బాధ్యతలు తీసుకున్న గోయెల్ | Vijay Goel vows to work 24/7 as Sports | Sakshi
Sakshi News home page

బాధ్యతలు తీసుకున్న గోయెల్

Published Thu, Jul 7 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

బాధ్యతలు తీసుకున్న గోయెల్

బాధ్యతలు తీసుకున్న గోయెల్

న్యూఢిల్లీ:  కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా విజయ్ గోయెల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోయెల్‌కు క్రీడా మంత్రిత్వశాఖను కేటాయించారు. ఈయన వాజ్‌పేయి హయాంలోనూ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. 

 రియోలో భారతీయ భోజనం
భారత ఆటగాళ్ల కోరిక మేరకు రియోలో అథ్లెట్లందరికీ భారతీయ వంటకాలను అందిస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘రియో గేమ్స్ అధికారిక ఫుడ్ మెనూలో భారతీయ వంటకాలను భాగం చేసినట్లు రియో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్ పూర్తయ్యేవరకు క్రీడా గ్రామంలో భారతీయ భోజనం అందుబాటులో ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement