మెక్కేశాడు | The event is usually the situation was exposed | Sakshi
Sakshi News home page

మెక్కేశాడు

Published Thu, Jan 16 2014 2:29 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

మెప్మా సంఘటనను మరవకముందే మరో బాగోతం వెలుగు చూసింది. విద్యుత్ రాబడి కార్యాలయంలో పని చేస్తున్న సుమంత్ అనే కాంట్రాక్టు కార్మికుడు సుమారు పది లక్షలు స్వాహా చేశాడు .

ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్: మెప్మా సంఘటనను మరవకముందే మరో బాగోతం వెలుగు  చూసింది. విద్యుత్ రాబడి కార్యాలయంలో పని చేస్తున్న సుమంత్ అనే కాంట్రాక్టు కార్మికుడు సుమారు పది లక్షలు స్వాహా చేశాడు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు.     ఎర్రగుంట్ల సబ్ స్టేషన్‌లోని ఈఆర్‌ఓ(ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం)లో వినియోగదారులు  విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటారు. వినియోగదారులకు మాత్రం కట్టినట్లుగా  బిల్లు ఇచ్చి ఆ డబ్బును  సుమంత్ స్వాహా చేసేవాడు. ఈ విధంగా రూ. 10 లక్షలు స్వాహా చేశాడు. సకాలంలో బిల్లులు చెల్లించలేదని వినియోగదారుల కనెక్షన్‌లను విద్యుత్ సిబ్బంది కట్ చేయడంతో ఈ బాగోతం వెలుగు  చూసింది.
 
 తాము విద్యుత్ బిల్లులు చెల్లించినా తమ కనెక్షన్‌లు కట్ చేయడం ఏమిటని విద్యుత్ అధికారులను వినియోగదారులు నిలదీశారు. దీంతో అధికారులు విచారణ చేయగా రూ. 10 లక్షలు దుర్వినియోగం అయినట్లు   తేల్చారు. ఇందులో రూ. 6 లక్షలను తిరిగి కట్టిన సుమంత్ మిగిలిన రూ. 4 లక్షలను చెల్లించలేక పరారయ్యాడు.దీంతో విద్యుత్ శాఖ ఏఓ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చే శారు. కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.  కాగా ఈ సంఘటనలో మరికొంత మంది ఉద్యోగుల హస్తం ఉండవచ్చని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement