'ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలి' | ysrcp MLA ramireddy prathap reddy takes on chandra babu | Sakshi
Sakshi News home page

'ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలి'

Published Sun, Aug 2 2015 3:11 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి విమర్శించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలనే ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది రావాలనే ఆగస్టు 10న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నట్టు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement