
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వరుసగా..
1.సదానందగౌడ
2.రవిశంకర్‌ప్రసాద్
3.థావర్‌చంద్ గెహ్లాట్
4.రమేశ్ పోఖ్రియాల్
5.హర్షవర్థన్
6. ప్రకాశ్ జవదేకర్
7.సంతోష్‌కుమార్ గాంగ్వార్
8.బాబుల్ సుప్రియో
9.సంజయ్ దోత్రే
10.రతన్‌లాల్ కతారియా
11.ప్రతాప్‌చంద్ర సారంగి
12.దేవశ్రీ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment