మహిళా ఏఈపై నీళ్ల సీసాతో దాడి | attack on women AE with water bottle | Sakshi
Sakshi News home page

మహిళా ఏఈపై నీళ్ల సీసాతో దాడి

Published Sat, Jan 9 2016 7:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

attack on women AE with water bottle

తోటి మహిళా ఏఈపై ఓ ఏఈ నీళ్ల సీసాతో దాడి చేశాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేటీపీఎస్ కర్మాగారంలో శనివారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కేటీపీఎస్ ఐదో దశలో రవి అనే ఏఈ అపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఓ సమస్య ఎదురవగా.. దాన్ని ఆయన పరిష్కరించలేకపోయారు.


 అయితే, జనరల్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న నాగలక్ష్మి అనే ఏఈ సమస్యను సరిచేశారు. ఈ క్రమంలో రవి మహిళా ఏఈని కించపరిచేలా మాట్లాడాడు. దీనిపై వారి మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహంతో రవి నీళ్ల సీసాను నాగలక్ష్మిపై విసిరేశాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. దీనిపై ఆమె చీఫ్ ఇంజనీర్‌కు ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగినిపై దాడి చేసిన ఏఈ రవిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement