శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలు
కరెంటు చార్జీల భారంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసన
సాక్షి, అమరావతి /కృష్ణలంక(విజయవాడతూర్పు)/ఒంగోలు టౌన్/చిత్తూరు కార్పొరేషన్/ ఆమదాలవలస: చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు.
ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దుబాటు చార్జీల పేరుతో రెండు విడతల్లో రూ.16వేల కోట్ల భారం మోపారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు మంగళంపాడారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment