కేంద్రమంత్రులకు బీజేపీ నేతల సత్కారం | Central Ministers garling | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రులకు బీజేపీ నేతల సత్కారం

Published Mon, Jul 25 2016 12:45 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Central Ministers garling

ముత్తుకూరు :  కృష్ణపట్నంపోర్టుకు ఆదివారం వచ్చిన కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభాకర్‌ప్రభు, ఎం. వెంకయ్యనాయుడును స్థానిక బీజేపీ నేతలు పట్టుశాలువాలతో సన్మానించారు. ‘పోర్టు సైడ్‌ కంటైనర్‌ ఫెసిలిటీ’ విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రమంత్రులను స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు వంశీధర్‌రెడ్డి, షేక్‌ షఫీవుల్లా, రవీంద్రరెడ్డి, రవీంద్ర, ప్రసాద్, పోలయ్య, రఘు, శరత్‌ తదితరులు సత్కరించారు.
మొరాయించిన రిమోట్‌ 
పోర్టు సైడ్‌ కంటైనర్‌ ఫెసిలిటీ విభాగం ప్రారంభోత్సవానికి వేసిన శిలాఫలకం ఆవిష్కరణలో జాప్యం చోటుచేసుకుంది. రిమోట్‌ పనిచేయలేదు. దీంతో కేంద్రమంత్రులు వేదిక చివరకు వచ్చి రిమోట్‌తో శిలాఫలకం ఆవిష్కరించాల్సి వచ్చింది. పోర్టు సౌత్‌ బెర్తు వద్ద సీవీఆర్‌ లింక్స్‌ పేరుతో నిర్మించిన గోల్ఫ్‌కోర్సును కేంద్రమంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్‌ ఆడారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement