కొండచరియలు విరిగిపడి మహిళ మృతి | Woman killed in landslides | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

Published Thu, Jun 2 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

Woman killed in landslides

విజయవాడ గుణదల ప్రాంతంలోని బెత్లహామ్ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఈ ఘటనలో పాకాల నాగలక్ష్మి (40) బండరాయి కింద చిక్కుకుని మృతి చెందగా, ఆమె కుమార్తె ఆశాజ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

 

విపత్తు నిర్వహణ సిబ్బంది వచ్చి రాయిని కట్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆశాజ్యోతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, అర్ధరాత్రి 2 గంటల నుంచి గంటపాటు విజయవాడ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement