ఢిల్లీలో కేటీఆర్‌.. కేంద్రమంత్రులతో భేటీ | ktr met union ministers | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కేటీఆర్‌.. కేంద్రమంత్రులతో భేటీ

Published Tue, Apr 11 2017 4:46 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ఢిల్లీలో కేటీఆర్‌.. కేంద్రమంత్రులతో భేటీ

ఢిల్లీలో కేటీఆర్‌.. కేంద్రమంత్రులతో భేటీ

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి సంబంధిత శాఖలకు సంబంధించిన వినతి పత్రాలు అందించారు. ముందుగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్థికమంత్రి, ప్రస్తుతం హోంశాఖను కూడా నిర్వహిస్తున్న అరుణ్‌జైట్లీని కలిసి కంటోన్మెంట్‌ ప్రాంతంలో స్కైవేల ఏర్పాటు అత్యవరం అని, ఆ ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరోపక్క, విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్‌ను కలిసి తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే వారి సమస్యలు, ఇతర విషయాలు చర్చించారు. ఈసందర్భంగా కూడా కొన్ని వినతులతో కూడిన పత్రాన్ని అందించారు. ఇలా, ఆయా శాఖల మంత్రులను కేటీఆర్‌ కలుస్తూ ఢిల్లీలో సందడిగా కనిపించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో కేటీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌, బాల్కసుమన్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement