తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రం లో విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవా రం తిరుపతికి చేరుకున్నారు. ఓ హోటల్లో నిర్వహించిన బూత్ లెవల్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుపతి ఉపఎన్నిక ఓ వ్యక్తి స్వార్థం తో వచ్చిందన్న విషయం తిరుపతి ప్రజలు గుర్తించారని తెలిపా రు. వారికి బుద్ధి వచ్చేలా తీర్పును ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం ప్రభుత్వం సాధించిన మొదటి మెట్టు అన్నారు. మరింత సాయం తీసుకురావడంలో నిరంతరం పోరాటం చేస్తామన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందించిన ఘనత తమకే దక్కిందన్నారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్, నీరు, ఎంసెట్ పరీక్షలు వంటి సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నారా లోకేష్ వివరించారు.
విద్యుత్ చార్జీల పెంపుతో ఇబ్బంది లేదు
Published Sat, Feb 7 2015 2:17 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement