బాదుడుపై బాబు ఫోకస్‌.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్‌సీపీ | YSRCP Questioned By Chandrababu Over Electricity Charges | Sakshi
Sakshi News home page

బాదుడుపై బాబు ఫోకస్‌.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్‌సీపీ

Oct 1 2024 4:08 PM | Updated on Oct 1 2024 4:08 PM

YSRCP Questioned By Chandrababu Over Electricity Charges

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి.. చంద్రబాబు బాదుడు మొదలుపెట్టాడు. విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై మోపారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా.. 
హామీలను తుంగలో తొక్కి.. బాదుడు మొదలెట్టిన చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.8,100 కోట్లని సామాన్యుల నుంచి వసూళ్ల చేసేందుకు ఎత్తుగడ. పథకాల రూపంలో ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు ఇచ్చింది శూన్యం.. కానీ విరాళాలు, టాక్సుల రూపంలో కోట్లల్లో వసూళ్లు చేశారు. సంపద సృష్టించడమంటే ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించింది.

 

అధికారంలోకి వచ్చాక బుద్ధి చూపిస్తున్న చంద్రబాబు. విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం. ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు గాలి కబుర్లు చెప్పిన చంద్రబాబు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది.  
 

 ఇది కూడా చదవండి: రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement