
సాక్షి, విజయవాడ: రానున్న నాలుగైదు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం.. గుంటూరు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. (గంటా ఆస్తుల వేలం..)
Comments
Please login to add a commentAdd a comment