![Uddhav Thackeray Says MERC Has Directed Power Companies To Show Transparency In Billing - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/30/uddav.jpg.webp?itok=QFAop5lo)
ముంబై: విద్యుత్ బిల్లింగ్ విధానాల్లో మరింత పారదర్శకత చూపించాలని మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(ఎంఈఆర్‌సీ)ను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. అధిక విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా విద్యుత్ సంస్థలను ఆదేశించాలని ఎంఈఆర్‌సీకి సూచించారు. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు అధికంగా రావటంతో వినియోదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. (నవంబర్ వరకు ఉచిత రేషన్ : మోదీ)
ఇక మార్చి, మే నెలల్లో విద్యుత్ బిల్లు సగటు కంటే రెట్టింపు వస్తే వినియోదారులు మూడు నెలవారీ వాయిదాల్లో ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఇస్తున్నట్లు ఎంఈఆర్‌సీ పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇళ్ల వద్దకు వెళ్లి విద్యుత్ మీటర్ల రీడింగ్‌ను నమోదు చేయటాన్ని విద్యుత్ సంస్థలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక సగటు కంటే రెండు, మూడు రెట్లు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లుల పట్ల వినియోగదారలు వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తూ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (ఉచిత విద్యుత్‌కు శాశ్వత భరోసా)
Comments
Please login to add a commentAdd a comment