nagalaksmi
-
కష్టాలపై ‘నాగా’స్త్రం
దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో స్థిరపడి పలువురికి ఆదర్శంగా నిలిచిన గిరిజన ముద్దుబిడ్డలను ఇటీవల మహిళా శిరోమణి అవార్డుతో ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ సన్మానించింది. వీరిలో నాగలక్ష్మి ఒకరు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన పలువురు గిరిజన ముద్దుబిడ్డ లను అఖిల భారత బంజారా సేవాసంఘ్ ఆదివారం సన్మానించనుంది. జిల్లా గర్వించదగిన మహిళల్లో ఒకరైన సన్మాన గ్రహీత నాగలక్ష్మి ఆదర్శ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, అనంతపురం: మాది పెనుకొండ మండలం అడదాకులపల్లి తండా. నాన్న రామానాయక్, తల్లి సక్కుబాయి. మేము ముగ్గురం సంతానం. అందరం ఆడపిల్లలమే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా అమ్మ, నాన్న కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. కూలి పనులు లేనప్పుడు కొండలపైకి వెళ్లి చీపురు పుల్లలు తీసుకొచ్చి వాటిని కట్టకట్టి అమ్ముకుని జీవించేవాళ్లం. వారిలా మేము కష్టపడకూడదని అమ్మ, నాన్న భావించి.. మమ్మల్ని బాగా చదివించాలని అనుకున్నారు. ఏఐఐసీ చైర్పర్సన్ రోజా చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్న నాగలక్ష్మి (ఫైల్) అక్కడే ఉంటే ఆ పరిస్థితులు మమ్మల్ని కూలీలుగా ఎక్కడ మారుస్తాయోనని భయపడి అమ్మ మమ్మల్ని పిలుచుకుని ఒంటరిగా అనంతపురానికి చేరుకుంది. ఇక్కడ నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇంటిలో గ్రైండర్ ఏర్పాటు చేసుకుని, అమ్మ స్వశక్తితో మమ్మల్ని చదివించసాగింది. మా ఉన్నతి కోసం అమ్మ పడిన కష్టం నేనెన్నటికీ మరువలేను. కూలి పనులు చేశా.. మా అక్కచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. మా అమ్మ కష్టమేమిటో చాలా దగ్గరగా చూసిన దాన్ని కూడా నేనే. ఇంటికి ఆసరాగా ఉంటుందని అమ్మతో పాటు కూలీ పనులకు నేను కూడా వెళ్లేదాన్ని. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఏ మాత్రం తీరిక దొరికినా పుస్తకాలు ముందేసుకుని కూర్చొనేదాన్ని. అనంతపురానికి వచ్చేసిన తర్వాత ఇక్కడి తొలుత అశోక్‌నగర్‌లోని నీలి షికారీ పాఠశాలలో, తర్వాత గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలల్లో 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇల్లు జరగడం కష్టంగా ఉండడం గమనించి, మదనపల్లిలోని సీఎస్ఐ మిషనరీ వారు అక్కడి హాస్టల్లో సీటు ఇచ్చారు. అక్కడే ఉంటూ పదో తరగతి పూర్తి చేశాను. తిరిగి ఇంటర్, డిగ్రీ ఇక్కడే అనంతపురంలోనే పూర్తి చేశాను. ఎంఏ., ఎంఫిల్‌ను సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశా. జీవిత గమ్యాన్ని మార్చిన చదువు చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తలను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. అనుకోని విధంగా మా నాన్న చనిపోయిన తర్వాత నా చెల్లెళ్లు జీవితంలో స్థిరపడేలా చేయగలిగాను. ఉద్యోగానికీ పోరాటమే.. ఉన్నత చదువులు ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. అక్కడే ఉంటే నేను నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువ కాలేనని అనుకున్నా. దీంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారే 2001 ఆఖరులో జిల్లా ఉపాధి కల్పనాధికారిగా అవకాశం వచ్చింది. అయితే ఓ ఓసీ అమ్మాయి అందజేసిన తప్పుడు సరి్టఫికెట్ కారణంగా ఆ ఉద్యోగం కాస్తా నాకు దక్కకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు విచారణ అనంతరం 2004లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో హైదరాబాద్‌లో ఉపాధి కల్పనాధికారిగా బాధ్యతలు తీసుకున్నా. అక్కడ ఓ రెన్నెల్ల పాటు పనిచేశా. ప్రొహిబిషన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి నేను చేస్తున్న పని నాకు తృప్తినివ్వలేదు. ఆ సమయంలోనే గ్రూప్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించి, శ్రీకాకుళంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరా. 2009లో ఇదే శాఖలో విజయనగరం సూపరింటెండెంట్‌గా పనిచేశాను. 2012 నుంచి శ్రీకాకుళం, కడప జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాను. ఈ ఏడాది జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందాను. నేను చెప్పేది ఒక్కటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే దాన్ని సులువుగా సాధించవచ్చు. ఇందుకు నేనే నిదర్శనం. నేడు సత్కారం దేశవ్యాప్తంగా వివిధ హోదాలలో స్థిరపడిన గిరిజన ముద్దు బిడ్డలను ‘ఆల్ ఇండియా బంజరా సేవా సంఘ్’ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించనున్నారు. స్థానిక రెండో రోడ్డులోని బంజారా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బాలానాయక్, రంగ్లానాయక్, అశ్వత్థనాయక్, శేఖర్ నాయక్ తెలిపారు. ఈ సత్కారాన్ని అందుకునేందుకు విజయవాడ నుంచి నాగలక్ష్మితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన గిరిజన ఉద్యోగులు 35 మంది రానున్నారు. నా జీవితమే ఓ పాఠం చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. – నాగలక్ష్మి.టి.రమావత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ -
కొండచరియలు విరిగిపడి మహిళ మృతి
విజయవాడ గుణదల ప్రాంతంలోని బెత్లహామ్ నగర్లో బుధవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఈ ఘటనలో పాకాల నాగలక్ష్మి (40) బండరాయి కింద చిక్కుకుని మృతి చెందగా, ఆమె కుమార్తె ఆశాజ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది వచ్చి రాయిని కట్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆశాజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, అర్ధరాత్రి 2 గంటల నుంచి గంటపాటు విజయవాడ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
ఆరు నెలల క్రితమే వివాహం...
కొయ్యలగూడెం : మండలంలోని కన్నాపురం దళితవాడకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన యడ్లపల్లి నాగలక్ష్మి(18)ని కన్నాపురానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. మూడు నెలల క్రితం నాగలక్ష్మికి గర్భస్రావం జరిగింది. దీనిపై గోపి తల్లీదండ్రులు, కుటుంబసభ్యులతో నాగలక్ష్మికి తరచూ గొడవ చోటు చేసుకునేది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నాగలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి దుర్గయ్యకు గోపి కుటుంబ సభ్యులు ఫోన్లో సమాచారం అందించారు. అయితే తన కుమార్తె మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని, అత్తమామలు, భర్త గోపి నాగలక్ష్మి మృతికి కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుర్గయ్య పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం సీఐ బాలరాజు, ఎసై్స పి.చెన్నారావులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ఏఈపై నీళ్ల సీసాతో దాడి
తోటి మహిళా ఏఈపై ఓ ఏఈ నీళ్ల సీసాతో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేటీపీఎస్ కర్మాగారంలో శనివారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేటీపీఎస్ ఐదో దశలో రవి అనే ఏఈ అపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ సమస్య ఎదురవగా.. దాన్ని ఆయన పరిష్కరించలేకపోయారు. అయితే, జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న నాగలక్ష్మి అనే ఏఈ సమస్యను సరిచేశారు. ఈ క్రమంలో రవి మహిళా ఏఈని కించపరిచేలా మాట్లాడాడు. దీనిపై వారి మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహంతో రవి నీళ్ల సీసాను నాగలక్ష్మిపై విసిరేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. దీనిపై ఆమె చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగినిపై దాడి చేసిన ఏఈ రవిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. -
అనాథ యువతికి కొత్త జీవితం
వివాహం నిశ్చయించిన స్టేట్ హోం అధికారులు ఘనంగా నిశ్చితార్థం...ఫిబ్రవరిలో పెళ్లి వెంగళరావునగర్: స్టేట్‌హోంలోనే చిరుద్యోగం చేస్తున్న ఓ అనాథ యువతికి గురువారం స్టేట్‌హోం అధికారులు వివాహ నిశ్చితార్థం జరిపించారు. గుంటూరుకు చెందిన నాగలక్ష్మి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు ఆమెను 2008లో నగరానికి తీసుకువచ్చి మధురానగర్‌కాలనీలోని ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు అదే ప్రాంగణంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ చిరుద్యోగిగా పని చేస్తూ జీవిస్తుంది. గత రెండు నెలల కిందట మోహిదీపట్నంలో నివాసం ఉండే ప్రతాప్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని, తగిన యువతి ఉంటే చూపించాలని స్టేట్‌హోం అధికారులను కోరారు. దీనికి స్పందించిన అధికారులు ప్రతాప్ కుటుంబ పరిస్థితిని, పూర్తి వివరాలను సేకరించి అతనికి నాగలక్ష్మిని ఇవ్వడానికి సమ్మతించారు. ప్రస్తుతం నాగలక్ష్మి శిశువిహార్‌లో కేర్‌టేకర్‌గా పని చేస్తుంది. ఒకరికొకరు నచ్చడంతో గురువారం ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. కార్యక్రమానికి అమ్మాయి తరఫున పెద్దలుగా స్టేట్‌హోం రీజనల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, రిటైర్డ్ ఆర్డీడీ ప్రమోదినీ రాణి, ప్రాజెక్ట్ డెరైక్టర్ (హైదరాబాద్) ఆశ్రీత, రంగారెడ్డి జిల్లా పీడీ విజయలక్ష్మి, స్టేట్‌హోం ఇన్చార్జి బి.ఎన్.గిరిజ, చిల్డ్రన్స్‌హోం ఇన్చార్జి లక్ష్మీకుమారి, సర్వీస్‌హోం ఇన్చార్జి రసూల్, శిశువిహార్ ఇన్చార్జి కృపా స్వరూపా రాణి, రెస్క్యూహోం ఇన్చార్జి నిర్మల తదితరులు హాజరు కాగా, అబ్బాయి తరఫున తల్లిదండ్రులు పద్మావతి, దత్తాత్రి తదితర బంధువులు హాజరయ్యారు. ఇరువురి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన స్టేట్‌హోంలోనే జరుపనున్నట్టు అధికారులు తెలియజేశారు. -
అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు
సత్యనారాయణపురం : ఓ లాయర్ అసభ్యంగా ప్రవ ర్తించాడని ఒక యువతి సత్యనారాణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథ నం మేరకు.. రెడ్డి నాగలక్ష్మి స్థానిక నాగేశ్వరరావు పంతులు రోడ్డులోని దుర్గా ఆయిల్ మిల్ పైన నివసిస్తోంది. డీలర్ అయిన తల్లి మృతి చెందడంతో నాగలక్ష్మి రేషన్‌డిపో నడుపుతోంది. ఆమె డబ్బు అవసరమై ఇద్దరి వద్ద రూ.3.80లక్షలు అప్పుగా తీసుకుంది. బాకీ తీర్చేందుకు లాయర్ తాతారావు వద్ద రూ.4 లక్షలు తీసుకుంది. అందుకు తన పేరుతో ఉన్న రేకులషెడ్డును అతని పేర జీపీ చేయించింది. ఇంకా బాకీ ఉండడంతో రేకుల షెడ్డును విక్రయించి బాకీలు తీర్చాలని నాగలక్ష్మి భావించి లాయర్‌ను సంప్రదించింది. అయితే తాను ఫోన్లో మాట్లాడతానని చెప్పిన లాయర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సత్యనారాయణపురంలోని ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో పెద్దమనుషుల వద్ద రాజీకి ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తుచేపట్టారు. -
మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ
‘‘మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది. మా అబ్బాయి ఆ పాట మాకు వదిలి తను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’ అని బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. కమలాకర్ హీరోగా చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో బి. నాగలక్ష్మి నిర్మించిన ‘బ్యాండు బాలు’ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమలాకర్ తల్లి వెంకాయమ్మ తన కొడుకుని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో ‘అమ్మ...’ మీద ఉన్న పాటను తన గుర్తుగా మాకు వదిలేసి, తను వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. కమలాకర్ పిల్లల కోసం తాము బతుకుతున్నామనీ, లేకపోతే తను వెళ్లిపోయినప్పుడే మేమూ... అంటూ దుఃఖంతో మాట్లాడలేకపోయారు. కమలాకర్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘2012లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, పది నెలల్లో పూర్తి చేశాం. విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో కమలాకర్ మరణం మమ్మల్ని కలిచివేసింది. ఆ మానసిక క్షోభ కారణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సినిమా మీద మమకారంతో లాభాలను బేరీజు వేసుకోకుండా కమలాకర్ సినిమాలు తీసి, పది మందికి ఉపాధి కల్పించాడని నటుడు చలపతిరావు చెప్పారు. దర్శకుడు చింతలపూడి వెంకట్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ మీద ఒక పాట ఉంది. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో వెంకాయమ్మగారు షూటింగ్‌కి వస్తే, ఆవిడ కూడా ఉంటే బాగుంటుందన్నాను. కానీ, కమలాకర్ వద్దన్నాడు. చివరికి ఆయన భార్య, ‘అమ్మ పాటే కదా.. ఉంటే బాగుంటుంది’ అనడంతో కమలాకర్ అంగీకరించాడు. ఈ విధంగా ఈ పాటలో ఆమె ఉన్నారు. ‘ప్రతి తల్లికీ ఈ పాట మంచి బహుమతి’ అని కమలాకర్ అనేవారు. అంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు. కమలాకర్ సోదరుడు శివప్రసాద్‌రెడ్డి, నటులు బెనర్జీ, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. -
రెండు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి
దసరా ఉత్సవాలపై సబ్ కలెక్టర్, పోలీసు కమిషనర్ సమీక్ష భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటన సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా జరుగుతున్న దసరా ఉత్సవాలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి, భక్తులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నాగలక్ష్మి, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వారు దసరా ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని, 24 ఉదయం నుంచి పోలీసులు దసరా ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొంటారని తెలిపారు. ఏటా రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, ఈసారి మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని వివరించారు. నగర పోలీసులను కేవలం పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగిస్తామని, నగరంలో శాంతి భద్రతల విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీఐపీలకు పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు పోలీసు నిబంధనలు సడలిస్తామని తెలిపారు. భక్తులకు అర్థమయ్యే విధంగా రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇబ్బందుల్లేకుండా చూస్తాం : సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, స్థానఘాట్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. మూలా నక్షత్రం, విజయదశమి రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడకుండా అమ్మవారి దర్శనం త్వరగా అయ్యేలా చూస్తామని చెప్పారు. విద్యుత్, ఇరిగేషన్ సమస్యలు లేకుండా ఆయా శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వేల మంది భక్తులు తరలి వస్తున్నందున, వారికి కావాల్సిన ప్రసాదాలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావును ఆహ్వానించామన్నారు. దుర్గాష్టమి, మహార్ణవమి ఒకే రోజు వచ్చినందున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రతి ప్రాంతంలో దేవస్థానం సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారిని అడిగి భక్తులు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉంటా
సబ్-కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతల స్వీకరణ విజయవాడ : ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని విజయవాడ సబ్-కలెక్టర్ షణ్ముగం నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసి బదిలీ అయిన డి.హరిచందన నుంచి నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సబ్-కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరైనా ఎప్పుడైనా కలవ వచ్చన్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాన ని చెప్పారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చట్టప్రకారం భూసేకరణ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం రూపొం దించిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ప్రయత్ని స్తామన్నారు. పేదల సంక్షే మానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతో డివిజన్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. విజయవాడ సబ్-కలెక్టర్‌గా తొలి బాధ్యతలు స్వీకరించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ అధికారులు,సిబ్బందిని, కార్యాలయ పరిపాలనా అధికారి జయశ్రీ సబ్-కలెక్టర్‌కు పరిచయం చేశారు. ప్రొఫైల్ ఎస్.నాగలక్ష్మి, 2012 బ్యాచ్ ఐఏఎస్, విద్యార్హతలు : బిఇ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బిట్స్బిలానీ. స్వస్థలం : కోయంబత్తూర్ తమిళనాడు. శిక్షణ : అనంతపురం జిల్లా -
మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డీసీ దాడులు
శ్రీకాకుళం క్రైం: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మద్యం దుకాణాలపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి దాడులకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దుకాణాలపై ‘అధికారులకు మామూళ్ల కిక్కు... ప్రజలకేది దిక్కు’ శీర్షికతో ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనంపై ఆమె స్పందించారు. కిందిస్థాయి అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతే ఆమె నేరుగా రంగంలోకి దిగారు. ముందుగా జెడ్పీ వద్ద ఉన్న శ్రీసాయినాధ్ వైన్స్ దుకాణానికి వెళ్లారు. అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దుకాణాన్ని మార్చాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించిన సంగతి తెల్సిందే. దీనిపై డీసీ స్థానికులతో మాట్లాడారు. ఈ దుకాణంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దాన్ని తరలించాలని మహిళలు చెప్పారు. నిబంధనల ప్రకారమే దుకాణం ఏర్పాటు చేశారని డీసీ అన్నారు. అయితే స్థానికులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని మార్పుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దుకాణం మార్చడానికి కొద్ది రోజులు వ్యవధి ఇస్తామని అప్పటివరకూ అటువైపు వెళ్లవద్దని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ దుకాణం మార్చాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. మార్పు విషయంలో శాఖాపరంగా కొంత రికార్డు వర్కు చేయాల్సి ఉందన్నారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న విజయలక్ష్మి మద్యం దుకాణాన్ని పరిశీలించారు. 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఉండకూడదని యజమానికి డీసీ చెప్పారు. దీనిపై యజమాని మాట్లాడుతూ ఆస్పత్రి ప్లాన్ ప్రకారం కాకుండా ఉండడంతో తమ దుకాణం వంద మీటర్ల లోపులకు వచ్చిందని వివరించారు. అయితే ప్లాన్‌తో సంబంధం లేదని, గేటు నుంచి 100 మీటర్ల దూరం పరిగణిస్తామని డీసీ బదులిచ్చారు. దీంతో 100 మీటర్లు లోపు లేకుండా దుకాణాన్ని వెనక్కు మార్పు చేస్తామని యజమాని తెలియజేశారు. ఆమె వెంట శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.ఏసుదాసు, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుకేష్ ఉన్నారు. -
ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి
తాడేపల్లి: విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలు గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో ఆదివారం తెల్లవారు జామున కనిపించాయి. రెండు జిల్లాల్లో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడపకు చెందిన యలమంచిలి నాగలక్ష్మి(17), పెనమలూరుకు చెం దిన బిళ్లా పల్లవి(17) విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కలసి ఒకే బస్సులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం వారు కాలేజికి వెళ్లి తిరిగిరాలేదు. కానీ వారి పుస్తకాల బ్యాగ్ లు సీతానగరం సమీపంలోని నది ఒడ్డున శనివారం రాత్రి పోలీసులకు లభ్యమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున వారి మృత దేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ముగ్గురు బాలికలు రెండు రోజుల నుంచి కళాశాలకు హాజరు కాలేదని చెబుతున్నారు. వారు ఇళ్లకు రాకపోయేసరికి తల్లిదండ్రులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆచూకీ కోసం వాకబు చేశామని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్నట్లు వారి బ్యాగుల్లో లభిం చిన దర్శనం టికెట్ల ద్వారా తెలుస్తోంది. శనివా రం సాయంత్రం వారు ఇసుక తిన్నెల్లో కనిపించినట్టు స్థాని కుల సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు కోపం...భర్త హతం
-
భార్య చేతిలో భర్త హతం
జూలపల్లి, న్యూస్‌లైన్ : కలకా లం తోడుండాల్సిన భర్తను భార్యే కడతేర్చింది. విలాసాలకు అలవాటుపడ్డ ఆమె మానసికస్థితి అదుపుతప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన జూలపల్లి మండ లం తేలుకుంటలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్ప వెంకటనరహరి(42) వివాహం కరీంనగర్ మండలం చెర్లబూత్కుర్కు చెందిన నాగలక్ష్మితో 22 ఏళ్ల క్రితం జరిగింది. కొడుకు, కూతురు సంతానం. కొడుకు ఇంజినీరింగ్ చదువుతుండగా, కూతురు ఇంటర్ చదువుతోంది. విలాసాలకు అలవాటుపడ్డ నాగలక్ష్మి మానసిక స్థితి కొన్నిరోజులుగా అదుపుతప్పింది. ఈ క్రమంలో భర్త గతంలో కూతురు పేరిట డిపాజిట్ చేసిన డబ్బులు వచ్చా యి. అతడు ఆ డబ్బులను మళ్లీ డిపాజిట్ చేశాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. బుధవా రం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో వెంకటనరహరి పడుకుని ఉండగా ఆమె రోకలిబండతో అతడి తలపై బా దింది. తలపగిలి అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ సీఐ సత్యనారాయణ, ఎస్సై నాగేశ్వర్రావు తెలిపారు. నాగలక్ష్మి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.