
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విద్యుత్ ఛార్జీలను పెంచారు. నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే 5 శాతం మేర ఛార్జీలు పెంచనున్నారు. సోమవారం సాయంత్రం ఏపీఈఆర్సీ విద్యుత్ టారిఫ్ను ప్రకటించింది.
200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులకు ఛార్జీల పెంపుదల వర్తించదు. వ్యయసాయం, కుటీర పరిశ్రమలకు మినహాయింపు నిచ్చారు. చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు.
వివరాలు..
200 దాటితే యూనిట్ ధర 6.38 నుంచి 6.70 రూపాయలకు పెంపు
250 దాటితే యూనిట్ ధర 6.88 నుంచి 7.22 రూపాయలకు పెంపు
300 దాటితే యూనిట్ ధర 7.38 నుంచి 7.75 రూపాయలకు పెంపు
400 దాటితే యూనిట్ ధర 7.88 నుంచి 8.27 రూపాయలకు పెంపు
500 దాటితే యూనిట్ ధర 8.38 నుంచి 8.80 రూపాయలకు పెంపు