దొండవారిగూడెం(మిర్యాలగూడ రూరల్), న్యూస్‌లైన్: దొండవారిగూడెం పరిధిలోని పచ్చారుగడ్డ గ్రామ రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ బుధవారం భీమారం-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో తడకమళ్ల 33/11 కేవీవిద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి దొండవారిగూడెం గ్రామానికి సరఫరా అయ్యే త్రీఫేజ్ విద్యుత్‌ను నిలిపివేశారని, దీంతో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ బిల్లుల విషయమై రైతులకు సమాచారం ఇవ్వకుండానే సరఫరా నిలిపివేయడమేంటని రైతులు ప్రశ్నించారు. వేములపల్లి ఎస్‌ఐ యాదగిరి రాస్తారోకో వద్దకు చేరుకొని ట్రాన్స్‌కో అధికారులతో మా ట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోలో వైఎస్సార్ సీపీ నాయకులు నామిరెడ్డి విజయేందర్‌రెడ్డి, పరికల సైదులు, సీపీఎం నాయకులు చిరుమళ్ల భిక్షం, గోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీను, అంజయ్య, సైదులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో నిర్లక్ష్యంపై రైతుల రాస్తారోకో
Published Thu, Dec 19 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement