
సాక్షి, హైదరాబాద్: సమీకృత ఫార్మాపార్క్‌కు అన్ని విధాలా సాయమందిచాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది.
దీంతోపాటు నిమ్జ్ హోదాకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.ఫార్మాసిటీ మౌలిక వసతులకు రూ.1,318 కోట్లు, సాంకేతిక సదుపాయాల కల్పనకు రూ.2,100 కోట్ల కోసం కేంద్ర ఆర్థిక సాయం అందించాలి’అని కేంద్ర మంత్రి గోయల్‌ను లేఖలో కోరారు. ఫార్మా సిటీకి అవసరమైన సహజ వాయువు సరఫరా కేటాయింపుల కోసం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మరో లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment