విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు | Vims the post of Director mullapanpu | Sakshi
Sakshi News home page

విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు

Published Thu, Oct 16 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

బళ్లారి విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు కానుంది. డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టినవారు నాలుగేళ్లు పదవిలో కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగేళ్లలో ఏడు మంది డెరైక్టర్లు మారడం చర్చనీయాంశమైంది.

సాక్షి, బళ్లారి : బళ్లారి విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు కానుంది. డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టినవారు నాలుగేళ్లు పదవిలో కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగేళ్లలో ఏడు మంది డెరైక్టర్లు మారడం చర్చనీయాంశమైంది. కేవలం ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విమ్స్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ ఉన్నఫళంగా రాజీనామా చేశారు.

వారం రోజుల క్రితం విమ్స్ డెరైక్టర్‌గా నియమితులైన ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు పేర్కొన్నప్పటికి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని తెలుస్తోంది. విమ్స్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డిని ఉన్నఫళంగా తొలగించి డాక్టర్ శంకర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్,సెక్రటరీలు విమ్స్ ఆస్పత్రిని సందర్శించి,హెచ్‌ఓడీలు,వైద్యులతో సమస్యలు తెలుసుకుని బెంగళూరుకు వెళ్లారు.

మరుసటి రోజు విమ్స్ డెరైక్టర్‌గా శంకర్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఎల్‌ఎన్‌రెడ్డికి, మంత్రికి సరిపోకపోవడంతోనే ఆయన స్థానంలో శంకర్‌ను ఏర్పాటు చేసినట్లు వదంతులు వచ్చాయి  అయితే శంకర్ ఎందుకు రాజీనామా చేశారన్నది వైద్య వర్గాల్లోనే కాకుండా నగరంలోహాట్‌టాపిక్ మారింది. సౌమ్యుడు,మంచి  వైద్యుడుగా పేరున్న శంకర్ రాజీనామా లేఖను పంపారని తెలియగానే విమ్స్‌కు కొత్త బాస్ ఎవరుని నియమిస్తారనే చర్చసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement