
ఏపీ సర్కార్ కరెంట్ షాక్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం ప్రభుత్వం వివరాలను వెల్లడించవచ్చని సమాచారం. భారమంతా వినియోగదారులపై పడనుంది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు మినహాయింపు ఇచ్చే అవకాశముంది.
విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంలో మంత్రులు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలుస్తోంది. 10 శాతం మేరకు పెంచాలని కొందరు మంత్రులు అభిప్రాయపడగా, 6 శాతం మేర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యుత్ శాఖ 7726 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది.