు రెండు నెలల వినియోగాన్ని విభజించి మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్‌లో విద్యుత్ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మే నెలకు కూడా విడిగానే బిల్లులు తయారుచేస్తామని వివరించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మే విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువును జూన్ 30 వరకు పెంచినట్టు తెలిపారు. విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 45 రోజుల పాటు పొడిగించారు. అప్పటిదాకా ఎలాంటి అపరాధ రుసుములు ఉండవన్నారు. -
వాడిన విద్యుత్‌కే బిల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీసినా... బిల్లింగ్ మాత్రం ఏ నెలకానెలే చేశామని తెలిపారు. బిల్లింగ్ చేసిన విధానాన్ని ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు. ► ప్రతి 30 రోజులకోసారి తీసే మీటర్ రీడింగ్ లాక్డౌన్ కారణంగా 60 రోజులకు (మార్చి, ఏప్రిల్ వినియోగం) తీశాం. ► ఏప్రిల్ 1 నుంచి ఏపీఈఆర్సీ ప్రకటించిన కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చిలో 10న రీడింగ్ తీయడం వల్ల మిగిలిన 21 రోజులనే లెక్కలోకి తీసుకున్నాం. అంటే రీడింగ్ తీసిన 60 రోజులలో 21 రోజులు మార్చి నెలకు, మిగిలినవి ఏప్రిల్‌లోకి విభజించాం. ► 75 యూనిట్లలోపు వినియోగం ఉంటే ఏ కేటగిరీలోనే ఉంటారు. 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బీ కేటగిరీ కిందే లెక్కిస్తారు. ఆ పైన వినియోగం ఉన్న వాళ్లే కేటగిరీ సీలోకి వెళ్తారు. 500 యూనిట్లుపైన వినియోగం ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఏడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు. కాబట్టి తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారం పడే వీలే లేదు. ► గత ఐదేళ్ల విద్యుత్ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ప్రతీ ఏడాది మార్చి నెలలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈసారి లాక్డౌన్ వల్ల ప్రతీ ఒక్కరూ గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారాయి. అంతే తప్ప రెండు నెలల రీడింగ్ వల్ల ఏ మార్పూ రాలేదు. -
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఊరట
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కాలంలో మూతపడిన పరిశ్రమలు, తెరుచుకోని వాణిజ్య సంస్థలకు విద్యుత్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాస్తవ వినియోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసే వరకు పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు ఉన్నతాధికారులు బుధవారం సంకేతాలు పంపించారు. వాస్తవ రీడింగ్ తీసే వరకూ.. ► లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు వంటివి కూడా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ► లాక్డౌన్ కారణంగా రీడింగ్ తీసే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగించిన యూనిట్ల ఆధారంగా మార్చి నెలకు ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని వినియోగదారులకు మెసేజ్‌లు వెళ్లాయి. ► మార్చి నెలలో కొన్ని రోజులు విద్యుత్ వినియోగించ లేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తామని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అభ్యంతరం లేవనెత్తాయి. ► దీనిపై స్పందించిన ఇంధన శాఖ వాటికి బిల్లులు ఇచ్చినా వాస్తవ రీడింగ్ తీసే వరకూ చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలిచ్చింది. ► ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు రూ.వెయ్యి కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ► ఏప్రిల్‌లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఇదే తరహా మినహాయింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. వసూళ్లు నిలిపేశాం విద్యుత్ వాడనప్పుడు బిల్లులు వసూలు చేయడం సరికాదని ఇంధన శాఖ భావించింది. ఈ దృష్ట్యా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జారీ అయిన బిల్లుల వసూలుకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. తదుపరి ఉత్తర్వులు అందే వరకూ డిస్కమ్‌లు ఈ ఆదేశాల్ని పాటిస్తాయి. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
గత నెల బిల్లే ఈ నెలకు..
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: కరెంట్ బిల్లులనూ మూడు నెలల పాటు వాయిదా వేశారని, కట్టాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు గురువారం స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరినాథరావు తెలిపారు. విద్యుత్ బిల్లులను వినియోగదారులకు ఈనెల 4వ తేదీలోగా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతామని ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్టీ ఆక్వా, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు మాత్రం మీటర్ రీడింగ్ ప్రకారమే విద్యుత్ బిల్లులను జారీ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, తెలంగాణలో కూడా గత నెల కరెంటు బిల్లులే ఈ నెలలోనూ చెల్లించాల్సి ఉంటుందని డిస్కమ్‌లు కోరనున్నాయి. లాక్డౌన్ షాక్ లేదు! సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా విద్యుత్ సరాఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన అన్ని విభాగాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జెన్కో థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కీలకమైన లోడ్ డిస్పాచ్, వాణిజ్య కొనుగోళ్లు, నెట్వర్కింగ్, ఉత్పత్తి సంస్థల్లో కొందరు ముఖ్యమైన ఉద్యోగులు లాక్డౌన్ నేపథ్యంలో లేనందున అందుబాటులో ఉన్నవారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో ముగ్గురితో బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దేశంలోని గ్రిడ్, క్షేత్రస్థాయి డిస్కమ్‌లకు అనుసంధానం చేసే లోడ్ డిస్పాచ్ సెంటర్‌తో సమన్వయం కోసం ఐదు బృందాలను నియమించారు. థర్మల్ విద్యుదుత్పత్తిలో సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు మరికొన్ని టాస్క్‌ఫోర్స్ బృందాలను సిద్ధం చేశారు. -
మార్చిలోనూ ఫిబ్రవరి బిల్లులే..!
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. కరోనా (కోవిడ్–19) ప్రభావంతో మార్చి 23 నుంచి లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని వినియోగదారులు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకూ చెల్లిస్తే సరిపోతుందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఒకవేళ విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు చేస్తామని వివరించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్‌కు సంబంధించిన సమస్యలుంటే 1912 నెంబరు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఇంటిలోనే ఉంటూ సహకరిస్తున్న విద్యుత్ వినియోగదారులకు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఇదే సహకారాన్ని అందించాలని, ప్రజలందరికి ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. -
పేదోడి కరెంట్ బిల్లు పైసా పెరగదు
సాక్షి, అమరావతి: పేదలు, అల్పాదాయ వర్గాల కరెంట్ బిల్లులు ఈ ఏడాది పైసా కూడా పెరిగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తేల్చిచెప్పారు. ప్రజలపై పడే రూ.10,060.63 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ.1,707.07 కోట్లను గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందన్నారు. ఇంతకాలం రకరకాల పద్ధతుల్లో ఉన్న పరోక్ష విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల కోరిక మేరకు ఎత్తేశామని చెప్పారు. కొత్త టారిఫ్ రూపకల్పనలో కమిషన్ పాత్రపై జస్టిస్ నాగార్జునరెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెంచలేదు.. తగ్గేలా చేశాం రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడకం ఉన్నవారు 50.90 లక్షల మంది. వీరికి గతంలోనూ, ఇప్పుడూ వచ్చే కరెంట్ బిల్లు (యూనిట్ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50. ఇక నెలకు 51–75 యూనిట్ల విద్యుత్ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు. వీరికి గతంలో రూ. 137.50 బిల్లు వచ్చేది.. ఇప్పుడూ అంతే. (50 యూనిట్ల వరకూ యూనిట్ రూ.1.45.. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్ రూ.2.60 చొప్పున). అంటే.. దాదాపు 74 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్ బిల్లు పెరిగే ప్రసక్తే లేదు. నెలకు 75 యూనిట్లు దాటిన వారి విషయంలో బిల్లు స్వల్పంగా పెరిగినట్టే ఉన్నా.. గతంలోని పరోక్ష విధానాన్ని విశ్లేషించి చూస్తే వారిలో సగం మందికి కరెంట్ బిల్లులు తగ్గే వీలుంది. ఏ విధంగా అంటే.. 100 యూనిట్ల వరకూ పాత బిల్లు ప్రకారం.. (0–50 వరకూ యూనిట్ రూ.1.45... 51–100 వరకూ యూనిట్‌కు రూ.2.60 చొప్పున) నెలకు రూ.202.50 వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. (0–100 వరకూ యూనిట్ రూ.2.60 చొప్పున) రూ.260 బిల్లు వస్తుంది. అంటే.. రూ. 57.50 పెరిగినట్టు కనిపించినా వాస్తవంలో ఇది తగ్గుతుంది. మారిన శ్లాబ్ ప్రకారం ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే కాబట్టి కరెంట్ బిల్లులు తగ్గుతాయి. నెలకు 101–200 యూనిట్లు వాడే వాళ్లు రాష్ట్రంలో 37.28 లక్షల మంది ఉన్నారు. 201–225 యూనిట్లు వాడేవారు 6.28 లక్షల మంది. వీరి వినియోగం తగ్గితే తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. కాబట్టి పేద వర్గాలపై ఎంతమాత్రం భారం పడలేదు. 500 యూనిట్లపైన వాడేవారు 1.35 లక్షల మంది ఉన్నారు. అధిక సంపన్నులైన వీరికి పెరిగింది కేవలం యూనిట్‌కు రూ.90 పైసలే. గత ఐదేళ్లలో వివిధ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంటు, తదితరాలకు డిస్కమ్‌లు భరించే భారాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వాటికి ఇవ్వాలి. అయితే.. 2015–16లో రూ.3,600 కోట్ల సబ్సిడీకి రూ.3,186 కోట్లు, 2016–17లో రూ.3,951 కోట్లకు రూ.2,923 కోట్లు, 2017–18లో రూ.3,700 కోట్లకు.. రూ.2750 కోట్లు, 2018–19లో రూ.6,030 కోట్లకు రూ.1,250 కోట్లు, 2019–20లో రూ.8,255 కోట్లకు రూ.4,667 కోట్లు మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇతరత్రా పేరుకు పోయి.. అప్పులు చేసిన డిస్కమ్‌లు వడ్డీలకే నెలకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. పరిశ్రమలకు చేయూత.. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాల కోసం నాణ్యమైన బియ్యం ఆడించే రైసు మిల్లులకు వినియోగం లోడ్ పరిమితిని వంద నుంచి 150 హెచ్‌పీకి పెంచాం. అనేక పరిశ్రమలకు లోడ్‌ఫ్యాక్టర్ ఇన్సెంటివ్స్ (ఎక్కువ వినియోగానికి రాయితీలు) కొనసాగిస్తున్నాం. ఫెర్రో అల్లాయిస్‌ను బతికించేందుకు 85 శాతం లోడ్ ఫ్యాక్టర్ నిబంధనల ప్రతిపాదనను పక్కనపెట్టాం. కుటీర పరిశ్రమలపై కెపాసిటర్లు లేవని విద్యుత్ సిబ్బంది వేసే జరిమానాలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యా సంస్థలకు నూతన టారిఫ్ వల్ల భారీ ప్రయోజనం కలుగుతుంది. ఏ లాభాపేక్ష లేని ఈ సంస్థలను వాణిజ్య కేటగిరీలోంచి తీసేశాం. విద్యుత్ సంస్థలను ప్రజలకు చేరువ చేయాలన్న కమిషన్ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ, గతంలో లేని విధంగా గృహ విద్యుత్ వినియోగ సబ్సిడీ రూ.1,707.07 కోట్లు ఇచ్చింది. దీనికి వ్యవసాయ సబ్సిడీ (రూ.8,353.58 కోట్లు) కలిపితే మొత్తం ఇచ్చింది రూ.10,060.63 కోట్లు. -
బకాయిల ‘ఎత్తిపోత’
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కం)కి బకాయిల షాక్. రాష్ట్రంలోని ప్రధాన ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,500 కోట్ల మేర బకాయిలను డిస్కంకు చెల్లించాలి. ఇందులో ఆగస్టు వరకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రూ.3,181.38 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రభుత్వ లక్ష్యం. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్దేశిత ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 357 మోటార్లు ఉండగా, 217 పంపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఏఎమ్మార్పీ కింద రూ.రూ.638 కోట్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలిమి నేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) నుంచి ఏటా 16.50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నా రు. ఒక్క టీఎంసీకి రూ.8 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ మూడేళ్లలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా ఇప్పటివరకు ఒక్క రూపా యి కూడా చెల్లించలేదు. ఈ ప్రాజెక్టుపైనే రూ.638 కోట్ల బకాయిలున్నాయి. ప్రతిసారి విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. అప్పుడప్పుడూ క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తోంది. అయితే, ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వస్థాయిలో మాట్లాడి బయటపడుతున్నారు. ఇతర ప్రాజెక్టులపై... గత ఏడాది నెట్టెంపాడు కింద 6.7 టీఎంసీ, బీమా 12 టీఎంసీ, కోయిల్‌సాగర్ 5 టీఎంసీ, కల్వకుర్తి 31 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. వీటి బిల్లులే రూ.957 కోట్ల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో అన్ని ప్రాజెక్టుల కింద 30 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. దీంతో బకాయిలు రూ.1,650 కోట్లకు చేరాయి. మొత్తంగా మేజర్ ఇరిగేషన్ పథకాల కిందే రూ.3,181 కోట్లు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ పథకాల కింద మరో రూ.123 కోట్ల బకాయిలున్నాయి. వీటికి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఎత్తిపోతలకు అయిన చార్జీలను కలిపితే మొత్తంగా రూ.3,500 కోట్ల మేర బకాయిలున్నట్లు లెక్క తేలుతోంది. -
ప్రయివేటుకు వెలుగులు.. పేదలకు చీకట్లు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అనేక వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రానివ్వకుండా జాగ్రత్తపడింది. అంకెల గారడీతో పరుగుల పురోభివృద్ధి పెట్టించాలనే ప్రయత్నం చేసినట్టు కన్పిస్తోంది. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సమయంలో తమ నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించలేకపోయింది. ఛార్జీల పెంపు రూపంలో జనం నుంచి పిండుకోవడం మాత్రమే తెలిసిన సర్కారు దండుకునే మార్గాన్వేషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు అనుసరించి ఏకంగా రూ. 5,742 కోట్లకుపైబడి ప్రజలపై భారం మోపడాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్‌తో డిస్కమ్‌ల అప్పులన్నీ తీరిపోయినా... విద్యుత్ సంస్థలు మళ్ళీ ఆర్థిక లోటులోకి ఎందుకెళ్లాయో వివరించనే లేదు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా ఏయేటికాయేడు జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ఏ ప్రైవేటు సంస్థల కోసం తగ్గించారో స్పష్టం చేస్తే బాగుండేదేమో! విద్యుత్ వ్యవస్థ విస్తరణ జరిగినట్టు చెబుతున్న ప్రభుత్వం నాలుగేళ్ళుగా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడానికి కారణాలేంటి? అయినవాళ్ళకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులిచ్చి అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం వాస్తవాలకు కడుదూరంలో ఉంది. మిగులు ఓ డ్రామా! రాష్ట్ర విభజన నాటికున్న 22 ఎంయూల విద్యుత్ లోటును అధిగమించి మిగుల్లోకి వెళ్ళామనేది ప్రభుత్వ వాదన. దీన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఈ నాలుగేళ్ళల్లో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,250 మెగావాట్లు పెరిగింది. వైఎస్ హయాంలో ఏర్పాటు చేసిన 1600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు 2016లో వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చింది. ఆర్టీపీపీ నాల్గవ దశ 600 మెగావాట్లు వైఎస్ హయాంలోదే. నాగార్జున టేల్పాండ్ 25 మెగావాట్లు కూడా పాత ప్రభుత్వాల కాలంలో తీసుకొచ్చినవే. ఏపీ జెన్కో పరిధిలో ఒక్క మెగావాట్ ప్లాంట్ కూడా చంద్రబాబు కాలంలో ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ల విద్యుత్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్లు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోకు 4,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచే రోజుకు 84 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే సత్తా ఉంది. జల విద్యుత్ కేంద్రాల నుంచి మరో 24 మిలియన్ యూనిట్లు తీసుకోవచ్చు. రోజుకు మరో 34 మిలియన్ యూనిట్లు కేంద్ర విద్యుత్ వాటాగా రాష్ట్రానికి అందుతుంది. అంతర్రాష్ట్ర జల విద్యుత్ వాటాగా ఇంకో 25 మిలియన్ యూనిట్లు వచ్చే వీలుంది. ఇవన్నీ కలుపుకుంటే రోజుకు 167 మిలియన్ యూనిట్ల వరకూ ఉంటుంది. ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వం ఏపీ జెన్కో ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గిస్తోంది. 2016–17 లెక్కల ప్రకారం కేవలం 10,119 మిలియన్ యూనిట్లు మాత్రమే జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అంటే రోజుకు 84 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే... కేవలం 27 మి.యూనిట్లకు పరిమితం చేశారు. మరోపక్క ప్రైవేటు విద్యుత్‌ను రోజుకు 25 నుంచి 30 మిలియన్ యూనిట్లకు పెంచారు. జెన్కో విద్యుత్ ఉత్పత్తి సగటున రూ. 4 లోపే లభిస్తుంది. ప్రైవేటు విద్యుత్ సగటున రూ. 6 వరకూ ఉంటుంది. కాబట్టే డిస్కమ్‌లు నష్టపోతున్నాయి. 2014–18 మధ్య కాలంలో రాష్ట్రంలో జెన్కో, ప్రైవేటు కలిపి 9,529 మెగావాట్ల నుంచి 19,080 మెగావాట్లకు పెరిగింది. అంటే పెరిగింది 9,551 మెగావాట్లు. ఇందులో జెన్కో సామర్త్యం 2250 మెగావాట్లు పెరిగితే, ప్రైవేటు ఉత్పత్తి సామర్థ్య 7,301 మెగావాట్లు పెరిగింది. ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక ఉద్దేశ్యమేమిటి? జనానికి మోత... కార్పొరేట్లకు చేరవేత! విద్యుత్ పంపిణీ సంస్థలను రుణ విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకాన్ని తీసు కొచ్చింది. అందరికంటే ముందే మన రాష్ట్రం ఇందులో చేరింది. డిస్కమ్‌ల అప్పును 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. ఈ మొత్తాన్ని కేంద్రం అప్పుగా ఇప్పిస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ హామీతో డిస్కమ్‌లు బాండ్లు విడుదల చేశాయి. మొత్తం మీద 2017 నాటికే డిస్కమ్‌లు అప్పుల్లోంచి బయటపడ్డాయి. కానీ 2018 నవం బర్లో ఏపీఈఆర్సీకి సమర్పించిన నివేదికల ప్రకారం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటును పేర్కొన్నాయి. కారణమేంటి? వైఎస్ హయాంలో ఆరేళ్ళ పాటు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరగలేదు? బాబు ప్రభుత్వం వచ్చీ రావడం తోనే ఇలా వేల కోట్ల భారం ఎందుకు వేస్తుంది? ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి. డిస్కమ్‌లు ప్రతీ యూనిట్‌కు రూ. 5.94 చొప్పున వెచ్చిస్తున్నాయి. కానీ వినియోగదారుడికి దీన్ని యూనిట్ రూ. 4.53 చొప్పునే విక్రయిస్తున్నాయి. కాబట్టి యూనిట్‌కు రూ. 1.42 చొప్పున నష్టం వస్తోందనేది పంపిణీ సంస్థల వాదన. ఇలా అమ్మితే ముమ్మాటికీ నష్టమే. కానీ ఇలా అమ్మాల్సిన అవసరం ఏమిటి? బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ రూ. 1.99కే లభిస్తోంటే, పంపిణీ సంస్థలు మాత్రం రూ. 5.94 ఎందుకు ఖర్చుపెడుతున్నాయి? అసలు కథ వేరుగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరో పణలూ ఉన్నాయి. అవసరానికి మించి మాత్రం విద్యుత్ కొనుగోలు చేశారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరిపోతుంది. కానీ ప్రభుత్వం 67,948 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అంటే 10,930 మిలియన్ యూనిట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. దీన్నిబట్టి అవసరం లేని ఈ విద్యుత్‌కు రూ. 6,492 కోట్లు చెల్లిస్తుంది. డిస్కమ్‌లు కొనుగోలు చేసే విద్యుత్‌లో 50 శాతం ప్రైవేటు విద్యుత్తే ఉంటుంది. ఇలా జనం నుంచి దోచుకునే డబ్బంతా ప్రైవేటు జేబుల్లోకి వెళ్తుంది. కాబట్టే పంపిణీ సంస్థ లకు నష్టాలొస్తున్నాయి. ఆ భారాన్ని జనంపై వేస్తున్నారనేది సుస్పష్టం. ఏటా షాక్లే! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్ ఛార్జీలను పెంచింది. 2015–16 సంవత్సరంలో ఏకంగా రూ. 941 కోట్ల భారం విద్యుత్ వినియోగదారులపై వేసింది. మరో రూ. 750 కోట్లు ట్రూ అప్ ఛార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ఈసారి కాస్తా జాగ్రత్తగా వ్యవహరించింది. నేరుగా రూ. 242 కోట్ల మేర ఛార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ. 1,200 కోట్లు దండుకుంది. 2014–15 లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ ఇది. మొదటి 50 యూనిట్లకు రూ. 1.45 (యూనిట్‌కు) చొప్పున చెల్లించే విద్యుత్ వినియోగదారుడు ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాలి. దీనిబట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది. 2017–18 లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది. 1 కేవీ లోడ్ దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే వెయ్యి వాట్స్కు సరిపడా లోడ్ ఉంటే బిల్లు మోతమోగినట్టే. రకరకాల విద్యుత్ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్ దాటని వారు ఎవరుంటారు? నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్య తరగతి వినియోగదారుడి బిల్లు రూ. 150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహి స్తున్న ప్రభుత్వం భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది. సంస్కరణల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా, ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్ళుగా ప్రజాభిప్రాయ సేకరణలో పలు అంశాలు ముందుకొచ్చినా ఏపీఈఆర్సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ము గాస్తోందనే ఆరోపణలున్నాయి. వాస్తవాలు మరుగున పరచిన ప్రభుత్వం అంకెల గారడీతో శ్వేతపత్రం విడుదల చేయడం దురదృష్టకరం. – వనం దుర్గా ప్రసాద్, సాక్షి ప్రతినిధి -
బిల్లు కట్టండి
మెదక్‌జోన్: విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బకాయిలు పడ్డవారు వెంటనే చెల్లించాలని లేనిచో కనెక్షన్లు తొలగిస్తామంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆటోల్లో ఊరూర ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,58,516 నివాస గృహాలకు కనెక్షన్లు ఉండగా ఇందుకు సంబంధించి సుమారు ఏడాదిగా రూ. 18.81 కోట్లు బకాయి ఉంది . అలాగే జిల్లాలో అధికారికంగా 89,312 వ్యవసాయానికి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా రూ. రూ. 13 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. ఇళ్లకు, వ్యవసాయ బోరుబావులకు సంబంధించి మొత్తం జిల్లాలో రూ 31.81 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని ఎలాగైన వసూళ్లు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బకాయిలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో వాటిని చెల్లించాలని గ్రామాల్లో చాటింపును సైతం వేస్తున్నారు. వినియోగదారులు నెలనెల సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే నెలదాటితే ఆ బిల్లుపై అదనంగా రూ. 20 ఫైన్‌వేస్తున్నారు. గతంలో సకాలంలో బిల్లులు కట్టని వినియోగదారులకు అస్సలుకు వడ్డీ, చక్రవడ్డీలను సైతం వేసే వారు ప్రస్తుతం సకాలంలో చెల్లించని వారికి కేవలం రూ. 20 ఫైన్ మాత్రమే వేస్తున్నారు. దీంతో బకాయిలు పడ్డా విద్యుత్‌వినియోగదారులకు ఎంతోలాభం చేకూరుతోంది. వ్యవసాయానికి రోజుకో రూపాయి.. 2004 సంవత్సరం నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించారు. నాటినుంచి నేటివరకు అన్నదాతలను ఆదుకునే బృహత్తర పథకంలో ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. 24 గంటలపాటు వ్యవసాయినికి ఉచిత విద్యుత్‌ను వాడుకున్నా రోజుకొక్క రూపాయిచొప్పున నెలకు రూ. 30 చొప్పున సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 89,312 వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఉండగా నెలకు రూ. 26,79,360 రూపాయలను వినియోగదారులు సంబంధిత ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంటోంది. కాగా ఒక్కోబోరుకు నెలకు రూ. 30 రూలు చెల్లించాల్సి ఉండగా సకాలంలో చెల్లించకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినా ఫైన్‌కింద రూ. 25 చెల్లించాల్సిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించి మొత్తం రూ. 13 కోట్లు బకాయిలు ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు రోజుకో రూపాయి చొప్పున నామమాత్రపు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇళ్లకు మాత్రం వినియోగించినంత చెల్లించాల్సిందే. 0–50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.45 , 51–100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ. 2.60, 100–200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.4.30 చొప్పున చెల్లించాల్సి ఉంటోంది. వ్యవసాయం, ఇళ్లకు సంబంధించిన మొత్తం బకాయిలు రూ. 31.81 కోట్లు ఉంది. వీటిని ఎలాగైనా వసూలు చేయాలనే ఉద్దేశంతో నిత్యం ఊరూర ఆటోల్లో తిరుగుతూ బిల్లులు చెల్లించాలని లేనిచో సర్వీస్ వైర్‌ను తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచితం... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇళ్లకు 0–50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు. 50 యూనిట్లు దాటితే అందరిలాగా బిల్లులు చెల్లించాల్సిందే. కాగా పరిమితి మేరకు మాత్రమే ఉచితంగా ఇస్తుండగా విషయం తెలియని చాలామంది ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా తమకు విద్యుత్ ఉచితంగా వస్తుందంటూ పరిమితి దాటాక సైతం బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్లకు కరెంట్ బిళ్లులు పేరుకపోతునట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని సంబంధిత అధికా>రులు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అర్థమైయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే చెల్లించండి జిల్లాలో విద్యుత్తుశాఖకు బకాయిలు పడిన వినియోగదారులు వెంటనే బిల్లులు చెల్లించండి. వ్యవసాయ పంపు సెట్లు, ఇళ్ల బిళ్లులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.31.81 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. వాటిని వెంటనే చెల్లించాలి. లేచినో సర్వీస్ కనెక్షన్లను తొలగించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించి బిల్లులు వెంటనే చెల్లించాలి. –శ్రీనాథ్, ఈఈ, ట్రాన్స్‌కో మెదక్ -
గుజరాత్లో విద్యుత్ బకాయిల మాఫీ
అహ్మదాబాద్ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరిన కొద్దిగంటలకే రైతు రుణ మాఫీని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం రూ 650 కోట్ల మేర విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు బకాయి పడిన విద్యుత్ బిల్లుల మాఫీపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.22 లక్షల కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారులు పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీతో రూ 650 కోట్ల మేర లబ్ధి పొందుతారని గుజరాత్ విద్యుత్ శాఖ మంత్రి సౌరభ్ పటేల్ తెలిపారు. విద్యుత్ చౌర్యం, బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ కనెక్షన్లను తొలగించామని వీటిలో గృహ, వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పెండింగ్ విద్యుత్ బిల్లుల మాఫీతో ఆయా కనెక్షన్లను పునరుద్ధరిస్తారు. కాగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాల మాఫీ ప్రకటించడం, ప్రధాని మోదీ రైతులకు మేలు చేసేవరకూ విశ్రమించనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రుణ మాఫీ ప్రకటించాలని పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు. -
నారాయణలో నిబంధనలకు పాతర
నగరంలోని నవాబుపేటలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నారు. తన కుమారుడి కుటుంబంతో పాటు ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్ బిల్లు భారీగా వస్తుండటంతో అదనపు విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సరిపడా రుసుమును మీ సేవ ద్వారా చెల్లించారు. ఆ ప్రాంత విద్యుత్ లైన్మెన్కు విషయం తెలపడంతో కొన్ని రోజుల తర్వాత నూతన విద్యుత్ మీటర్‌ను తీసుకొచ్చారు. తీరా ఏర్పాటు చేసే సమయంలో సదరు లైన్మెన్ ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలనే నిబంధన విద్యుత్ శాఖలో ఉందని, ఈ క్రమంలో రెండో మీటర్‌ను ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే నూతన మీటర్‌కు చెల్లించిన నగదు మొత్తాన్ని ఇప్పటికీ ఇంటి యజమానికి ఇవ్వలేదు. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఒక భవన సముదాయానికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలనే నిబంధన సామాన్యులకే తప్ప, మంత్రి స్థాయిలో ఉన్న వారికి వర్తించడంలేదు. నగరంలోని హరనాథపురంలో గల నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. వాస్తవానికి హరనాథపురంలో నారాయణ బాలురు, బాలికలకు సంబంధించి వేర్వేరు ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా ఇదే ప్రాంతంలో నారాయణ భవన్ పేరుతో, నారాయణ మెడికల్ అకాడమీ పేరుతో బాలుర, బాలికల స్కాలర్ మెడికల్ క్యాంపస్‌ను మరో భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే ఒకే భవన సముదాయంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపస్‌కు నాలుగు విద్యుత్ సర్వీసులు కలిగిన మీటర్లు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవన సముదాయానికి నాలుగు విద్యుత్ మీటర్లను విద్యుత్ శాఖ సిబ్బంది ఎలా ఏర్పాటు చేశారో అర్థం కావడంలేదు. నిబంధనల మేరకు విద్యాసంస్థలకు సంబంధించిన భవనాలకు విద్యుత్ సర్వీస్ కేటగిరీ – 2 పరిధి కింద విద్యుత్ సర్వీస్‌ను ఇవ్వాలి. అయితే నిబంధనలకు తిలోదకాలివ్వడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటగిరీ – 2 ప్రకారం ఇదీ లెక్క.. విద్యాసంస్థలకు విద్యుత్ సర్వీస్ ఇచ్చే కేటగిరీ – 2 కింద 0 నుంచి 50 యూనిట్ల వరకు ఒక స్లాబ్‌గా నిర్ణయించి ఒక్కో యూనిట్‌కు రూ.3.60గా లెక్కిస్తారు. 51 యూనిట్ల నుంచి 100 వరకు యూనిట్లకు మరో స్లాబ్‌గా పరిగణించి యూనిట్‌కు రూ.6.60 వంతున, 101 నుంచి 150 యూనిట్లకు మరో స్లాబ్‌గా యూనిట్‌కు రూ.7.70, 150 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.9.90 లెక్కన బిల్లు వేస్తారు. ఈ లెక్కన 50 యూనిట్ల వరకు వాడితే రూ.358, 100 యూనిట్లు వాడితే రూ.950 వరకు, 150 యూనిట్లు వాడితే రూ.1,800 వరకు 200 యూనిట్లు వాడితే రూ.2,500 వరకు నెల వారీ విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన హరనాథపురంలోని నారాయణ మెడికల్ క్యాంపస్‌కు నెలకు వందలాది యూనిట్ల వినియోగమవుతోంది. దీనికి సంబంధించి రూ.లక్షల మొత్తాన్ని నెలవారీ విద్యుత్ బిల్లుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా భారీగా విద్యుత్ బిల్లులను చెల్లించకుండా ఉండేందుకు గానూ నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్ మీటర్లను పొందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థ ఆదాయానికి భారీగా గండి నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు విద్యుత్ సర్వీసులను ఇవ్వడం, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విద్యుత్ శాఖ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రలోభాలకు లొంగి ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా మీటర్ రీడింగ్‌కు వచ్చే సమయంలోనూ ఇలా వ్యవహరిస్తూ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంలేదు. ఈ పరిణామంతో విద్యుత్ సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఒకే కాంపౌండ్లోఒకే సర్వీస్ ఉండాలి ఎలాంటి విద్యాసంస్థలైనా ఒకే కాంపౌండ్‌లో ఉంటే ఒకే విద్యుత్ సర్వీస్ మీటర్‌ను కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వివిధ పేర్లతో సర్వీసులు పొందుతారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు వచ్చినా.. తనిఖీల్లో గుర్తించినా.. ఎక్కువగా ఉన్న మీటర్లను తొలగించి అన్నింటినీ కలిపి ఒకే సర్వీస్‌గా చేస్తాం.: విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఈ -
బడి బిల్లు కట్టేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లు చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసిన నిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ జిల్లాల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులతో చెల్లింపులు జరిపేవారు. ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ), ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా బిల్లులు చెల్లించేది. తాజాగా ఈ బిల్లు చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని పాఠశాల విద్యాశాఖ(డీఎస్ఈ) స్పష్టం చేసింది. ఈమేరకు ఆ శాఖ సం చాలకులు టి.విజయ్‌కుమార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా పెండింగ్ బిల్లుల సమాచారాన్ని సేకరించి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్ఈ నుంచి ఉత్తర్వులు వచ్చి నెలరోజులు గడుస్తున్నా వాటిపై క్షేత్రస్థాయిలో విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్ బకాయిలు రూ.18 కోట్లు రాష్ట్రంలో 26,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నెలకు సగటున రూ.500 వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదుల నిర్వహణతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాల వినియోగాన్ని బట్టి బిల్లుల్లో మార్పులు ఉంటున్నాయి. దీంతో సగటున ఒక ఉన్నత పాఠశాలలో నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు విద్యుత్ బిల్లులు నమోదవుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో దాదాపు ఆర్నెల్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.18 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల 13 జిల్లాలకు రూ.1.04 కోట్లు చొప్పున విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.40 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.64 లక్షలు విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలల వారీగా బకాయిల వివరాలు తెప్పించుకుని ఆమేరకు చెల్లించాలని డీఎస్ఈ ఆదేశించింది. కానీ, ఆ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి స్పష్టమైన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించలేదు. దీంతో డీఎస్ఈ విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల్లోనే మగ్గిపోయాయి. మరోవైపు ఆర్నెల్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. -
పైసలుంటేనే పవర్!
నల్లగొండ : పైసలుంటేనే పవర్. లేదంటే చీమ్మ చీకట్లే. ఇకనుంచి విద్యుత్‌శాఖ కొత్త విధానాలను అవలంబించబోతుంది. నెలంతా విద్యుత్ సరఫరా చేసిన తదుపరే వినియోగదారులు వాడుకున్న దానికి సంబంధించి బిల్లు వసూలు చేస్తుండేవారు. కానీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ముందు పైసలు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తారు. లేదంటే చీకట్లో ఉండాల్సిందే. అందులో భాగంగానే మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో మొదటినుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపులో ఆయా శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పెడితే బకాయిల భారం నుంచి తప్పించుకోవచ్చని భావించి వెంటనే బిగించాలని నిర్ణయించింది. మొదటి విడతగా కొన్ని మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల్లో మీటర్లు బిగిస్తున్నారు. అతి ఎక్కువగా బకాయిలు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.18,419.03 లక్షలు బకాయి పడ్డాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు జిల్లా వ్యాప్తంగా 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సంబంధించి రూ.192.48 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో మొదటి విడత పూర్తి కావస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం అలస్యమవుతోంది. విద్యుత్ చౌర్యానికి చెక్.. కొందరు వినియోగదారులు మీటర్లో వైర్లు పెట్టి విద్యుత్‌చౌర్యానికి పాల్పడుతున్నారు. దాంతో దొడ్డి దారిన విద్యుత్ వాడుకొని బిల్లు తప్పించుకుంటున్నారు. అ«ధికారులు మాత్రం డిమాండ్‌కు తగట్లుగా బిల్లులు వసూలు చేస్తున్నారు కానీ, అది ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే అదనంగా భారం పడే అవకాశం ఉంది. దానిని అరికట్టేం దుకు ప్రీపెయిడ్ మీటర్లు ఎంతగానో దోహదపడుతాయి. గతంలో ముందుగా కరెంటు వాడుకొని నెల తర్వాత మీటర్లలో తిరిగిన యూనిట్ల ఆధారంగా బిల్లును వసూలు చేస్తూ వస్తున్నారు. ఇక నుం చి ప్రీపెయిడ్ మీటర్లతో ముందే నెలకు సరిపడా విద్యుత్‌ను డబ్బులు పెట్టి కొనుకోవాల్సి ఉంది. బకాయిలు బాధలు ఉండవు.. విద్యుత్ అధికారులకు కూడా బకాయిల వసూళ్ల బాధలు కూడా ఉండవు. ముందే ప్రీపెయిడ్ మీటర్లలో చిప్ కొనుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో తర్వాత బిల్లు వసూలు అనే పని అధికారులకు ఉండదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ముందస్తుగానే వారు వినియోగించే విద్యుత్ కొనుగోలు చేసుకోనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పలే... కొన్ని ప్రభుత్వ శాఖలకు నిధులే ఉండవు. విద్యుత్ బిల్లులు సంవత్సరాల తరబడి చెల్లించని శాఖలు కూడా ఉన్నాయి. అలాంటి శాఖలకు ప్రీపెయిడ్ మీటర్లతో తిప్పలు తప్పవు. కచ్చితంగా ఆయా శా ఖాధికారులు ముందస్తుగానే విద్యుత్‌కు సంబం ధించి బిల్లులు అనుమతి కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రానుంది. వద్దంటున్న కొన్ని శాఖల అధికారులు... కొన్ని ముఖ్యమైన అత్యావసరమైన ప్రభుత్వ శాఖల అధికారులు ప్రీపెయిడ్ మీటర్లను బిగిం చొద్దంటూ విద్యుత్ సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో ఆ కార్యాలయాలకు మీటర్లు బిగించలేకపోతున్నారు. అత్యవసరమైన శాఖలు కావడంతో విద్యుత్ అధికారులు కూడా వారి విషయంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కార్యాలయాల తర్వాత గృహాలకు.. ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి విడతగా ప్రీపెయిడ్ మీటర్లను వినియోగిస్తున్నారు. అ తదుపరి అందులోనే లోటుపాట్లను సరి చేసుకొని గృహాలకు కూడా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటి విడత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్మీటర్లను బిగిస్తున్నట్లు జిల్లా టాన్స్‌కో ఎస్ఇ కృష్ణయ్య తెలిపారు. మొదటి విడతగా 963 మీటర్లు.. మొదటి విడతగా జిల్లాలో 963 మీటర్లను మంజూరు చేశారు. నెల పదిహేను రోజులనుంచి ఇప్పటి వరకు 483 మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు. కార్యక్రమం కొంత ఆలస్యమే అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.192.48 కోట్లు వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ సంక్షేమ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ శాఖ, పౌర సరఫరాల తదితర రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని శాఖలకు సంబంధించి విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. -
పంచాయతీలకు ‘విద్యుత్’ షాక్..!
ఓపైపు నిధుల లేమి, మరోవైపు ఖర్చుల భారంతో విలవిలలాడుతున్న పంచాయతీలపై విద్యుత్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్ల కరెంట్ బిల్లులను చెల్లించాలంటూ ట్రాన్స్–కో అధికారులు పంచాయతీలకు నోటీసులు పంపిస్తున్నారు. 2006 నుంచి విద్యుత్ బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మదనపల్లె రూరల్: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 66 మండలాలు, 1363 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ: 7.50 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీడీఓలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. పంచాయతీలు బిల్లులు చెల్లించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో కనీసం అందులోంచి తమ బకాయిలను రాబట్టేందుకు ఆశాఖ అధికారులు నడుం బిగించారు. గ్రామ తాగునీటి అవసరాలు తీర్చే విద్యుత్ మోటార్ల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీధిలైట్లు, నీటి పథకాల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీ శాఖ అధికారులకు, సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశారు. బకాయి వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ డివిజన్లో విద్యుత్ బకా యిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల శాఖా« దికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో వ్వవహరించి పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.–భాస్కర్‌నాయుడు, ట్రాన్స్‌కో డీఈ, మదనపల్లె -
అవినీతి చీకట్లో విద్యుత్ రంగం
-
లక్ష్యానికి తూట్లు !
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలోని పంచాయతీల్లో విద్యుత్తు బిల్లులను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వీధిలైట్లకు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్పార్ జిల్లాలో 790 గ్రామ పంచాయతీలకు గాను 322 గ్రామ పంచాయతీల్లో 61,100 ఎల్ఈడీ బల్పులను జూన్ 2నాటికి ఏర్పాటు చేశారు. కానీ ఏ లక్ష్యంతోనైతే వాటిని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేడరం లేదు. అధికారుల నిర్లక్ష్యమో లేక కిందిస్థాయి సిబ్బంది అలసత్వమో తెలియదు కానీ లక్ష్యానికి మాత్రం తూట్లు పొడుస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్ర మే వెలగాల్సిన ఎల్ఈడీ బల్బులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ బిల్లులు గతంలో మాదిరే వచ్చే అవకాశం ఉంది. విద్యుత్తు బిల్లులు తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదైనా కిందిస్థాయిలో అమలు చేసే వారి నిర్లక్ష్యం వల్ల సంబంధిత పథకం పలు విమర్శలకు తావిస్తోంది. ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసే వారు వాటికి ఆన్ఆఫ్ చేసే కంట్రోల్‌కు సంబంధించిన ప్రత్యేక లైన్‌ను (తాడు వయర్) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అవి ఏర్పాటు చేయనట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో పగలు వెలగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారి వెంబడి: కడప కర్నూల్ జాతీయ రహదారిలో చెన్నూరు దాటాక ఖాజీపేట మండల పరిధిలో జాతీయరహదారి వెంబడి ఉన్న పలు గ్రామాల్లో ఎల్ఈడీ బల్పులు నిత్యం వెలుగుతూ కనిపిస్తున్నాయి. కొత్తనెల్లూరు, సంజీవనగరం, కూనవారిపల్లె తదితర గ్రామాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఈ విషయంలో అధికారులు స్పందించాల్సి న అవసరం ఉంది. లేకపోతే ఏలక్ష్యంతోనైతే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నీరుగారిపోయే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మోహన్‌రావ్‌ను వివరణ కోరగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్పులు నిరంతరం వెలుగుతున్న ట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అయినా దీనిపై పరి శీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. 24 గంటలు వెలుగులే మాగ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి బల్పులు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నా యి. ఆన్‌ఆప్ చేద్దామంటే ఎక్కడ స్విచ్‌లుకానీ ఆన్ఆఫ్ కంట్రోల్ కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి.– పెద్దరామయ్య, సర్పంచ్, చక్రాయపేట -
‘సర్వీస్’ పేరుతో దోపిడీ
చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రతీది ప్రైవేట్‌పరం చేసి సర్వీస్ చార్జీల పేరుతో వినియోగదారులను దోచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెబుతూనే పలురకాల చార్జీలు వేస్తోంది. తాజాగా ప్రభుత్వ కన్ను ఏటీపీ కేంద్రాలపై పడింది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా పలు సబ్స్టేషన్లలో వసూలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే మీ–సేవ కేంద్రాల్లో కూడా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించి ప్రతి బిల్లుపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ‘విద్యుత్ బిల్లుల నిరంతర చెల్లింపు కేంద్రం’ (ఏటీపీ)ను ఆ శాఖ నెల్లూరు నగరంలోని మినీబైపాస్రోడ్టులోని మిలీనియం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద, ఏకేనగర్‌లోని విద్యుత్‌భవన్ వద్ద, చిన్నబజారులోని చేపల మార్కెట్ వద్ద ఏర్పాటుచేశారు. దీంతో వేలాది మంది వినియోగదారులు ఏ సమయంలోనైనా బిల్లులు చెల్లిస్తూ కేంద్రాలకు అలవాటుపడ్డారు. మరో రెండు ఈ క్రమంలో గూడూరులో ఒకటి. నెల్లూరులో ఒకటి కేంద్రాలు మంజూరయ్యాయి. నగరంలో ఉన్న మూడు కేంద్రాల ద్వారానే నెలకు 30 వేలమంది వినియోగదారులు రూ.2 కోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు వీటిలో బిల్లులు చెల్లించినందుకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. వారికి ఇచ్చేశారు ఈ ఏటీపీ కేంద్రాలను ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ నిర్వహిస్తుండేది. ఈనెల నుంచి కేంద్రాలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంస్థకు అప్పగించి సర్వీస్ చార్జీ పేరుతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయనున్నారు. సదరు సంస్థ కేంద్రం పనివేళలు మార్చివేసింది. అవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేయనున్నాయి. విద్యుత్ బిల్లు రూ.1–200 వరకు సర్వీస్ చార్జీ రూ.2, రూ.201–1,000 వరకు రూ.5, రూ.1,001–2,500 వరకు రూ.10, రూ.2,500పైగా బిల్లుకు రూ.25 చెల్లించాలి. మరొకటి విద్యుత్ వినియోగదారుడికి వచ్చే బిల్లులోనే సర్‌చార్జి పేరుతో విద్యుత్ సంస్థ రూ.30–50 వరకు వసూలు చేస్తుంటుంది. గత నెల రూ.2,500పైగా బిల్లును ఏటీపీ ద్వారా చెల్లించిన వినియోగదారులు 6,870 మంది ఉన్నారు. అంతే మంది ఈనెల కూడా చెల్లిస్తే వారిపై రూ.25 సర్వీస్ చార్జీ పడనుంది. మొత్తంగా రూ.1,71,750 అదనంగా కడతారు. నెలకు రూ.1,000 వరకు బిల్లు చెల్లించే వారు 30,000 మంది ఉన్నారు. వీరి ద్వారా ప్రైవేట్ సంస్థకు రూ.1,50,000 వస్తుంది. మొత్తంగా కేంద్రాల ద్వారా సంస్థకు సర్వీస్ చార్జీ రూపంలో రూ.7.50 లక్షలు వినియోగదారులు అదనంగా చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
‘కృష్ణా’ జలాలకు బకాయిల షాక్!
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కృష్ణా జలాలకు కరెంట్ షాక్ కొడుతోంది. తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న జలమండలి, నీటిని ఎత్తిపోస్తున్న మోటార్లకు అయ్యే కరెంట్ చార్జీలను చెల్లించకుండా చేతులెత్తేస్తోంది. సాగర్ నుంచి పుట్టంగండి ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడినుంచి గ్రావిటీ కాల్వల ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తంగా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా ఇందులో 525 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నారు. నీటిని ఎత్తి పోసేందుకు నెలకు కనిష్టం గా రూ.10 కోట్ల మేర విద్యుత్ బిల్లులు వస్తు న్నాయి. ఏటా రూ.120 కోట్ల మేర విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. పదేళ్లుగా వచ్చిన మొత్తం బిల్లు రూ.1,272 కోట్ల మేర ఉండగా ఇందులో తాగునీటి బిల్లు రూ.573 కోట్లు మేర హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులపై... బిల్లు బకాయిలపై నీటి పారుదల శాఖ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఆ శాఖే ట్రాన్స్‌కోకు బిల్లులు చెల్లిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే అక్కంపల్లి పరిధిలోని శాఖ కార్యాలయాలకు, సిబ్బంది క్వార్టర్లకు కరెంట్‌కట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో అధికారులు ప్రభుత్వ సీఎస్ జోషి తో సమావేశం నిర్వహించారు. బిల్లుల చెల్లింపునకు జలమండలి అధికారులు ఓకే చెప్పినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. దీంతో మళ్లీ రెండ్రోజుల క్రితం ఇరిగేషన్ కార్యాలయాలు, క్వార్టర్లకు ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేసింది. -
రీచార్జ్ చేసుకుంటేనే..
కొత్తకోట: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని కనెక్షన్ తొలగించాల్సిన పని లేదు. బిల్లులు కట్టండని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీచేసే పరిస్థితి ఉండదు. సెల్‌ఫోన్ రిచార్జీ మాదిరిగానే విద్యుత్ బిల్లు రీచార్జ్ చేసుకునే నూతన విధానానికి ట్రాన్స్‌కో అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను ముక్కుపిండి వసూలు చేసేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల్లో అమలుకు యోచిస్తున్నారు. బకాయిల వసూలుకు శ్రీకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఎక్కువగా పేరుకుపోయాయి. ముఖ్యంగా పంచాయతీకార్యాలయాలు, వీధిలైట్లు, కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్ తదితర కార్యాలయాల బకాయిలు బండగా మారాయి. 1,331 పంచాయతీలు, 3,256 నివాస ప్రాంతాల్లో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో విద్యుత్ అధికారులు ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు. వీటిని ఎలాగైనా వసూలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొంత మేలు.. కొంత నష్టం ఈ విధానం వస్తే కొంత మేలు జరిగినా అనేక అనార్థాలు వచ్చే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే బిల్లుల కోసం వచ్చే అధికారులతో విద్యుత్ వినియోగదారులు మొరపెట్టుకునేవారు. ఇక అధికారులే రాకపోతే సమస్యలు విన్నవించే అవకాశం ఉండదు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలు రీచార్జీ విధానం ద్వారా చీకటి రాత్రులతో కాలం గడిపే పరిస్థితులు వస్తాయి. రీచార్జీ అయిపోయిన నిమిషంలోనే కరెంట్ పోతుంది. ఒకవేళ రాత్రి పూట రీచార్జీ అయిపోతే కరెంట్ ఉండదు. అక్ష్యరాస్యత తక్కువగా ఉన్న పాలమూరు జిల్లాలో ఈ విధానం అత్యంత లోపబూయిష్టంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 10లక్షల కుటుంబాలు విద్యుత్‌ను వాడుకుంటున్నాయి. ఇందులో లక్షన్నరకు పైగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. వీరంతా ఒక బల్బు వేసుకుని సబ్సిడీ పొందుతున్నారు. రీచార్జీ విధానం వీరికి కష్టాలు తెచ్చిపెట్టనుంది. వ్యవసాయపై ప్రభావం ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల బోరుబావులు ఉన్నాయి. చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 400 పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా ప్రాజెక్టులు, కోళ్లఫారాలు ఇలా అనేక రంగాలు కరెంట్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. రీచార్జీ కార్డులైతే ఇక స్వీచ్ వేయాలంటేనే చేతులు వణికిపోయే అవకాశం ఉంది. కొత్త పద్ధతులను ఆహ్వానించాలో లేక తిరస్కరించాలో అర్థం కాక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విద్యుత్‌రంగంలో మార్పులు లాభం నష్టమే తెచ్చిపెడతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొదటగా ప్రభుత్వ కార్యాలయాల్లో.. త్వరలోనే ప్రభుత్వం రీచార్జీ మీటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విజయవంతమైతే నివాస ఇళ్లు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య కంపెనీలకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. – రామకృష్ణ, విద్యుత్ ఏఈ, కొత్తకోట -
చీకట్లో పల్లెలు
పల్లెల్లో అంధకారం అలుముకుంది. వీధులన్నీ చీకట్లో మగ్గుతున్నాయి.బకాయిలు రాబట్టుకోవడం కోసం విద్యుత్ శాఖ జూలు విదిల్చింది.వీధి లైట్లు, పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. జిల్లా వ్యాప్తంగా 906 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 205 పంచాయతీల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు. అంటే శివారు గ్రామాలతో కలిపి సుమారు 300 గ్రామాలకు పైగా రాత్రిళ్లు అంధకారంలోకి వెళుతున్నాయి. కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించారు. తాగునీటి సరఫరా సర్వీసులకు బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముక్కుపిండి బకాయిలు వసూలు చేస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు రాబట్టు కోవడం కోసం కరెంటు సరఫరాను నిలిపివేస్తూ పల్లెలను చీకట్లోకి నెట్టింది. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికార్ల నుంచి కింది స్థాయి అధికారులకు బకాయిల వసూలుపై స్పష్టమైన ఆదేశాలందాయి. మార్చిలోపు నిర్దేశించిన మేరకు బకాయిలన్నీ వసూలు చేయాలని ఉన్నతాధికార్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఉద్యోగులు కార్యాచరణలోకి దిగారు. బకాయిలున్న పంచాయతీలకు కరెంట్ కట్ చేస్తున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన ఉన్న సమయంలో జనం నిలదీస్తారన్న భయంతో కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఏకంగా 66 పంచాయతీల్లో విద్యుత్ కట్ చేశారు. గోపాలపురంలో 18, దేవరపల్లిలో 15, నల్లజర్లలో 23 పంచాయతీలలో కరెంటు సరఫరా ఆపివేశారు. విద్యుత్ శాఖ డివిజన్ల వారీగా భీమవరంలో 40, ఏలూరులో 34, తాడేపల్లిగూడెంలో 31, నిడదవోలులో 77, జంగారెడ్డిగూడెంలో 23 పంచాయతీలకు సరఫరా నిలిపివేశారు. కొంత మొత్తం చెల్లించిన వాటికి మళ్లీ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ట్రెజరీల్లో ఆంక్షల కారణంగా చెల్లింపులకు సైతం వీలు కానీ పరిస్థితి ఉంది. రూ.225 కోట్ల విద్యుత్ బకాయిల జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.225 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల్లో వీధిలైట్లకు రూ.26.8 కోట్లు, తాగునీటి సరఫరా సర్వీసుల నుంచి రూ.74.28 కోట్లు బకాయిలున్నాయి. మైనర్ పంచాయతీలలో వీధిలైట్లకి రూ.29.15 కోట్లు, వాటర్ వర్క్స్‌కి రూ.95.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో గత నెలలో రూ.2.16 కోట్లు వసూలు చేశారు. ఈ నెల ఇప్పటి వరకు రూ.12 లక్షలు వసూలైంది. ఇంకా సుమారు రూ.225 కోట్ల మేరకు బకాయిలు పేరుకు పోయాయి. ప్రధానంగా పాత బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉండడంతో రోజు రోజుకి ఈ బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉండడంతో తాగునీటి సర్వీసులకు బిల్లుల చెల్లింపు భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు వాపోతున్నారు. బకాయిల్లో సింహభాగం రూ.169.76 కోట్లు తాగునీటి సరఫరా సర్వీసులకు చెందినవే ఉన్నాయి. కరెంటు సరఫరా నిలిపివేయడం సరికాదు పంచాయతీ వీధిలైట్లకు విద్యుత్ సరఫరా తొలగించడం సమజసం కాదు. పాత బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లింపు గుదిబండగా మారింది. ఉన్న వీధిలైట్లు తొలగించి ఎల్ఈడీ లైట్లు అమర్చమన్నారు. ఇప్పుడు నెలకి ఒక్కో లైటుకి రూ.50లు చొప్పున వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కట్ చేసుకుని పంపుతున్నారు. – ముదునూరి జ్జానేశ్వరి, సర్పంచి, దొమ్మేరు మైనర్ పంచాయతీలకు వెసులుబాటు ఇవ్వాలి మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. అసలే ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారులు బిల్లులు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మూడు రోజులుగా సరఫరా నిలిపివేశారు. పంచాయతీలో ఉన్న మూడు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దివంగత నేత వైఎస్సార్ ఇచ్చినట్టు మైనర్ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కొండేపూడి రమేష్, సర్పంచి, పోచవరం, తాళ్లపూడి మండలం -
గొంతెండుతున్న పల్లెలు!
అటు అధికారులు.. ఇటు ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. వేలకు వేల విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ అధికారుల ఆదేశంతో సిబ్బంది తాగునీటి పథకాలకు విద్యుత్‌ను నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక వచ్చిందే అరకొర నిధులతో విద్యుత్ బిల్లులు చెల్లిస్తే గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. జూపాడుబంగ్లా: నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడ్తూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల్లో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జూపాడుబంగ్లా మండలంలోని 12 పంచాయతీల్లో రూ.3.29కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవటంతో వాటిని చెల్లించాలని కొంత కాలంగా విద్యుత్‌శాఖ అధికారులు సర్పంచ్‌లను కోరారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పి.లింగాపురం మినహా 11 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు రూ.10.80 లక్షలు చెల్లించారు. గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావటంతో వాటిల్లోంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్‌శాఖ అధికారులు సర్పంచ్‌లను కోరుతూ వస్తున్నా.. ఇదివరకే రెండు పర్యాయాలు చెల్లించామని, వచ్చిన కాస్త నిధులను కూడా విద్యుత్ బిల్లులకు చెల్లిస్తే గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల విద్యుత్బకాయిలు వసూలు చేయకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఆ శాఖ సిబ్బంది చేసేదేమీ లేక బకాయిలు చెల్లించని గ్రామపంచాయతీల్లోని తాగునీటి పథకాలకు సరఫరాను వారం క్రితం నిలిపేశారు. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మండలంలో రూ.3.29కోట్ల బకాయిలు మండలంలోని పారుమంచాల గ్రామంలో రూ.22,99,781లు,తూడిచెర్ల రూ.27,93,431 లు, భాస్కరాపురం రూ.7,75,465లు, మండ్లెం రూ.28,61,511లు, తంగడంచ రూ.19,24, 493లు, తాటిపాడు రూ.23,03,679లు, తర్తూరు రూ.23,00,049, పోతులపాడు రూ.11,15,325, తరిగోపుల రూ.28,04,711 లు, 80బన్నూరు రూ.2181,446లు,పి.లింగాపురం రూ.5,89,153 లు, జూపాడుబంగ్లా రూ.1,10,55,518లు, చొప్పున విద్యుత్ బకాయిలు ఉన్నాయి. చెల్లించింది రూ.10.82లక్షలు మాత్రమే సర్పంచ్‌లు ఇప్పటిదాకా రెండు విడతల్లో కేవలం రూ.10,82,000ల విద్యుత్ బకాయిలను మాత్రమే చెల్లించారు. వీరిలో తంగడంచ, జూపాడుబంగ్లా, మండ్లెం గ్రామాల సర్పంచ్‌లు విద్యుత్‌బకాయిలను చెల్లించటంతో ఆయా గ్రామాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయలేదు. పి.లింగాపురం గ్రామ సర్పంచ్ ఇప్పటిదాకా పైసా విద్యుత్ బకాయిని చెల్లించలేదని ఈఓపీఆర్డీ మహమ్మద్‌హనీఫ్ తెలిపారు. పంచాయతీ నిధులన్నీ పక్కదారి గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా వాటిని జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సర్పంచ్ల ప్రమేయం లేకుండానే కంప్యూటర్లు, డస్ట్ బిన్లు, ట్రైసైకిళ్లు, పంచాయతీ కార్యదర్శులకు సెల్ఫోన్ల కొనుగోలుకు వెచ్చించారు. వాటన్నింటికి నిధులు పోనూ మిగిలినవి గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, రహదారుల నిర్మాణానికి వెచ్చించారు. ప్రస్తుతం వాటిల్లోంచి విద్యుత్‌బిల్లులు చెల్లించేందుకు సరిపడా నిధుల్లేవని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెండేళ్లలో రూ 5000 కోట్ల ఆదా
సాక్షి,న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ఏప్రిల్ 2015 నుంచి అక్టోబర్ 2017 వరకూ విద్యుత్ బిల్లుల్లో రూ 5636 కోట్లు ఆదా చేసినట్టు వెల్లడించాయి.రానున్న పదేళ్లలో మొత్తం రూ 41,000 కోట్లు ఆదా చేస్తామని అంచనా వేశాయి. ఓపెన్ యాక్సెస్ ఏర్పాట్ల ద్వారా భారీగా విద్యుత్ బిల్లుల్లో ఆదా చేసినట్టు తెలిపాయి. ఎలక్ట్రిసిటీ చట్టం, 2013 ప్రకారం ఓపెన్ యాక్సెస్ విధానం కింద ఒక మెగావాట్ కన్నా ఎక్కువ విద్యుత్‌ను ఉపయోగించే వినియోగదారులు నేరుగా మార్కెట్ నుంచి విద్యుత్‌ను సమీకరించుకునే వెసులుబాటు ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్,జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏరియాల్లో ఓపెన్ యాక్సెస్ రూట్ ద్వారా రైల్వేలు తమకు అవసరమైన విద్యుత్‌ను సమీకరిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఓపెన్ యాక్సెస్ రూట్లో విద్యుత్‌ను అందించేందుకు బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానం ద్వారా రాబోయే పదేళ్లలో రూ 41,000 కోట్ల మేరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయని వెల్లడించాయి. ఈ మొత్తాన్ని మిషన్ ఎలక్ర్టిఫికేషన్ కింద రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణకు వెచ్చిస్తామని రైల్వేలు తెలిపాయి. -
పల్లెలకు బిల్లుల షాక్
జిల్లాలోని పలు పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నాయి. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా నెలవారీ విద్యుత్తు బిల్లుల చెల్లింపులు కష్టమవుతున్నాయి. నెలనెలా పెరుగుతున్న బిల్లులు గుదిబండగా మారి ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీల పాలకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని, లేదంటే నిలిపేస్తామని సంబంధిత శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు పంచాయతీలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ఆయా పల్లెల్లో చీకట్లు అలముకున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 1043 గ్రామ పంచా యతీలు విద్యుత్ సరఫరాను పొందుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలకు చెందిన సర్ఫేస్ బోర్లకు సంబం ధించి 12 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 11,210 వీధిలైట్ల కనెక్షన్లు ఉన్నాయి. వీటి విద్యుత్తు బిల్లుల రూపేణా నెలకు రూ.7.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఒక్కో పంచాయతీ నెలకు రూ. 15 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల దాకా బిల్లులు చెల్లించాలి. అయితే పంచాయతీల్లో ని«ధులు లేవు. సరైన ఆదాయ వనరుల్లేని కారణంగా ఇవి నెలవారీ విద్యుత్తు బిల్లులను చెల్లించడంలో వెనుకబడుతున్నాయి. దీంతో 2010నుంచి ఇప్పటివరకూ పంచాయతీలు చెల్లించాల్సి న విద్యుత్తు బకాయిలు రూ.220 కోట్లకు చేరాయి. నోటీసుల మీద నోటీసులు... జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 విద్యుత్తు డివిజన్లలోనూ అన్ని కేటగిరీలకు చెందిన 20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నా యి. రోజుకు 4 లక్షల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరా జరుగుతున్నా బిల్లులు మాత్రం సకాలంలో అందడం లేదని ఎస్పీడీసీఎల్ మండిపడుతోంది. పంచాయతీల బిల్లుల చెల్లింపులో రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుం డటంతో ఎస్పీడీసీఎల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిం ది. దీంతో బిల్లులు చెల్లించాలని సంబంధిత ఏడీఈలు నెలనెలా జిల్లా పంచాయతీ అధికారికి, గ్రామ సర్పంచులకు, విలేజ్ సెక్రెటరీలకు నోటీసులు జారీ చేస్తోంది. ఏప్రిల్ నుంచి కూడా చెల్లింపులు నిల్.. పాత బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటన చేసింది. ఏప్రిల్ 2017 వరకూ ఉన్న బకాయిలను పంచాయతీలు చెల్లించాల్సిన పనిలేదని, ఆ తరువాత చెల్లింపులు మాత్రం జరుపుకోవాలని సూచిం చింది. ఈ లెక్కన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ పంచా యతీలు రూ.52 కోట్ల దాకా చెల్లించాలి. కనీసం వీటినన్నా కట్టాలని విద్యుత్తు అధికారులు పట్టుబడుతున్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చూపే పంచాయతీలకు సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. అప్పటికీ స్పందించని 40 పంచాయతీల్లో విద్యుత్తు సరఫరాను మూడు నెలల కిందట నిలిపేశారు. దీంతో సంబంధిత సర్పంచులు విద్యుత్తు కార్యాలయాలకు వెళ్లి లిఖితపూర్వకంగా లెటర్లు ఇచ్చారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ పడగానే చెల్లిస్తామని చెప్పారు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు తిరిగి సరఫరాను పునరుద్ధరించారు. అడ్వాన్సు చెక్కులిస్తే సరి.. పంచాయతీలకు త్వరలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు జమయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఎక్కువ మొత్తం బకాయిలు చెల్లించాల్సిన సర్పంచులు అడ్వాన్సు చెక్కులు అందజేస్తే బాగుంటుందని చెబుతున్నాం. కనీసం మూడు నెలలకు ఇవ్వాల్సిన మేర బిల్లులైనా చెక్కుల రూపంలో అందజేయాల్సి ఉంది. అప్పుడే విద్యుత్తు సరఫరా నిరాటంకంగా చేయగలం. గ్రామ సర్పంచులు బిల్లుల చెల్లింపులో సహకరించాలి. – హరినాథరావు, ఎస్ఈ,ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి సర్కిల్ -
జిల్లాలో రూ.195 కోట్ల విద్యుత్ బకాయిలు
నాయుడుపేటటౌన్: నెల్లూరు జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.195 కోట్లకు పైగా పేరుకుపోయాయని, వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జోన్ ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ సూచించారు. నాయుడుపేట విద్యుత్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆయన ఏడీఏలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో మండలాల వారిగా విద్యుత్ బకాయిలు, వినియోగదారుల సమస్యలు, మీటర్ రీడింగ్ విషయాలపై నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు అధికారులపై విరుచుకుపడ్డారు. సాయంత్రం డివిజన్ పరిధిలోని పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విద్యుత్ సమస్యలపై చర్చించారు. అనంతరం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి రేంజ్ పరిధిలోని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, రివ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా విద్యుత్‌ను వినియోగించిన వారిపై దాడులు నిర్వహించి, వారికి విధించిన అపరాధరుసుము పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని, ఒక్క నాయుడుపేటలోనే ఇందుకు సంబంధించి రూ.25 లక్షల బకాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిపై వారం రోజుల లోపు నోటీసులు జారీ చేసి, నగదు వసూలయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయ్‌కుమార్‌రెడ్డి, డీఈ ఆదిశేషయ్య, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి ఏడీఏఈలు ప్రభాకర్, విజయకుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, 12మండలాలకు చెందిన ఏఈలు, విద్యుత్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రైతులకు నిరాటంకంగా విద్యుత్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని రైతులకు నిరాటంకంగా 7 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ కె.విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని దర్గామిట్ట విద్యుత్‌భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 246 సబ్స్టేషన్ల ద్వారా 558 అగ్రికల్చర్ ఫీడర్లతో విద్యుత్‌ను అందిస్తున్నామని, ఈ ఏడాది 5,668 అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇంకా 7,220 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వాదేశాలతో వాటికి కూడా త్వరలో కనెక్షన్లు ఇవ్వనున్నామన్నారు. అలాగే వినియోగదారులు 46 రకాల విద్యుత్ సేవల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే 9440811749 నంబరుకు ఫోన్ చేసి, ఫిర్యాదు చెయ్యొచ్చని వివరించారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురైతే నగరంలో 12 గంటలలోపు, రూరల్‌లో 24 గంటలలోపు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ఫిర్యాదులు చేయాలనుకుంటే 1912 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. -
విద్యుత్ బిల్లుల భారం.. రూ.2000కోట్లు
-
విద్యుత్ బిల్లుల భారం.. రూ.2000కోట్లు
- గృహ వినియోగదారులకు మినహాయింపు - పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పడనున్న భారం - పెంపు ప్రతిపాదనలను ధ్రువీకరించిన ప్రభుత్వ వర్గాలు - చార్జీలు ఏప్రిల్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం - 6,857 కోట్లు డిస్కంల ఆదాయ లోటు అంచనా - 4,500 కోట్లకు పైగా ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ - మిగతా మొత్తం వినియోగదారులపైనే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర భారం పడబోతోంది. 7 నుంచి 8 శాతం దాకా చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచే ఈ పెంపు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే గృహ వినియోగదారులను ఈ విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. నివాస కేటగిరీ వినియోగదారులపై చార్జీల భారానికి సీఎం కేసీఆర్ అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పెంపు భారం పడనుంది. సబ్సిడీ పెంచితే తగ్గనున్న భారం 2017–18కుగాను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) వార్షిక ఆదాయ అవసరాల అంచనా రూ.31,930 కోట్లు కాగా.. ప్రస్తుత చార్జీలతో రూ.6,857 కోట్ల లోటును ఎదుర్కోనున్నాయి. ఈ లోటును అధిగమించేందుకు డిస్కంల ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి.. ప్రభుత్వం డిస్కంలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పెంచడం. రెండు.. విద్యుత్ చార్జీల పెంపు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.4,500 కోట్ల వరకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయగా.. 2017–18లో రూ.4,500 కోట్లకు పైనే ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో మిగతా లోటును అధిగమించేందుకు అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర చార్జీల పెంపును ప్రతిపాదించనున్నామని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చార్జీల పెంపు వినియోగదారులకు భారంగా మారకుండా ఉండేందుకు సబ్సిడీ పెంచాలని డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 6 నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీని రూ.4,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు పెంచాలని కోరాయి. అయితే ఈ విజ్ఞప్తిని ఆర్థిక శాఖ తోసిపుచ్చినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీని రూ.5 వేల కోట్లకు మించి కేటాయించలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచే పెంపు... నిబంధనల ప్రకారం డిస్కంలు ఏటా నవంబర్ చివరిలోగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)తో పాటు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించాలి. కానీ 2017–18కు సంబంధించిన ఏఆర్ఆర్లను మాత్రమే గత నవంబర్ 30న డిస్కంలు ఈఆర్సీకి అందజేశాయి. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను వాయిదా వేస్తూ వచ్చాయి. సాధారణంగా డిస్కంలు సమర్పించే టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాల స్వీకరించి, బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుంది. డిస్కంలు ఇంకా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోవడంతో వచ్చే ఏప్రిల్(ఆర్థిక సంవత్సరం ప్రారంభం) నుంచి చార్జీల పెంపు సాధ్యం కాకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ చార్జీల పెంపు అమలు ఉంటుందని ట్రాన్స్‌కో ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎంతో సంప్రదింపులకు అవకాశం లభించలేదని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయనతో చర్చించి చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని తెలిపాయి. సీఎంతో ఇంకా చర్చించ లేదు: డి.ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి మూడుసార్లు తిరస్కరించి తిప్పి పంపారని కొన్ని పత్రికల్లో వచ్చింది అవాస్తవం. ఇంతవరకు ఈ విషయంపై సీఎంతో చర్చించనే లేదు. చార్జీల పెంపు అవసరాలపై ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చించి ఈఆర్సీకి కొత్త టారిఫ్ సమర్పిస్తాం. గృహాలకు చార్జీల పెంపుపై సీఎం అయిష్టత వ్యక్తం చేయవచ్చు. ఆదాయ లోటు పూడ్చుకునేందుకు కొంత మేర చార్జీలు పెంచక తప్పదు. ఎవరిపై ఎక్కువ భారం లేకుండా చార్జీల పెంపును అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. -
వసూళ్ల వెలుగులు!
– పెద్ద నోట్ల రద్దుతో ముందస్తు విద్యుత్ బిల్లుల చెల్లింపులు – నెల బిల్లు కంటే వంద రెట్లు అధికంగా చెల్లిస్తున్న వినియోగదారులు – కలెక్షన్ అంతా రూ.500, రూ.వెయ్యి నోట్లే – 11న ఒకే రోజు రూ. 9.98కోట్లతో రికార్డు – నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమా కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు నగరంలోని బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఓ వినియోగదారుడికి ఈనెల రూ.1,074 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే ఆయన మంగళవారం ఆశాఖకు రూ.1,00,000 చెల్లించాడు. అంతారూ.వెయ్యి నోట్లతోనే. మీ బిల్లు రూ.1,074లే కదా.. రూ.లక్ష కడుతున్నారేంటి? అని పవర్ హౌస్‌లోని కౌంటరు ఉద్యోగి ప్రశ్నించగా.. మా ఇష్టమండి.. అడ్వాన్స్‌గా చెల్లించవచ్చని అధికారులే ప్రకటన ఇచ్చారు. మీరు అడగడమేంటి అని సమాధానం ఇవ్వడంతో ఆడబ్బును తీసుకొని రసీదు ఇచ్చారు. దీంతో ఈ లెక్కన దాదాపు 8 ఏళ్ల వరకు ఆయన బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని ఓ పరిశ్రమకు నెలవారి బిల్లు దాదాపు రూ.8వేలు వస్తుంది. కాని ఆ పరిశ్రమ యజమాని ఇటీవలే రూ.6లక్షల నగదును చెల్లించాడు'. .. వీరిద్దరే కాదు. ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాంది మంది వినియోగదారులు తమకు వచ్చిన విద్యుత్ బిల్లు కంటే వందరెట్లు అధికంగా చెల్లిస్తున్నారు. అదంతా రూ.500, రూ.వెయ్యి నోట్లతోనే. నెలవారి బిల్లులు సకాలంలో చెల్లించండయ్యా బాబు అని ఆశాఖ అధికారులు నెత్తినోరు కొట్టుకున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసే వినియోగదారులు ఇప్పుడు కౌంటర్ల వైపు పరుగుతీస్తున్నారు. రద్దయిన పెద్ద నోట్లతో విద్యుత్ బిల్లులు కట్టవచ్చని, అదీ పాత బకాయిలతోపాటు ముందస్తు (అడ్వాన్స్) చెల్లింపులు చేయవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించడంతో రూ.వెయ్యి, రూ.500 నోట్లతో కేంద్రాల వద్ద కివ్∙లైనులో నిలబడి కట్టేస్తున్నారు. వచ్చిన బిల్లులు పక్కనపెడితే కొందరు వంద రెట్ల వరకు అధికంగా చెల్లిస్తున్నారు. తరువాత ఎలాగూ నెలనెలా బిల్లులో మైనస్ అవతుందని ధీమాతో రద్దయిన పాత పెద్ద నోట్లను ఇలా చెలామని చెసుకుంటున్నారు. దీంతో ఆశాఖ ఖజానా రూ.500, రూ.వెయ్యి నోట్లతో నిండిపోతోంది. ఈనెల 8తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు పెద్ద నోట్ల స్వీకరణకు అనుమతి లేకపోవడంతో రోజుకు కేవలం లక్షల్లోనే ఆదాయం వచ్చింది. పాత నోట్లతో విద్యుత్ బిల్లులు చెల్లించవ్చని ప్రకటించడంతో 11వ తేదీన ఒకే రోజు రూ.9.98కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్ వచ్చింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు కట్టడంతో సంస్థ, జిల్లా చరిత్రలోనే మొదటి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో రూ.22 కోట్ల రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో బిల్లులు కట్టగా వాటిలో ఎల్టీ (గృహాలు, షాపులు, చిన్న ఫ్యాక్టరీలు) రూ.15.61కోట్ల కట్టగా పారిశ్రామికులు రూ.6.39కోట్ల చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలివైన వినియోగదారులు తమ డబ్బులు ఇలా తెలుపు చేసుకుంటున్నారు. – గత ఎమినిది రోజుల కలెక్షన్ ఇలా.. తేదీ ఎల్టీ హెచ్‌టీ మొత్తం 9వ తేదీన రూ.52.41లక్షలు రూ.9.79లక్షలు రూ.62.20లక్షలు 10వ తేదీన రూ.42.04లక్షలు రూ.44.85లక్షలు రూ.86.89లక్షలు 11వ తేదీన రూ.5.79కోట్లు రూ.4.18కోట్లు రూ.9.98కోట్లు 12వ తేదీన రూ.2.15కోట్లు రూ.9.11లక్షలు రూ.2.24కోట్లు 13వ తేదీన రూ.1.69కోట్లు రూ.13.12లక్షలు రూ.1.82కోట్లు 14వ తేదీన రూ.3.23కోట్లు రూ.31.88లక్షలు రూ.3.54కోట్లు 15వ తేదీన రూ.1.63కోట్లు రూ.19.29లక్షలు రూ.1.82కోట్లు 16వ తేదీన రూ.1.12కోట్లు రూ.51.20లక్షలు రూ.1.63కోట్లు -
పాత నోట్లతో బిల్లులు కట్టొచ్చు
-
పాత నోట్లతో బిల్లులు కట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాత రూ.1,000, రూ.500 నోట్లను వినియోగించుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పిం చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో చెల్లించాల్సిన ఇంటి, ఆస్తి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు, పాత బకాయిలు, ఇతర పన్నులు, ఫీజులు ఏవైనా శుక్రవారం అర్ధరాత్రి వరకు చెల్లించవచ్చని గురువారం రాత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, కార్యాలయాలు అదనపు సమయాలు పని చేస్తాయని తెలిపారు. ‘ఈ (గురువారం) ఉదయం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ప్రజల స్పందనేమిటని నన్నడిగారు. మంచి నిర్ణయమేనని, అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ప్రజలకు వెసులుబాటు కల్పించాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రద్దయిన నోట్లతో బిల్లులు కట్టొచ్చంటూ గెజిట్ విడుదల చేశారు’ అని వివరించారు. ‘రాష్ట్రంలోని మున్సిపల్, పంచయతీ అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో శుక్రవారం అన్ని కార్యక్రమాలనూ సస్పెండ్ చేశాం. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటారుు. చెల్లింపులకు రసీదు ఇస్తాం. ఈ పన్నుల రూ పేణా ప్రజలు చెల్లించే మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేశారు. వాట్సాప్‌లో వెల్లువెత్తుతున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. -
'రూ.16 కోట్ల బకాయిలు చెల్లించాలి'
కొవ్వూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల నుంచి రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు వసూలు కావల్సి ఉందని ట్రాన్స్‌కో డీఈ రమణాదేవి అన్నారు. శనివారం కొవ్వూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సకాలంలో బకాయిలు చెల్లించకపోతే గ్రామపంచాయతీల్లో ఉన్న వీధి దీపాలకు, మోటర్లకు, కార్యాలయాలకు విద్యుత్‌ను నిలిపి వేస్తామని ఆమె అన్నారు. ధీన్‌దయాల్ పథకం ద్వారా కావలి సబ్‌డివిజన్‌కు మరో ఐదు సబ్స్టేషన్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉంటున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమె చెప్పారు. -
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు
-
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచారు. నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే 5 శాతం మేర ఛార్జీలు పెంచనున్నారు. సోమవారం సాయంత్రం ఏపీఈఆర్సీ విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. 200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపుదల వర్తించదు. వ్యయసాయం, కుటీర పరిశ్రమలకు మినహాయింపు నిచ్చారు. చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. వివరాలు.. 200 దాటితే యూనిట్ ధర 6.38 నుంచి 6.70 రూపాయలకు పెంపు 250 దాటితే యూనిట్ ధర 6.88 నుంచి 7.22 రూపాయలకు పెంపు 300 దాటితే యూనిట్ ధర 7.38 నుంచి 7.75 రూపాయలకు పెంపు 400 దాటితే యూనిట్ ధర 7.88 నుంచి 8.27 రూపాయలకు పెంపు 500 దాటితే యూనిట్ ధర 8.38 నుంచి 8.80 రూపాయలకు పెంపు -
ఏపీ సర్కార్ కరెంట్ షాక్!
-
ఏపీ సర్కార్ కరెంట్ షాక్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం ప్రభుత్వం వివరాలను వెల్లడించవచ్చని సమాచారం. భారమంతా వినియోగదారులపై పడనుంది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు మినహాయింపు ఇచ్చే అవకాశముంది. విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంలో మంత్రులు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలుస్తోంది. 10 శాతం మేరకు పెంచాలని కొందరు మంత్రులు అభిప్రాయపడగా, 6 శాతం మేర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యుత్ శాఖ 7726 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. -
పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు
అనంతపురం: విద్యుత్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్ పై వ్యాట్ విధించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపమైందని కాపు ఎద్దేవా చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైఎస్ జగన్ నేతృత్వంలో సమస్యలు పరిష్కిరంచుకుందామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. -
అదే మోసం.. అదే వంచన
ఒకవైపు విద్యుత్ చార్జీల మోత.. మరో వైపు వ్యాట్ వడ్డనకు ప్రభుత్వం సన్నద్ధం కావడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. అమలు చేయలేని హామీలతో ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రజలను పిండడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు అవగతమవుతోంది. ప్రభుత్వ బొక్కసాన్ని నింపేందుకు బక్క ప్రాణులను సైతం బలిపీఠం ఎక్కించడం ఏలికలకే చెల్లినట్టుంది. ఏరు దాటాక తెప్ప తగలేసే నైజాన్ని చంద్రబాబు మరో సారి రుజువు చేసుకున్నారని నిరూపితమవుతోంది. రాజధాని పేరిట సారవంతమైన భూములు లాక్కోవడం, గృహ వినియోగదారుడు మొదలు పరిశ్రమల వరకు భారీ ఎత్తున విద్యుత్ చార్జీల భారం వేయనుండడం ప్రజాకంటక పాలనను జ్ఞప్తికి తేకమానదు. రుణ మాఫీలో విఫలమై బ్యాంకులకు వడ్డీలు కట్టించిన ముఖ్యమంత్రి ఈ సారి విద్యుత్ బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తేటతెల్లమవుతోంది. చార్జీల పెంపు అన్యాయమనీ, అన్ని రంగాలను దెబ్బ తీయనుందనీ, పొరుగు రాష్ట్రాలలో సబ్సిడీపై సౌర విద్యుత్ అందిస్తుంటే మన రాష్ట్రంలో ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, భారం మోపనని హామీ ఇచ్చి మళ్లీ మోసం చేశారని చంద్రబాబుపై ప్రజలు మండిపడుతున్నారు. -
విద్యుత్ చార్జీల పెంపుతో ఇబ్బంది లేదు
తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రం లో విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవా రం తిరుపతికి చేరుకున్నారు. ఓ హోటల్లో నిర్వహించిన బూత్ లెవల్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉపఎన్నిక ఓ వ్యక్తి స్వార్థం తో వచ్చిందన్న విషయం తిరుపతి ప్రజలు గుర్తించారని తెలిపా రు. వారికి బుద్ధి వచ్చేలా తీర్పును ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం ప్రభుత్వం సాధించిన మొదటి మెట్టు అన్నారు. మరింత సాయం తీసుకురావడంలో నిరంతరం పోరాటం చేస్తామన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందించిన ఘనత తమకే దక్కిందన్నారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్, నీరు, ఎంసెట్ పరీక్షలు వంటి సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నారా లోకేష్ వివరించారు. -
మీడియా పాయింట్: ఎవరెవరేమన్నారంటే
పంచాయతీల బిల్లుల్ని సర్కారే భరించాలి గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు, బకాయిలను తెలంగాణ సర్కారే భరించాలి. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని చెల్లించటంతో పంచాయతీలపై భారం పడుతోంది. ఏకగీవ్రంగా ఎన్నికైన పంచాయతీలకు ఇస్తామన్న రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇప్పటికీ ఇవ్వలేదు.. వెంటనే విడుదల చేయాలి. ....... - జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ......................... రేషన్ కార్డులపై స్పష్టత అవసరం తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఉద్యోగుల హెల్త్ కార్డులపై స్పష్టత లేదు. జీవో నంబర్ 653లోని అనేక అంశాలపై సంబంధిత మంత్రి సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. బోగస్ పేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారు. తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్ల పంపిణీ ఆరంభ శూరత్వంగా మారింది. ...... - బీజేపీ ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద ‘సంక్షేమం’ నుంచి తప్పుకునేందుకే కుట్ర కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద అందించే బియ్యంతోనే సరిపెట్టి సంక్షేమ పథకాల నుంచి తప్పుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే రేషన్ కార్డులకు అన్ని లింక్‌లను తొలగించి బియ్యానికి పరిమితం చేస్తోంది. ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలకు ఆధారంగా ఉండేది. అదే విధానాన్ని కొనసాగించాలి. ....... - కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేరు ఫాస్ట్ పథకం.. అమలు మాత్రం స్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేరును కేసీఆర్ ప్రభుత్వం ఫాస్ట్ పథకంగా మార్చింది. ఆచరణలో మాత్రం ఆ పథకాన్ని స్లోగా నడిపిస్తున్నారు. ఫలితంగా తెలంగాణలోని 15 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సగం విద్యా సంవత్సరం గడిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కనీసం గైడ్‌లైన్స్ రూపకల్పన జరుగలేదు. ఇటీవల నామామాత్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. నయా పైసా బ్యాంక్ ఖాతాల్లో చేరలేదు. విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు వారిని కళాశాలలకు రావద్దని ఇంటికి పంపిస్తున్నాయి......... - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ........................ చరిత్రహీనులుగా మారవద్దు తెలంగాణ శాసనసభను తప్పుదోవ పట్టించి టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మారవద్దు. రేవంత్‌రెడ్డి అబద్ధాలకోరు. ఆధారాలు లేని అభియోగాలు చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఆధారాలతో సహా రుజువు చేయాలి. సొంత మీడియా తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలిందే. ప్రజా సమస్యల చర్చపై శ్రద్ధ పెట్టాలే తప్ప అనవసర రాద్ధాంతాలతో సభను అగౌరవ పర్చవద్దు........ - టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జీవన్‌రెడ్డి, బాలరాజు, గణేశ్ గుప్తా ఆర్డీఎస్ నీళ్ల దోపిడీ పట్టని సర్కార్ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో ఆర్డీఎస్సమస్యను అనుకూలంగా మలుచుకున్న టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దాన్ని గాలికి వదిలేసింది. ఆర్డీఎస్ నీళ్లతో సీమాంధ్రలో రిజర్వాయిర్ నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ ఆయిన జీవో 100 అమలవుతున్నా కనీసం పట్టింపు లేదు. ఏడు గ్రామాలు నిండా మునిగే ప్రమాదం ఉంది. నీళ్ల దోపిడీ అడ్డుకొవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే గొంతు నొక్కుతున్నారు...... - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ..................... విషపు పాలు తాగి సభలో చిమ్ముతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు బాబుకు చెందిన హెరిటేజ్ విషపు పాలు తాగి తెలంగాణ శాసనసభలో విషాన్ని చిమ్ముతున్నారు. మీ మాటలు ఎవరివి? సభ సజావుగా జరగకుండా బాబు తన బృందాన్ని ప్రోత్సహిస్తున్నారు. సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎవరో తెలియడం లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావా? లేక రేవంత్రెడ్డియా? వెల్‌లోకి ఫ్లోర్ లీడర్ వెళ్లి రచ్చ చేయడం దురదృష్టకరం. ఎంపీపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మహిళ అనే గౌరవం లేకుండా ఆమె గుండెకు గాయం చేస్తున్నారు. ఆర్. కృష్ణయ్యని సీఎం చేస్తానన్న బాబు.. ఆయనకు కనీసం ఫ్లోర్ లీడర్‌గానైనా అవకాశం ఇవ్వలేదు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మీడియాలో ప్రచారానికే... రేవంత్ రెడ్డి తీరు ఆంధ్ర పాలకులకు వంతపాడుతున్నట్లుగా ఉంది. మీడియాలో ప్రచారం కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. రౌడీగానైనా, విలన్‌గానైనా తనపేరు ప్రచారం కావాలని దిగజారి ప్రవర్తిస్తున్నాడు. వితంతువుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన రేవంత్‌ను ఎవరూ క్షమించరు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత అసెంబ్లీ జీరో అవర్: ప్రభుత్వ విధానమేంటో చెప్పండి అధికారంలోకి వచ్చి ఆరు నెలలై నా తెలంగాణ ప్రభుత్వ విధి విధానాలేమిటో ఎమ్మెల్యేలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి పెన్షన్లు వస్తాయో, ఆహార భద్రత కార్డుకు ఎవరు అర్హులో.. అర్థం కాని పరిస్థితిలో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. మాకు కార్డు లొస్తా యా? అని ప్రజలడిగితే సమాధానం చెప్పలేకపోతున్నాం. రోజుకో పథకాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్.. వాటి గురించి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు వివరిస్తే బాగుంటుంది. - అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి (బీజేపీ) కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తి చేయండి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగు నీరందించే కిన్నెరసాని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రూ.37 కోట్లు వెచ్చించి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ ద్వారా 3వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 7వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ...... - పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ) నక్కలగండి దిండి ప్రాజెక్టును చేపట్టా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరందించే నక్కలగండి- దిండి ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగునీటితోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, మహబూబ్‌నగర్ జిల్లాలో మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రాజెక్టును చేపట్టాలి. ..... - దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (సీపీఐ) వీఆర్ఏల వేతనం సవరించాలి తెలంగాణ రాష్ట్రంలో పనిచే స్తున్న 25వేల మంది వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించి, వారి వేతనాన్ని సవరించాలి. రెవెన్యూ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇందుకు కృషి చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వీఆర్ఏలకు రూ. 6 వేల వేతనం మాత్రమే అందుతోంది, దాన్ని రూ. 15 వేలకు పెంచాలి. - భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (సీపీఎం) -
త్వరలో ప్రీ-పెయిడ్ కరెంట్ విధానం
-
ముందే బాదుడు...
సాక్షి, హైదరాబాద్: ఇకపై వినియోగదారులు ముందుగానే కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది! ఆ మొత్తానికి కరెంటును వాడుకున్న వెంటనే సదరు వినియోగదారుడి ఇంటికి సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీ-చార్జ్ చేసుకుంటేనే విద్యుత్ వెలుగులను పొందుతారు. ఇదే ప్రీ-పెయిడ్ విధానం. దీన్ని త్వరలో అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సిద్ధమవుతున్నాయి. ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోతుండటం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, దొంగ కరెంటు వినియోగం.. తద్వారా విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు(సీఎస్)లకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కె. సిన్హా లేఖ రాశారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం మిగిలిన వినియోగదారులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రీ పెయిడ్ ఫోన్ల తరహాలోనే.. ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పనిచేస్తాయి. ఒక్కో వినియోగదారుడికి ప్రీ పెయిడ్ సిమ్‌ను డిస్కంలు మంజూరు చేస్తాయి. ఈ సిమ్‌కు ప్రత్యేక నంబర్ ఉంటుంది. దీన్ని ముందుగా కావాల్సిన మొత్తంతో రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్‌ను మీటర్లో అమర్చిన వెంటనే కరెంటు సరఫరా అవుతుంది. ఈ సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమేటిక్‌గా కరెంటు సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ సిమ్‌లో రీచార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. అయితే, ఈ విధానం ద్వారా... నెలనెలా చాంతాడంత క్యూలో నిలబడి విద్యుత్ బిల్లు చెల్లించడం, గడువులోగా చెల్లించలేదనే కారణంగా కనెక్షన్లు తొలగించడం వంటి సమస్యల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తుంది. తమకూ బకాయిల భారం తప్పుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంటున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 1,300 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను బకాయి పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే ఈ మీటర్ల కొనుగోలుకు అయ్యే వ్యయ భారాన్ని విద్యుత్ చార్జీల రూపంలో మళ్లీ వినియోగదారులపైనే మోపుతారని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ మీటర్లు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చెల్లిస్తే లభిస్తున్నాయి. కానీ ప్రీ పెయిడ్ మీటర్లకు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం గృహ విద్యుత్ కనెక్షన్లే రెండు కోట్లకుపైగా ఉన్నాయి. ఒక్కో మీటరుకు సగటున రూ. 6 వేలు లెక్కించినా... రూ. 12 వేల కోట్లకుపైగా నిధులను మీటర్ల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. దీంతో ఈ భారాన్ని చార్జీల పెంపుతో జనంపైనే వేయడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ముదిరిన ‘పంచాయతీ’
ట్రాన్స్‌కోకు, గ్రామపంచాయతీలకు మధ్య కరెంటు బకాయిల వివాదం ముదురుతోంది. బకాయిల వసూళ్లకోసం అధికారులు కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో సర్పంచుల ధీటుగా స్పందిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలు చెల్లించేది లేదని, అవసరమైతే వసూళ్లకు వచ్చే సిబ్బందిని నిర్భందిస్తామని సర్పంచుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వివాదానికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కరీంనగర్ సిటీ : గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజావసరాలకు ఆయా పంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి. గతంలో ప్రభుత్వమే పంచాయతీల విద్యుత్ బిల్లులను నేరుగా చెల్లించేది. కొద్ది నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో జిల్లాలో 1207 గ్రామాలకు రూ.60 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు బకాయిలు చెల్లించాలని, లేన ట్లయితే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని గత నెలలో గ్రామపంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి తప్పుకున్న ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపై మోపింది. గ్రామాలకు వచ్చే 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ ని ధుల్లో 25 శాతం నిధులు బకాయిలు చెల్లించడానికి వెచ్చించాలని డీపీఓ ఈ నెలలో సర్క్యులర్ జారీ చేశారు. అసలే అరకొర నిధులతో నెట్టుకొస్తుంటే.. అందులోంచి 25 శాతం విద్యు త్ బిల్లులకు కేటాయించడాన్ని సర్పంచులు వ్యతిరేకించారు. గతంలో మాదిరిగా ప్రభుత్వమే నేరు గా విద్యుత్ బిల్లులతో పాటు బకాయిలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సర్పంచు ల నడుమ ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ట్రాన్స్‌కో అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని దాదాపు రెండువందల గ్రామపంచాయతీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీనిపై సర్పంచులు తీవ్రం గా స్పందించారు. విద్యుత్ బిల్లులు గ్రామపంచాయతీలు చెల్లించేది లేదని తీర్మానించారు. పై గా విద్యుత్ కనెక్షన్ తొలగించడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వస్తే నిర్బంధించాలంటూ సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. దీంతో ట్రాన్స్‌కో, పంచాయతీల మధ్య ప్రతక్ష్యంగా వార్ మొదలైంది. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం నాయకులు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. చర్యకు ప్రతిచర్య.. విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి ట్రాన్స్‌కో రంగంలోకి దిగగా, అందుకు ప్రతిచర్యకు పంచాయతీలు పూనుకుంటున్నాయి. గ్రామపంచాయతీల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు పన్ను విధించేందుకు సర్పంచులు సమాయత్తమవుతున్నారు. గ్రామ అవసరాలకు వినియోగించిన విద్యుత్ బిల్లుల బకాయిల కోసం ట్రాన్స్‌కో కరెంట్ కట్ చేస్తే.. తాము తక్కువ కాదన్నట్లు ట్రాన్స్‌కోకు పన్నుల బకాయిల నోటీసులు పంపించాలని సర్పంచులు యోచిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఉన్న ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.100, ట్రాన్స్ఫార్మర్కు రూ.వేయి, సబ్స్టేషన్లకు రూ.10 వేల చొప్పున తక్షణమే విద్యుత్ అధికారులు సంబంధిత గ్రామపంచాయతీలకు పన్నులు చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు ప్రేక్షకపాత్ర.. ట్రాన్స్‌కో,గ్రామపంచాయతీల నడుమ చిచ్చుపెట్టిన రాష్ట్ర సర్కారు మాత్రం ఈ వ్యవహారంలో ప్రేక్షకపాత్ర వహిస్తోంది. సర్పంచుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓవైపు ట్రాన్స్‌కో దూకుడు పెంచగా, మరోవైపు సర్పంచులు అదేస్థాయిలో ప్రతిఘటించేందుకు సిద్ధంకావడంతో జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కరెంటు బిల్లుల ‘పంచాయతీ’ని పరిష్కరించాల్సిన అవసరముంది. -
సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థులు కావలెను
జిల్లాలో ఆరువేల సీట్లు ఖాళీ విద్యార్థుల అన్వేషణలో అధికారులు పెద్దతిప్పసముద్రం: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా కాపు రం ఉండని వార్డన్లు, ఇన్చార్జి వార్డన్లు సైతం సిబ్బం దికే అన్ని బాధ్యతలు అప్పజెప్పడం, అరకొర వసతు లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఈ ఏడాది ఆరువేల వ రకు సీట్లు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు హాస్టల్లో సీటు కావాలంటే విద్యార్థులు అధికారుల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం విద్యార్థుల కోసం సంక్షేమశాఖ అధికారులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం 50 మంది విద్యార్థులు కూడా లేని హాస్టల్‌ను పక్కనున్న హాస్టల్లో కలిపేందుకు జిల్లా అ ధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 124 ఎస్సీ, 16 ఎస్టీ, 68 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హా స్టళ్లలోనే 4 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లల్లో వి ద్యార్థుల బాగోగులు, కనీస సౌకర్యాలు కల్పించటం పై సంక్షేమ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించట మే ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వసతులు లేని సంక్షే మ హాస్టళ్లలో చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్యను పెంచకుంటే వే రే హాస్టల్లో కలిపేస్తామని జిల్లా సంక్షేమ అధికారులు వార్డన్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంక్షేమ హా స్టళ్లలో పని చేసే సిబ్బంది విద్యార్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు. విద్యార్థులను చేర్పించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఒకవైపు హాస్టళ్లలో అరకొర విద్యార్థులు, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు బెడ్షీట్లు, నోటుపుస్తకాలు, ట్రంకుపెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు వంటివి హాస్టళ్లకు చేరకపోవడంతో పాత వస్తువులతోనే విద్యార్థులు కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది. సీట్ల భర్తీకి చర్యలు సంక్షేమ హాస్టళ్లల్లో ఖాళీగా వున్న సీట్లను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాము. ప్రతి హాస్టల్లో విద్యార్థుల సంఖ్య 50కి తగ్గితే పక్క హాస్టల్లో కలిపేస్తామని ఆయా పరిధిలోని వార్డన్లకు సూచించాం. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులతో చర్చిస్తున్నాము. జిల్లాలో 22 ఎస్సీ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పీటీఎం మండలంలోని కందుకూరు, పెద్దపంజాణి మండలంలోని నిడిగుంట గ్రామాల్లో ఉన్న ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రెండు హాస్టళ్లలో విద్యార్థులకు అయ్యే నెలవారి ఖర్చుకన్నా భవనం అద్దె, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలే అధికంగా ఉన్నాయి. నెలాఖరులోగా విద్యార్థుల సంఖ్య పెరగకపోతే హాస్టళ్లను మూసివేసి పిల్లలను సమీపంలోని వేరే హాస్టల్లో చేర్పిస్తాం. - కెఎస్.ధనంజయ్రావ్. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి -
పంచాయతీలకు షాక్
పంచాయతీలకు సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు ఆ శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే నిధులు లేక నీరసించిన స్థానిక సంస్థల మెడకు ఇది గుదిబండగా మారనుంది. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోని పక్షంలో జిల్లాలోని వందలాది పంచాయతీల్లో చీకట్లు అలుముకోనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది. నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలో 40 మేజర్, 900 మైనర్ గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీ వీధిదీపాలు, మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యుత్ బిల్లులను ఐదేళ్ల క్రితం వరకు పంచాయతీల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. అనంతరం ఆ బాధ్యతను పాలకమండళ్లకే వదిలేసింది. మొదట్లో కొంతకాలం బిల్లులను సక్రమంగా చెల్లించినా చాలా పంచాయతీలు తర్వాత కట్టడం మానేశాయి. ఎప్పటికైనా ప్రభుత్వం చెల్లించికపోతుందా..అనే ధీమాతోనే బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.45.22 కోట్లకు చేరుకున్నాయి. వీటి వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సరఫరా అయినా నిలిపేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలోని అనేక గ్రామాలు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం నెలకొంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు వీధిలైట్లు వెలగక వీధులు చిమ్మచీకట్లో చిక్కుకోనున్నాయి. మరోవైపు ఇప్పటికప్పుడు ఈ బిల్లులు చెల్లించే పరిస్థితిలో కూడా పంచాయతీలు లేవు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రభుత్వం నుంచి పలు రకాల నిధుల విడుదల నిలిచిపోయింది. కొన్ని నెలల క్రితం ఏర్పడిన పాలకవర్గాలు ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నాయి. ఈ సమయంలోనే విద్యుత్ బకాయిల సమస్య సర్పంచ్‌లకు పెద్ద సవాల్‌గా మారింది. కాలిపోయిన మోటార్ల మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నూతన ప్రభుత్వ సహకారం కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. అన్ని స్థానిక సంస్థలది అదే పరిస్థితి పంచాయతీలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా విద్యుత్ బకాయిల సమస్యను ఎదుర్కొంటున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే రూ.21.4 కోట్ల బకాయి పడడంతో పదిహేను రోజుల క్రితం కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. వెంటనే స్పందించకుంటే వీధిలైట్లు, మంచినీటి పథకాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. మరోవైపు మున్సిపాలిటీలు కూడా విద్యుత్ శాఖకు రూ.2.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2009 నుంచి పెండింగ్ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపు 2009 నుంచి నిలిచిపోయింది. అంతకుముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ జీఓ విడుదల చేశారు. పంచాయతీలను విద్యుత్ బిల్లుల నుంచి మినహాయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా 2009 వరకు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను చెల్లించేది. మహానేత మరణానంతరం అధికారం చేపట్టిన వారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పంచాయతీలకు భారం పెరిగిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు సీఎంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి బకాయిలు చెల్లిస్తామని, బిల్లులను ప్రభుత్వమే కట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఒక్క రూపాయి విదల్చలేదు. త్వరలో ఏర్పడబోతున్న ప్రభుత్వమైనా ఈ విషయంలో తగిన నిర్ణయం వెంటనే తీసుకోవాలని పంచాయతీ పాలకమండళ్లు కోరుతున్నాయి.