మధ్యప్రదేశ్ నుంచి సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో ఆపద సమయంలో వేలాది మంది ప్రాణాలను 108 పథకం కాపాడింది. ఫోన్ చేసిన వెంటనే కుయ్.. కుయ్‌మంటూ దూసుకొచ్చిన ఈ అంబులెన్స్‌లు ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ కూత పెడుతున్నా యి. ఆంధ్రప్రదేశ్‌లో 108 వాహనాలకు కష్టకాలం వచ్చినా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం ఈ పథకం స్ఫూర్తిని అర్థం చేసుకున్న పాలకులు ఇక్కడ గత ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తెచ్చారు. తహసీల్‌కు ఒక 108ను అందుబాటులోకి తెచ్చి ఇప్పటికే వందలాది మందిని రాష్ట్రవ్యాప్తంగా క్షతగాత్రులను, ముఖ్యంగా పాముకాటు బాధితులను కాపాడినట్టు సివోని ప్రాం తంలో ఒక 108లోని సహాయకుడు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఈ ఒక్క పథకమే కాదు.. 2003లో పాదయాత్ర చేసి ప్రజల ఆవేదనను గ్రహించి రచించి అమలుచేసిన ఎన్నో పథకాలు ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ కనిపిస్తుండడం విశేషం.
ఆహారం నుంచి రుణాల వరకు..
డాక్టర్ వైఎస్సార్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ గోధుమలు రూపాయికి కిలో, బియ్యం రెండు రూపాయలకు కిలో చొప్పున అందిస్తోంది. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి తమను అధికారంలోకి తెస్తే 35 కిలోల గోధుమలు, బియ్యం ఉచితంగా ఇస్తామంటోంది. సాగుకు ఉచిత విద్యుత్తు ఇచ్చి, విద్యుత్తు బిల్లులు మాఫీ చేసిన వైఎస్సార్ స్ఫూర్తితో ఇప్పుడు కాంగ్రెస్ కూడా మధ్యప్రదేశ్‌లో ఇదే హామీ ఇచ్చింది.
మధ్యప్రదేశ్‌లో వైఎస్ పథకాలు
Published Fri, Nov 15 2013 5:03 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
Advertisement