అందుబాటులో ఉంటా
- సబ్-కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ
విజయవాడ : ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని విజయవాడ సబ్-కలెక్టర్ షణ్ముగం నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసి బదిలీ అయిన డి.హరిచందన నుంచి నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సబ్-కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరైనా ఎప్పుడైనా కలవ వచ్చన్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన ని చెప్పారు.
విజయవాడ రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చట్టప్రకారం భూసేకరణ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం రూపొం దించిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ప్రయత్ని స్తామన్నారు. పేదల సంక్షే మానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
అధికారులు, సిబ్బంది సహకారంతో డివిజన్‌లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. విజయవాడ సబ్-కలెక్టర్‌గా తొలి బాధ్యతలు స్వీకరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ అధికారులు,సిబ్బందిని, కార్యాలయ పరిపాలనా అధికారి జయశ్రీ సబ్-కలెక్టర్‌కు పరిచయం చేశారు.
ప్రొఫైల్
ఎస్.నాగలక్ష్మి, 2012 బ్యాచ్ ఐఏఎస్,
విద్యార్హతలు : బిఇ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బిట్స్‌బిలానీ.
స్వస్థలం : కోయంబత్తూర్ తమిళనాడు.
శిక్షణ : అనంతపురం జిల్లా