నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : తప్పు చేస్తే దండించాల్సిన ఉన్నతాధికారులే నిర్లక్ష్యం బాట పడితే ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న రాకమానదు. పేదలు రూ.100 బ కాయి ఉంటే ఏకంగా దాడి చేసి వసూలు చేసే అధికారులు తమ దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ‘మేము కూడా వి ద్యుత్ బిల్లులు చెల్లించాలా’ అని కొందరు రెవెన్యూ అధికారులు విద్యుత్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కలెక్టర్, జేసీ
బంగ్లాలు, కార్యాలయాలకు సంబంధించి ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోయినా జిల్లా ఉన్నతాధికారులు కావడంతో విద్యుత్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఉన్నతాధికారుల ఏలుబడిలో ఉన్న మరికొన్ని భవనాలకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. దర్గామిట్టలోని కస్తూర్బా కళాక్షేత్రం పినాకిని అతిథిగృహానికి సంబంధించి లక్షల రూపాయలు బకాయి ఉండటంతో వీటికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెవెన్యూ విభాగంలోని అధికారులంతా బిల్లులు చెల్లించకపోయినా వారి జోలికి వెళితే ఎలాంటి ముప్పు వస్తుందోనన్న భయాందోళనతో విద్యుత్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. జిల్లా ప్రజానీకానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నతాధికారులే విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఎలా అని పలు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మేము కూడా బిల్లులు కట్టాలా?
Published Thu, Jan 30 2014 3:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement