కొవ్వూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీల నుంచి రూ. 16 కోట్ల విద్యుత్ బకాయిలు వసూలు కావల్సి ఉందని ట్రాన్స్‌కో డీఈ రమణాదేవి అన్నారు. శనివారం కొవ్వూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సకాలంలో బకాయిలు చెల్లించకపోతే గ్రామపంచాయతీల్లో ఉన్న వీధి దీపాలకు, మోటర్లకు, కార్యాలయాలకు విద్యుత్‌ను నిలిపి వేస్తామని ఆమె అన్నారు. ధీన్‌దయాల్ పథకం ద్వారా కావలి సబ్‌డివిజన్‌కు మరో ఐదు సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉంటున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమె చెప్పారు.